Author: admin

కరోనా కేసులు పలు దేశాల్లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై హాస్పిటల్స్ ను సిద్ధం చేస్తున్నాయి. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఇన్సాకాగ్) తాజాగా ప్రకటించింది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌ నెలలో వెలుగు చూడగా, ఎల్‌ఎఫ్‌.7 వేరియంట్‌ కు సంబంధించిన నాలుగు కేసులు మే నెలలో తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో నమోదైనట్లు సంస్థ తెలిపింది.

Read More

ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం కీలక ప్రకటన చేసింది.రాష్ట్రంలో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని తెలిపారు. కేవలం తమ చిత్రాల…

Read More

ఇంగ్లాండ్ తో వచ్చే నెలలో ప్రారంభం కానున్న 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు బీసీసీఐ టీమ్ ను ప్రకటించింది. ఇక ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్ కు కెప్టెన్ గా యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ ను ఎంపిక చేసింది. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. భారత జట్టు: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కే.ఎల్. రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. ఇక ఈ సిరీస్ లో జూన్ 20న మొదటి టెస్టు, జులై 2న రెండో…

Read More

వేసవి వేడితో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అనుకున్న టైమ్ కంటే ముందుగానే రుతుప‌వ‌నాలు రావ‌డం 16 ఏళ్ల‌లో ఇదే మొద‌టిసారి. చివ‌రిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ, ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే వచ్చేశాయి. ఈ సంవత్సరం సాధార‌ణం కంటే ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ వెల్ల‌డించింది. మ‌రో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది. ఇక వీటి ప్ర‌భావంతో జూన్ రెండో వారం నుండి రాష్ట్ర‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Read More

విలక్షణ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ మూవీలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. సిద్దం, బెజవాడ , భాయ్, కేడీ, నిప్పు వంటి పలు చిత్రాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయి లోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాస్, సీతయ్య , సింహద్రి తదితర ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన రాహుల్ దేవ్ కు ఈయన సోదరుడు. ముకుల్ దేవ్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More

యూరప్ దేశాల పర్యటనకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది వెళుతుంటారు. అయితే, షెంజెన్ వీసా దరఖాస్తుల్లో అధిక సంఖ్యలో రిజెక్ట్ అవుతుండడంతో అప్లికెంట్ లు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించిన వీసా దరఖాస్తులు సైతం భారీ సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ రిజెక్షన్ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తద్వారా భారతీయ దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెలికాప్టర్ ల నిర్వహణ కోసం రూ.54 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం, నిర్వహణ కోసం, ఏవియేషన్ కార్పోరేషన్ కి ప్రతి ఏడాది రూ.50 కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుందని ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియేనని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా రూ.55 కోట్లు ఒక ఏడాదిలో, మరో ఏడాదిలో రూ.52 కోట్లు అనేది కేటాయించి, ప్రతి క్వార్టర్ కి నిధులు విడుదల చేసారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియని పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే, కేవలం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా…

Read More

హైదరాబాద్‌లోని ఇకార్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) ప్రాంగణంలో అంతర్జాతీయ సిరిధాన్యాల నైపుణ్య కేంద్రాన్ని (గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్) ఏర్పాటు చేయనుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిధుల మంజూరు విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనకు రాసిన లేఖ ద్వారా తెలియజేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చొరవ ప్రధానమంత్రి శ్రీ అన్న యోజన (మిల్లెట్స్)లో ఒక భాగం, ఇది ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ఆహారం మరియు పోషక భద్రతను సాధించడానికి చిరు ధాన్యాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కొత్త గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశోధనా ప్రయోగశాలలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు మరియు ఔట్రీచ్ హబ్‌లతో సహా ప్రపంచ స్థాయి…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. వారితో ఏపీ అభివృద్ధిపై చర్చించిన అంశాలను వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక పక్క 9.74 లక్షల కోట్ల అప్పు, మరో పక్క బకాయిలతో కనీస వెసులబాటు కూడా లేకుండా చేశారని విమర్శించారు . అయితే ప్రజలు తమ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నామని అన్నారు. ఒక పక్క రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసుకుంటూనే, కేంద్ర సాయంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. శాంతిభద్రతల కోసం ఆయన కొన్ని సూచనలు చేశారు. అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరాం.. సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు. ఇక సూర్యఘర్ కింద 35లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.…

Read More

ఐపీఎల్ సీజన్ 18 లో ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సన్ రైజర్స్ వరుసగా రెండో గెలుపు ఖాతాలో వేసుకుంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 94 నాటౌట్ (48; 7×4, 5×6) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ 34 (17; 3×4, 3×6), ఆనికేత్ వర్మ (26), క్లాసీన్ (24) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో షెపర్డ్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, ఎంగిడి, ఎస్.శర్మ, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటయింది. ఫిల్…

Read More