ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది.ఈ కూటమి 48 స్థానాల్లో అధిక్యంలో ఉండగా..ఎన్డీయే కూటమి 28 స్థానాల్లో మెజార్టీలో ఉంది.ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసింది.దాదాపుగా ఇండియా కూటమి ఖాయంగా కనిపిస్తుంది.
Author: admin
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది.మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది.ప్రస్తుతం మహాయుతి కూటమి 217 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.ఇక మహా వికాస్ అఘాడి 50 స్థానాల్లో మెజార్టీలో కొనసాగుతోంది.దీన్ని బట్టి చూస్తే…మహాయుతి కూటమి మహారాష్ట్రంలో అధికారం సాధించినట్లేనని స్పష్టమవుతోంది.
సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడటం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధులకు ఇబ్బందులకు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. మత్స్యకార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. చమురు సంస్థలు సహజ వాయు నిక్షేపాల కోసం సాగిస్తున్న తవ్వకాల మూలంగా చేపల వేటకు ఇబ్బందులు వస్తున్నాయని, మత్స్య సంపద దెబ్బ తింటుందనీ ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని ప్రాంతాల్లో పరిహారం ఇచ్చారని… మరికొన్ని చోట్ల ఇవ్వలేదని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారులకు గత ప్రభుత్వంలో సబ్సిడీలు కూడా సక్రమంగా అందలేదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుందని పవన్ వారికి తెలిపారు.…
పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్ ధాటికి 104 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బూమ్రా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 150 పురుషులకే ఆలౌటయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బ్యాటింగ్ భారత బౌలర్ల ధాటికి తడబడింది. భారత కెప్టెన్ బుమ్రా కళ్లు చెదిరే బంతులతో మొదటి నాథన్ (10), కవాజా (8), స్మిత్ (0) మూడు వికెట్లు పడగొట్టి మొదటి రోజే ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. ట్రావిస్ హెడ్ (13) ను హార్షిత్ రాణా బౌల్డ్ చేశాడు. మార్ష్ (6), లబూషేన్ (2) ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 47 పరుగులకే ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (3) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు…
విమానయానంలో మహిళలకు అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కనీసం 25% విమానయాన ఉద్యోగస్తులలో మహిళలు ఉండాలి అనేది వారి అభిమతంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమానత్వం ప్రోత్సాహించేందుకు మరియు వైవిధ్యముతో కూడిన విమానయాన పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఐపీఎల్-2025 షెడ్యూల్ ఖరారైంది. మార్చి 14 నుండి మే 25 వరకు 2025 ఐపీఎల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది. ఆపై రానున్న రెండేళ్లకు 2026, 2027 సీజన్లలో కూడా ఇదే తరహా షెడ్యూల్ అనుసరించనున్నట్లు ఫ్రాంచైజీలకు వెల్లడించింది. ఈనెల 24న జెడ్డా వేదికగా ప్రారంభంకానున్న ఆటగాళ్ల మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీల ప్రణాళికల కోసం షెడ్యూల్ వివరాలు వెల్లడించినట్లు బీసీసీఐ పేర్కొంది. ప్రాంచైజీలకు బోర్డు అందించిన సమాచారం ప్రకారం మార్చి 15- మే 31 వరకు 2026 సీజన్.. మార్చి 14- మే 30 వరకు 2027 సీజన్ల నిర్వహణ ఉండనుంది. మూడు సీజన్ల ఫైనల్స్ ఆదివారమే జరుగనున్నాయి.
చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి సెమీఫైనల్ చేరింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ లో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ జోడీ 21-16, 21-19తో రెండో సీడ్ డెన్మార్క్ కు చెందిన కిమ్ ఆస్ట్రప్- ఆండర్స్ రసముసెన్ జంటపై విజయం సాధించింది. మరోవైపు భారత పురుషుల సింగిల్స్ లో స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్స్ లో 18-21, 15-21తో మూడో సీడ్ డెన్మార్క్ ఆటగాడు ఆండర్స్ ఆంథోన్సెన్ చేతిలో ఓటమి చెందాడు.
స్వర్ణాంధ్ర-2047 విజన్ లో ఉపాధి కల్పన లక్ష్యంగా, కొత్త పాలసీలు తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పలు అంశాలపై మాట్లాడారు. కూటమి వచ్చాక చాలా పాలసీలు తీసుకువచ్చినట్లు వివరించారు. మంచి పాలసీలు రాష్ట్ర రూపురేఖలు మారుస్తాయని పేర్కొన్నారు. భూమి, మద్యం, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, టూరిజం, స్పోర్ట్స్, డ్రోన్, స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీలు తెచ్చామని చెప్పారు. ఈ పాలసీలు అమలు చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు మీ.నైపుణ్య శిక్షణ, మానవ వనరుల వృద్ధి పైన దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు.ఇక గేర్ మార్చాల్సిన సమయం వచ్చింది. పరిపాలనలో దూకుడుగా ఉంటాం. టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్తామని తెలిపారు. జగన్ అవినీతి పై అమెరికాలో వేసిన చార్జ్ షీట్ గురించి అందరూ చూశారని ప్రభుత్వం దీనిపై తదుపరి అధ్యయనం చేసి, చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా అవినీతి చేస్తే సహించేది లేదని…
వాయు కాలుష్యం తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని, దానిని ఎదుర్కొనేందుకు సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆందోళన కలిగిస్తోన్న వాయుకాలుష్యం జాతీయ అత్యవసర పరిస్థితేనని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను వెతకాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడిన వీడియోను రాహుల్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. వాయు కాలుష్యానికి సామాన్య ప్రజలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారు. చాలా మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉత్తరభారతంలో నెలకొన్న ప్రస్తుత వాయు కాలుష్య పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయిందని విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల పరిధిలో…
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకున్న తర్వాత వస్తోన్న కథనాల పై తనయుడు అమీన్ మాట్లాడాడు. తన తండ్రి గురించి వస్తోన్న తప్పు కథనాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నాడు.వ్యక్తిగతంగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అన్నాడు.”మా నాన్న ఒక లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది ప్రేమాభిమానాలను పొందిన వ్యక్తి.ఎలాంటి ఆధారాల్లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే బాధగా ఉంది.ఒక వ్యక్తి జీవితం,లెగసీ గురించి మాట్లాడేటప్పుడు నిజం విలువ తెలుసుకోవాలి.దయచేసి ఇలాంటి అవాస్తవాలు వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి” అని పేర్కొన్నాడు.
