మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈమేరకు టీడీపీ కార్యనిర్వాహాక కార్యదర్శి కనుపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అనారోగ్య కారణాల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నాని పాస్ పోర్ట్ సీజ్ చేయాలని కోరారు. ఇక కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Author: admin
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న లక్నో సూపర్‌జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) జట్టు తాజాగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ (జీటీ)పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) సెంచరీతో రాణించాడు. నికోలస్ పూరన్ 56 (27;4×4, 5×6), మార్‌క్రమ్ 36 (24; 3×4, 2×6) పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ పోరాడినప్పటికీ 9 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభ్‌మన్ గిల్ 35 (20; 7×4), జోస్ బట్లర్ 33 (18; 3×4, 2×6), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ 38 (22; 1×4, 3×6), షారుఖ్ ఖాన్ 57(29; 5×4,…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, ఆపార్టీ అధినేత వైయస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సూపర్-6 హామీల అమలుపై ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాల్ని నిలదీస్తూ జూన్ 4 రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించనున్నట్లు తెలిపారు. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న అన్యాయాలు, అరాచకాలపై ఆరోజు అన్ని వర్గాల ప్రజలతో కలిసి గళమెత్తుతామని అన్నారు. సెకీ సంస్థతో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వానికి దాదాపు రూ.89,675 కోట్లు ఆదా చేశామన్నారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా నిలిచిందని పేర్కొన్నారు. అప్పులు తెచ్చే విషయంలో చంద్రబాబు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆఖరుకు రాష్ట్రంలోని గనులను సైతం తనఖా పెట్టేసి అప్పులు తెస్తున్నారు. రానున్న తరాలు చంద్రబాబు చేసిన అప్పులు తీర్చడానికి మరింత పన్నుల భారం మోయక తప్పదని ఆక్షేపించారు.
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ్‌నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. యూపీలో 19, మహారాష్ట్రలో 15, గుజరాత్ లో18, తెలంగాణలో 3, ఏపీలో 1, రాజస్థాన్‌లో 8 రైల్వేస్టేషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు. అంతకుముందు బికనీర్‌లోని కర్ణిమాత ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు.. ప్రధానికి అందజేశారు. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్‌ను ప్రధాని మోడీ సందర్శించారు. బికనీర్ సమీపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
తాజాగా కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఏనుగులను అప్పగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, దీనిపై ఏపీ మంత్రి, టీడీపీ అగ్రనేత లోకేష్ సోషల్ మీడియా లో స్పందించారు. ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న రీతిలో శ్రీకారం చుట్టారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా “మన ఊరు – మాటామంతి” అనే పేరుతో ప్రజలతో ముఖాముఖీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లోని రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. టెక్కలి లోని భవానీ థియేటర్ లో నిర్వహించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైన అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలున్న వారు తప్పసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు. మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుండి ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది. జనవరి నుండి మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్లు చేయగా, 106 కేసులు పాజిటివ్ తెలినట్లు చెప్పింది. వీరిలో 101 మంది ముంబయికి చెందిన వారు కాగా, మిగిలిన వారు పుణె, థానే, కొల్హాపుర్ చెందినవారుగా పేర్కొంది. ప్రస్తుతం…
అత్యున్నత విలువలు కలిగిన వ్యక్తి, ఎందరికో స్ఫూర్తి ప్రదాత, మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ తెరకెక్కనుంది. ‘కలాం’ పేరుతో రూపొందనున్న ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్ లో ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈసినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నారు. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్, టీ-సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈమేరకు మూవీ టీమ్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ నుండి భారత స్టార్ షట్లర్ సింధు మొదటి రౌండ్ లోనే ఓటమితో వెనుదిరిగింది. మహిళల సింగిల్స్ లో సింధు 11-21, 21-14, 15-21తో వియత్నాం కు చెందిన లిన్ నుయెన్ చేతిలో ఓడింది. ఇక ఇతర మ్యాచ్ లలో మాళవిక బాన్సోద్ 21-19, 18-21, 8-21తో చైనీస్ తైపీకి చెందిన పిన్ చియాన్ చేతిలో, ఆకర్షి కశ్యప్ 9-21, 8-21తో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్థని చేతిలో, ఉన్నతి హుడా చైనీస్ తైపీకి చెందిన లిన్ సియాంగ్ చేతిలో 12-21, 20-22 తేడాతో పరాజయం చెందారు. పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి ముందడుగేశారు. శ్రీకాంత్ చైనీస్ తైపీకి చెందిన గ్వాంగ్ జు పై 23-21, 13-21, 21-11తో, ప్రణయ్ 19-21, 21-17, 21-16తో జపాన్ కు చెందిన కెంటా నిషిమోటో పై, కరుణాకరన్ చైనీస్ తైపీకి…
ఐపీఎల్ సీజన్ 18 లో ఆఖరి ప్లే ఆఫ్ బెర్త్ ను ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. కీలక మ్యాచ్ లో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 73 నాటౌట్ (43; 7×4, 4×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ 2 వికెట్లు, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటయింది. సమీర్ రిజ్వీ (39) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లతో…
