రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. అందువలోనూ ముడి తేనె అయితే మేలు అని నిపునులు అంటున్నారు.క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా తేనెలో ఉంటాయి.ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె,సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే మలబద్ధకం,ఛాతీ మంట తగ్గుతాయి.ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనె,నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. చెంచా తేనెకి…చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు,దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.పంటిసమస్యల నుంచీ ఉపశమనం కలుగుతుంది.రెండు చెంచాల యాపిల్‌సిడార్ వెనిగర్‌కి…
Author: admin
‘మర్డర్’తో గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్.తాజాగా ఆమె తన రిలేషన్ షిప్ స్టేటప్‌పై స్పందించారు.తాను సింగిల్‌గానే ఉన్నానని చెప్పారు.తన ప్రియుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో బ్రేకప్ అయిందన్నారు.‘‘పెళ్లిపై నేను వ్యతిరేకం కాదు.అలా అని అందుకు సిద్ధంగానూ లేను.ప్రస్తుతం ఉన్న రోజుల్లో సరైన వ్యక్తిని ఎంచుకోవడం ఎంతో క్లిష్టమైన విషయం’’ అని చెప్పారు.బ్రేకప్ గురించి తాను చెప్పాలనుకోవడం లేదన్నారు.సింగిల్‌గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు.
అదానీతో జగన్ మోహన్ రెడ్డి గారు చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ. 1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని టీడీపీ-జనసేన-బీజేపి కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లక్షా 50వేల కోట్ల రూపాయల దోపిడిలో జగన్ గారికి ముట్టే వాటాలు ఎంత? ఇందంతా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.17వేల కోట్ల భారం మోపారు. దీనికి అదనంగా అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందాలకు ప్రతి ఏటా రూ.5వేల కోట్ల భారం పడనుందని షర్మిల లేఖలో పేర్కొన్నారు. అదానీతో @gautam_adani జగన్ మోహన్ రెడ్డి @ysjagan గారు చేసుకున్న…
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకుడు. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుక విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.నవంబర్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.తెలుగు,తమిళం,కన్నడ, మలయాళం,హిందీలో అందుబాటులో ఉండనుంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తో్న్న చిత్రం ‘కన్నప్ప’.ముఖేశ్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.ఈ సినిమా విడుదల విషయంలో నెలకొన్ని సందిగ్ధతకు విష్ణు చెక్ పెట్టారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తాజాగా ప్రకటించారు. భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘కన్నప్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ఇది సిద్ధం కానున్న విషయం తెలిసిందే.ప్రభాస్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. #HarHarMahadevॐ #Kannappa🏹 pic.twitter.com/qGFxAOKp14— Vishnu Manchu (@iVishnuManchu) November 25, 2024
అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రభావంతో దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ బీఎస్ఈలో 992 పాయింట్ల లాభంతో 80,109 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 314 పాయింట్లు లాభపడి 24,221 వద్ద ముగిసింది. సెన్సెక్స్ అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.30గా కొనసాగుతోంది.
ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ప్రయోగాలను చేపడుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డిసెంబర్ నెలలో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది. పీ.ఎస్.ఎల్.వీ.సీ-59, పీ.ఎస్.ఎల్.వీ.సీ-60 రాకెట్లను ప్రయోగించడానికి సమాయత్తం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట షార్ ప్రయోగ కేంద్రం నుండి జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీ.ఎస్.ఎల్.వీ. సీ-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. పీ.ఎస్.ఎల్.వీ.సీ-60 ద్వారా రిశాట్-1బీ అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.
యానిమల్ విమర్శలపై ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో రణ్‌బీర్ కపూర్ స్పందించారు. ప్రేక్షకుల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. నటీనటులు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలు పోషించాలన్నారు. ‘‘యానిమల్‌పై అందరి అభిప్రాయాలను స్వీకరిస్తా. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావడం మా బాధ్యత. అలాగే కొత్తదనాన్ని ప్రోత్సహించాలి. నటీనటులకు ఇది చాలా ముఖ్యం’’ అన్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, రష్మిక జంటగా నటించారు. ఈసినిమా తీవ్ర హింసను ప్రోత్సహించిందని పలువురు విమర్శలు చేశారు.
‘పుష్ప’ ఈవెంట్‌లో నటి రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.‘‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’’అని హోస్ట్ ప్రశ్నించింది. ‘‘ఇది అందరికీ తెలిసిన విషయమే’’ అని రష్మిక నవ్వులు పూయించారు.ఆమె సమాధానంతో ప్రాంగణం అంతా గోల చేశారు.శ్రీలీల, బన్నీ, దేవిశ్రీప్రసాద్ నవ్వులు పూయించారు ఆమె విజయ్ దేవరకొండ గురించి పరోక్షంగా చెప్పారని భావిస్తున్నారు.తనకు గోవాలో బంగ్లా ఉందని వస్తోన్న కథనాల్లో నిజం లేదన్నారు.తనకు సొంత ఇల్లు లేదని తాను అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నానని చెప్పారు.వార్తల్లో వచ్చే అన్నింటినీ నమ్మవద్దన్నారు.
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్.సీ.ఆర్.) హెడ్ క్వార్టర్స్ నిర్మాణాలు వేగవంతం చేస్తున్న సందర్భంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్’ లో లోకేష్ పోస్ట్ చేశారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కల చివరికి నిజమవుతోందని లోకేష్ పేర్కొన్నారు. Heartfelt thanks to Hon'ble PM Sri @narendramodi Ji and Minister for Railways Sri @AshwiniVaishnaw Ji for expediting the construction of the South Coast Railway (SCoR) zone headquarters in Visakhapatnam. This long-awaited dream is finally becoming a reality. pic.twitter.com/O9IEZLXHaA— Lokesh Nara (@naralokesh) November 25, 2024