మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది.ఈ మేరకు కూటమి నేతలు ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్,అజిత్ పవార్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు.ముగ్గురు నేతలు మిఠాయిలు పంచుకున్నారు.ఈ మేరకు ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ…ఉద్ధవ్ థాకరేపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం అంటే ఫేస్ బుక్ కాదని విమర్శించారు.నాయకుడు అనేవాడు ప్రజల మధ్య పని చేయాలని బాలాసాహెబ్ థాకరే చెప్పేవారని…ఆయన చెప్పినదాన్ని తాము పాటిస్తూ వచ్చామని పేర్కొన్నారు.ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు అన్నారు.
Author: admin
ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఈ వేలం జరగనుంది.అయితే ఈసారి వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 204 స్లాట్స్ కోసం వీరు వేలంలో పోటీ పడనున్నారు. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు కాగా, 210 మంది విదేశీ క్రికెటర్లు. కాగా ఈసారి ఈ వేలం పాటలో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు కూడా నమోదయ్యాడు.జిల్లాలోని రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయతీ నూతిగుంటపల్లికి చెందిన యద్దెల చంద్రశేఖర్ రెడ్డి, హేమలత దంపతుల కుమారుడు యద్దెల గిరీశ్ కుమార్ రెడ్డి (25) ఐపీఎల్ వేలానికి వెళ్తున్నాడు.తద్వారా వేలానికి వెళ్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెటర్‌గా నిలిచాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచి 10 మ్యాచుల్లోనే 18 వికెట్లు తీశాడు.వన్డేలు,టీ-20ల్లో…
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.ఈ మేరకు అభివృద్ధి,సుపరిపాలన గెలిచాయని ఆయన పేర్కొన్నారు.మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని ఆనందం వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ఓటర్లు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.ఐక్యంగా ఉండడం వల్ల మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రధాని అభిప్రాయపడ్డారు.మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కూటమి కృషి చేస్తుందని హామీ మోదీ ఇచ్చారు. కాగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.ఝార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి విజయం సాధించినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.అలానే విపక్షంగా ప్రజల సమస్యలను లేవనెత్తడంలో,రాష్ట్రం కోసం పనిచేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని వెల్లడించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎం చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడుల కేసులనూ పోలీసులు రీ-ఓపెన్ చేశారు.తాజాగా కృష్ణా జిల్లా నందిగమలో జరిగిన రాళ్ల దాడి కేసును రీ-ఓపెన్ చేసి ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముగ్గురూ వైసీపీ నేతలు…సిఎం చంద్రబాబు నందిగామకు వెళ్లినప్పుడు వాహనం పై నుండి నిలబడి ప్రసగిస్తున్న సమయంలో ప్లాన్ ప్రకారం రాళ్లు విసిరారు.ఈ రాళ్లు దాడిలో ఆయన పక్కనే ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.విచారణ చేయాల్సిన కాంతిరాణా టాటా పూలతో కలిసి రాళ్లు పడ్డాయని కవర్ చేశారు.కేసును చాలా తేలిక సెక్షన్లతో నమోదు చేశారు.
బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణితో కలిసి త్వరలో భారత్ లో అధికారికంగా పర్యటించనున్నారు. ఆయన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మృతితో 2022లో ఛార్లెస్-3 భారత పర్యటన రద్దయింది. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుండి క్యాన్సర్ కు చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఆయనకు ఈ పర్యటన గొప్ప ఉపశమనంగా భావిస్తున్నారు. ఈ సారి పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూడా పర్యటించనున్నట్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది. అక్టోబరులో తన భార్య క్వీన్ కెమెల్లాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన బ్రిటన్ కింగ్ తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్నెస్ కేంద్రంలో ఆగిన విషయం తెలిసిందే.
