తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో ప్రమాదాలను నివారించేందుకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.డిసెంబర్ 1వ తేదీ నుంచి వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని అధికారులు ప్రకటించారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించి రావాలని బ్యానర్‌లు, పోస్టర్‌లను పెట్టారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.హెల్మెట్ ధరించి వచ్చేవారిని ప్రోత్సహిస్తూ పుష్పాలు, బొమ్మలు అందజేసి స్వాగతం చెబుతున్నారు.డిసెంబర్ 1వ తేదీ నుంచి తరచూ హెల్మెట్ ధరించి వచ్చే వారిని గుర్తించి వారి వాహన నెంబర్‌లను నమోదు చేసి వాటితో ఒక లాటరీ నిర్వహించనున్నారు.అందులో గెలుపొందిన వారికి పెద్ద ఎల్‌ఈడీ టీవీని బహుమతిగా అందజే స్తామని తెలిపారు.
Author: admin
సిద్దార్థ్ – ఆషిక రంగనాథ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ యూ’.తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న ఈ ట్రైలర్ అభిమానాలను ఆకట్టుకుంటోంది.ఈ చిత్రానికి ‘సింగం’ ఫేమ్ డైరెక్టర్ ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 7 మైల్స్ పర్ సెకండ్ పతాకంపై శామ్యూల్ మాథ్యూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో కరుణాకరన్, బాల,సాస్తిక రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Namma Siddharth's 'Miss You' Trailer is here! A youthful tale brimming with love, laughter, friendship, and heartfelt emotions. 🙌💖Trailer 🔗 https://t.co/XKI9rSAFzW#Siddharth@RedGiantMovies_@7mpsProductions@cvsam@Dir_RajasekarN@AshikaRanganath@GhibranVaibodha… pic.twitter.com/d8tK67Vtaz— Red Giant Movies (@RedGiantMovies_) November 23, 2024
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘మహాయుతి’ ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు 221 స్థానాలలో విజయ ఢంకా మోగించింది. ఇంకా పలు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ విజయం పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. అభివృద్ధి, సుపరిపాలనదే విజయం. ఐక్యంగా ముందుకుసాగితే భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించగలమని పేర్కొన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపిన ప్రేమ అసమానమైనది. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని ఈసందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కృషిచేసిన కార్యకర్తలపట్ల గర్వంగా ఉందన్నారు. వారు ప్రజల మధ్యకు వెళ్లి, అధికార కూటమి సుపరిపాలన గురించి వివరించారన్నారు. ఇక జార్ఖండ్ లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి ప్రధాని అభినందనలు తెలియజేశారు.
వయనాడ్ లోక్ సభకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలో ఆమె 4 లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె ఘన విజయాన్ని అందుకున్నారు. ఈసందర్భంగా ఆమె తన విజయంపై ప్రియాంక స్పందించారు. వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. వారు తన పట్లఉంచిన నమ్మకానికి హార్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజలదేనని అన్నారు. పార్లమెంట్ లో మీ గొంతుకనై వయనాడ్ గళం వినిపించేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లోక్ సభలోకి అడుగుపెట్టి ఎంపీగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండటం గమనార్హం. ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్ సభలో, సోనియాగాంధీ రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక లోక్ సభలోకి రాబోతుండడంతో…
భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగారి జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలకు ఉత్తమ మార్గనిర్దేశం చేయడమే కాకుండా, అనితర సాధ్యమైన ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలను నిర్వహించిన మానవతామూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగారి జయంతి సందర్భంగా ఆ మహిమాన్వితుని చరిత్రను, సందేశాలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలోని కుష్వంత్ హాల్ లో సత్యసాయిబాబా వారి మహా సమాధిని గవర్నర్ దర్శించుకున్నారు. గవర్నర్ తో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత కూడా పాల్గొన్నారు. ఈ…
పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు రెండో రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రెండో రోజు 67-7తో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ అలెక్స్ క్యారీ (21), స్టార్క్ (26) లైయాన్ (5) వికెట్లు కోల్పోయి 104 పరుగులకు ఆలౌటయింది. దీంతో భారత్ కు మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. బుమ్రా 5 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, హార్షిత్ రాణా 3వికెట్లు పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొని పటిష్ట స్థితిలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి యశస్వీ జైశ్వాల్ 90నాటౌట్ (193 బంతులు 7×4, 2×6), కే.ఎల్.రాహుల్ 62 నాటౌట్(153 బంతులు 4×4) వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా బౌలర్లను ఓపికగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దీంతో భారత్ ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీకి ఆధిక్యం కనబడుతుంది. బల్లార్‌పూర్, పుణె, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లో పవన్ ప్రచారం చేశారు. పుణె, బల్లార్‌పూర్, షోలాపూర్‌లో బీజేపీ ముందంజలో ఉంది. మరాఠీ భాష, హిందుత్వ, సనాతన అంశాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి భారీస్థాయిలో ప్రజల నుండి స్పందన వచ్చింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డెగ్లూర్ సీటు గురించి అక్కడ మొట్టమొదటి సారి బీజేపీ విజయం సాధించి సత్తా చాటింది. ఎన్డీయే కూటమికి పవన్ కళ్యాణ్ భారీ ప్రజాదరణ ఉన్న నేతగా మారారు. జనసేనాని ప్రచారం ఆయా నియోజకవర్గాల్లో బాగా ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కావడం పవన్ చరిష్మా ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుండడం కూడా ఎన్డీయేకు కలిసొచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర లో ఎన్డీఏ గెలుపు దిశగా దూసుకుపోతోంది.
ఏపీ అసెంబ్లీ ఫైనాన్షియల్ కమిటీలలో భాగంగా పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ మరియు ప్రభుత్వ సంస్థల కమిటీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను శాసన సభ నుండి సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్లో జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఓటింగ్ కు దూరంగా ఉంది. అసెంబ్లీలో ఆనవాయితీగా ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి అప్పగిస్తారన్న ఉద్దేశంతో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే శాసనసభలో వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభ్యుల విజయానికి అవసరమైన బలం లేకపోవడంతో కూటమి నుండి ఎమ్మెల్యేలు బరిలో నిలిచారు. ఈ కమిటీల్లో సభ్యులుగా ఎన్నిక అవ్వాలంటే 20 ఓట్లు రావాలి. కానీ వైసీపీకి శాసనసభలో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్…
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్నికల ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.విజయం దిశగా కొనసాగుతోన్న భాజపా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఫోన్ చేసి అభినందించారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి జోరు కనబరుస్తోన్న విషయం తెలిసిందే. 288 అసెంబ్లీ స్థానాల్లో 200కు పైగా సీట్లలో భాజపా కూటమి ఇప్పటికే ఆధిక్యంలో ఉంది.
ప్రముఖ డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన విషయం తెలిసిందే.ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. Lతెలంగాణ హైకోర్టు ఇచ్చిన జానీకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసు ఫిర్యాదు దారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.తాజాగా కేసు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ రద్దుకు నిరాకరించింది.హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జానీ తనని వేధించాడంటూ ఆయన అసిస్టెంట్ కొంతకాలం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని,మతం మార్చుకోమని ఒత్తిడి చేశాడని ఆమె అందులో రాసుకొచ్చింది.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.సుమారు నెల రోజుల పాటు జైలులో ఉన్న ఆయన అక్టోబర్ 25న బెయిల్ పొందారు.