Author: admin

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు న‌టుడు నాని.అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా రానా హోస్ట్ చేస్తోన్న ది రానా ద‌గ్గుబాటి షోలో ఆయ‌న అతిథిగా పాల్గొన్నారు. Lత‌న‌ సినీ కెరీర్‌తోపాటు ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. Lఇందులో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌న ఇష్టాన్ని తెలియజేశారు.‘సినీ ప‌రిశ్ర‌మ‌లో పవన్‌ కల్యాణ్‌ స్టార్‌గా ఎలా ఎదిగారో తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్‌స్టార్‌ అని నిరూపించుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారని చెప్పారు. ఈ కామెంట్స్‌పై రానా మాట్లాడాడు.పవన్‌ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు.ఆయన నిజంగానే సూపర్‌ స్టార్‌ అని చెప్పారు.ఇటీవ‌ల‌ రాజకీయాలు కూడా సినిమాల్లాగే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.గోవాలో జ‌రుగుతోన్న ఇఫ్ఫి వేదిక‌గా ఈ ఎపిసోడ్‌ను ప్ర‌ద‌ర్శించారు.దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.ఈ కార్య‌క్ర‌మం ప్రైమ్ వీడియో వేదిక‌గా అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Read More

విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుల పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మొదటి పనులు చేపట్టడానికి వీలుగా ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ చేసిన ప్రతిపాదనలకు కూడా ఆమోదముద్ర వేసింది.ఈ మేరకు దీనిని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రానికి పంపించింది.ఆంధ్ర ప్రదేశ్ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల రెండింటిలో ఒకటి రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి 100 శాతం ఖర్చు భరించేలా, రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపరిచిన కీలకమైన ‘క్లాజ్‌’ను ప్రాతిపదికగా తీసుకుని పూర్తి ఖర్చు భరించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రీ-ఆర్గనైజేషన్‌ యాక్ట్‌లో 13వ సెక్షన్‌లో విజయవాడలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపింది.ఈ మేరకు నిధులను నూరుశాతం…

Read More

దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి సదస్సుకు విచ్చేసిన తెలుగు భాషాభిమానులకు, సాహితీ వేత్తలకు, కవులకు, రచయితలకు, వివిధ రంగాల ప్రముఖులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్నా భాషాభిమానంతో ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన వంగూరి ఫౌండేషన్, ఇతర ప్రముఖులకు అభినందనలు తెలిపారు. ఒక దేశ వైభవాన్ని, ఆ దేశంలో పుట్టిన సాహిత్యం ప్రతిబింబిస్తుందని సాహిత్యం మన ఘనమైన చరిత్రకు ప్రతిబింబిమని పేర్కొన్నారు. మనవైన సంప్రదాయాలు, విలువలు సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. తెలుగుకు సుసంపన్నమైన సాహిత్యం ఉంది. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకూ పరిణామానుక్రమంగా, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కిందని పేర్కొన్నారు. అవధానం వంటి ప్రక్రియలు మన భాష గొప్పతనానికి నిదర్శనం. అలాంటి మహోన్నత సాహిత్యాన్ని, మనవైన విలువలకు నెలవైన చరిత్రను యువతకు చేరువ…

Read More

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా ఆనందాన్ని ఇస్తుందని ఆ పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ,బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ప్రజలు పెద్దఎత్తున్న ఓట్లు వేశారని అన్నారు.బీజేపీ మహారాష్ట్రలో సింగిల్‌గానే ఆధిక్యంలో ఉందని వివరించారు.మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రజలు ఒక తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన అద్భుతమైన తీర్పు బీజేపీకి ఇచ్చారని అన్నారు.మహారాష్ట్రలో దాదాపు విజయం ఖరారు అయిందని చెప్పారు.బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసిందని, 139 స్థానాలకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు.ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి మరోసారి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు.ఇది కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం మోదీ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయడమని చెప్పారు.

Read More

పది రోజుల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో 59 గంటల 57 నిమిషాల పాటు సభ జరిగినట్లు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు 8 ప్రకటనలు చేసినట్లు పేర్కొన్నారు. 21 బిల్లులు సభలో ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులు ఆమోదం పొందినట్లు వెల్లడించారు. మూడు ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించినట్లు. ఉపసభాపతిని ఈ సమావేశంలోనే ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Read More

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ,తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్’.ఈ చిత్రంలో రామ్ చరణ్ జోడీగా కైరా అద్వానీ నటిస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా అమెరికాలోని కర్టిస్‌ కల్‌వెల్‌ సెంటర్‌, 4999 నామన్‌ ఫారెస్ట్‌, టెక్సాస్‌ లో డిసెంబరు 21 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది జనవరి 10 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. https://x.com/SVC_official/status/1859953090062905615?t=BvOPNifHm0Wm0deQ0pg9Mw&s=19

Read More

భారత బ్యాటింగ్ సంచలనం రిషభ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 37 పరుగులు చేసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 2,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ పంత్ కావడం విశేషం. ప్రస్తుతం 2,034 పరుగులతో డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ గా పంత్ కొనసాగుతున్నాడు. 1,930 పరుగులతో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో ఉన్నాడు.

Read More

కేరళ వయనాడ్‌ లోక్ సభకు జరుగుతున్న ఉపఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు.సీపీఐ నుండి సత్యన్‌ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ వెనుకంజలో ఉన్నారు.ప్రియాంక వాద్రా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతానికి లక్ష ఓట్లకు భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు.సీపీఐ నుంచి సత్యన్‌ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ వెనుకంజలో ఉన్నారు.అయితే ఈరోజు మ‌ధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంది.ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Read More

అక్కినేని నటవారసుడుగా తెరంగేట్రం చేసి వారసత్వాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతున్నారు నాగచైతన్య. కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన పాత్రలతో విభిన్నమైన చిత్రాలతోప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి కథానాయిక నటిస్తోంది. నేడు ఆయన పుట్టిన రోజు. ఈసందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం నుండి చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో నాగచైతన్య కొత్త ఆహార్యం లో కనిపించారు. చూడగానే ఆకట్టుకునేలా మేకర్స్ ఈ స్పెషల్ పోస్టర్ను డిజైన్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది.ఈ కూటమి 48 స్థానాల్లో అధిక్యంలో ఉండగా..ఎన్డీయే కూటమి 28 స్థానాల్లో మెజార్టీలో ఉంది.ఇండియా కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ను టచ్ చేసింది.దాదాపుగా ఇండియా కూటమి ఖాయంగా కనిపిస్తుంది.

Read More