ఇటీవల “మెకానిక్ రాకీ”చిత్రంతో అలరించిన విశ్వక్ ఇప్పుడు మరో కొత్త చిత్రంతో రానున్నాడు.‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు అని తెలుస్తుంది.ఈ చిత్రానికి ‘ఫంకీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఇది విశ్వక్ కెరీర్‌లో 14వ చిత్రంగా రాబోతుంది.గతంలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.ఇందులో కథానాయికగా ప్రియాంక మోహన్ నటించనుందని సమాచారం.ఈ చిత్రానికి భిమ్స్ సంగీతం అందిస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ఎన్నికల ప్రక్రియపై ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. అమెరికా లోని కాలిఫోర్నియా (California)లో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. భారత్ లో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు? అనే శీర్షికతో వచ్చిన ఓ వార్త కథన్నాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనికి ఆయన ‘భారత్ ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది. కానీ, కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ నెల 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించడం కూడా జరిగిపోయింది. అయినప్పటికీ కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడం గమనార్హం. ఈనేపథ్యంలో మస్క్ చేసిన పోస్ట్ ట్రెండ్…
ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో వరుసగా రెండు శతకాలు సాధించిన భారత యువ కెరటం తిలక్ వర్మ (151, 67 బంతుల్లో 14×4, 10×6) మరోసారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ఆడుతూ మేఘాలయాపై ఈ శతకం నమోదు చేశాడు. దీంతో టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా తిలక్ నిలిచాడు. భారత్ తరపున ఈ ఫార్మాట్లో 150 పైన పరుగులు చేసిన తొలి పురుష క్రికెటర్ అతడే. మహిళల్లో కిరణ్ నవిగిరె (162) ఈ ఘనత సాధించింది. కెప్టెన్ తిలక్ ధాటికి గ్రూప్-ఎ మ్యాచ్లో హైదరాబాద్ 179 పరుగుల తేడాతో మేఘాలయా పై ఘన విజయం సాధించింది. మొదట హైదరాబాద్ 4 వికెట్లకు 248 పరుగులు చేసింది. తిలక్ కి తోడు తన్మయ్ అగర్వాల్ (55) రాణించాడు. లక్ష్య ఛేదనలో అనికేత్ రెడ్డి (4/11), తనయ్ త్యాగరాజన్ (3/15)…
తాజాగా ప్రకటించిన ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున ఆడుతున్న పాండ్య తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బరోడా ఐదు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఐదో స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్య (74నాటౌట్; 35 బంతుల్లో 6×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్ తో గెలుపుని అందించాడు. శివాలిక్ శర్మ (64; 43 బంతుల్లో 7×4, 2×6) కూడా రాణించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ ఒక వికెట్ కూడా…
ఇటీవల విడుదలైన కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం “క”. నూతన దర్శకులు సుజిత్-సందీప్ సంయుక్తంగా తెరకెక్కించారు.నయన్ సారిక,తన్వీ రామ్ కథానాయికలుగా నటించారు.దీపావళి కానుకగా విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించనుంది.నవంబర్ 28 నుండి ఈటీవీ విన్‌లో ఇది ప్రసారం కానుంది. డాల్బీ విజన్:అట్మాస్‌లో దీనిని ఆస్వాదించవచ్చని ఈటీవీ విన్ పోస్ట్ పెట్టింది.కిరణ్ అబ్బవరం నటించిన తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే.సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమైంది.కిరణ్ ద్విపాత్రిభినయంలో కనిపించారు.రూ.50 కోట్లకు పైగా ఇది వసూలు చేసినట్లు సమాచారం. ఆడుదాము #KA చ్చితంగా, ఈసారి అదిరిపోయే సప్పుడు తో అద్భుతమైన పిక్చర్ తో…🔈🔉🔊Experience #KA with Dolby Vision Atmos 🤩From Nov 28 Only on @EtvWin A @SamCSmusic musical 🎶@Kiran_Abbavaram @UrsNayan @tanviram_ @DirSujith @sandeep_deep02 @srichakraas #KiranAbbavaram #EtvWin pic.twitter.com/VbwOIFS9e4— ETV…