వైవిధ్యమైన పాత్రలతో విభిన్న కథాంశాలున్న సినిమాలతో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు అడివి శేష్. తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’. ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై యార్లగడ్డ సుప్రియ నిర్మిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అడివి శేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/Nc6yhKlNbaQ?si=rwBxRGxtdCl6jehJ
Author: admin
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. నేడు మరికొన్ని గంటల్లోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందు కావడం విశేషం. ఇక దీంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలే కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని కొన్ని భాగాలకు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే, ఇవి రాయలసీమను నేడు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అరెస్టు నుండి తప్పించుకు తిరుగుతున్న ఆయనను తాజాగా బెంగళూరు సమీపంలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వెంకటాచలం పీహెచ్‌సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి, అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది.
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్ గా నిలిచాడు. నిలకడగా రాణిస్తూ ఆరేళ్ల తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో అడుగుపెట్టిన శ్రీకాంత్ ఆఖర్లో తడబడి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 11-21, 9-21తో చైనాకు చెందిన లీ షై ఫెంగ్ చేతిలో ఓడిపోయాడు. తన ప్రదర్శనపై శ్రీకాంత్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలతో ఐపీఎల్ సీజన్ 18కు వీడ్కోలు పలికింది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 110 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తమ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 హైయెస్ట్ స్కోర్ల రికార్డు ఆ టీమ్ పేరిట ఉండడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. హెన్రిచ్ క్లాసిన్ 105 (39; 7×4, 9×6) సెంచరీతో అదరగొట్టాడు. ట్రావిస్ హెడ్ 76 (40; 6×4, 6×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. అభిషేక్ శర్మ 32 (16; 4×4, 2×6), ఇషాన్ కిషన్ (29)…
ఐపీఎల్ సీజన్ 18 లో ఇప్పటివరకు పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో 83 పరుగుల తేడాతో అదిరే విజయంతో సత్తా చాటింది. గుజరాత్ టైటాన్స్ పై చెన్నై బ్యాటర్లు విజృంభించి ఆడారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (57), డెవాన్ కాన్వే (52) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఉర్విల్ పటేల్ (37), ఆయుష్ మాత్రే (34), జడేజా (21) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, రషీద్ ఖాన్, సాయి కిషోర్, షారుఖ్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. సాయి…
సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నటి రష్మిక మంథన ప్రధాన పాత్రధారులలో వస్తున్న మూవీ ‘కుబేర’. వైవిధ్యమైన దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, చిత్ర యూనిట్ నేడు ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరిట ఓ ప్రత్యేక టీజర్‌ను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ టీజర్ ద్వారా సినిమాలోని నాలుగు కీలక పాత్రలను పరిచయం చేశారు. ఆసక్తికరమైన అంశమే మేమిటంటే , ఈ టీజర్‌లో ఎక్కడా డైలాగ్స్ లేకపోవడం గమనార్హం. కేవలం ‘నాది నాది.. నాదే ఈ లోకమంతా’ అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యంగా సాగుతూ, పాత్రల స్వభావాలను సూచనప్రాయంగా చూపించారు. ఈ పాట టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. https://youtu.be/i2UTXe4M97Q?si=jiWnYN8c3CqejTWS
అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘OG’. పవన్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ స్థాయిలో ఆకట్టుకుని అంచనాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ సరసన నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రజా సేవలో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘OG’ నుండి ఈ వార్త రావడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.
ఐపీఎల్ సీజన్ 18 మొదటి మ్యాచ్ లలో సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తరువాత కీలక మ్యాచ్ లలో ఓడి ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తమ ఆఖరి మ్యాచ్ లో గెలిచి విజయంతో ఈ సీజన్ కు గుడ్ బై చెప్పేసింది. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 53 (34; 5×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. స్టోయినీస్ 44 నాటౌట్ (16; 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లిస్ (32), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (28) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో ఎం.రెహ్మాన్ 3 వికెట్లు, విప్రజ్ నిగమ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు,…
నేడు దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. పహల్గాం దాడిని ఖండిస్తూ, ఆపరేషన్ సింధూర్ గురించి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన అభివృద్ధి దేశ, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్లో వివరించారు. ఏపీలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వికసిత్ భారత్ స్వప్నం సాకారంతో స్వర్ణాంధ్రను సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. రాష్ట్ర వనరుల సద్వినియోగంపైనా సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ లో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విశాఖను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విశాఖకు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్ విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. అమరావతి,…
