మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుకని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుకని పేర్కొన్నారు. రాయలసీమ గడ్డపై… కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ జనసేన పార్టీ పక్షాన టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్ , బక్కని నరసింహులుకు శుభాభినందనలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి,…
Author: admin
ఇంగ్లాండ్ లో పర్యటించే భారత జట్టుకు టి.దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో పాటు దిలీప్ ను తప్పించాలని గత నెలలోనే బీసీసీఐ నిర్ణయించింది. ఫీల్డింగ్ కోచ్ గా సరైన ప్రత్యామ్నాయం దొరకకపోవడంతో ఇంగ్లాండ్ పర్యటనకు అతనిని కొనసాగిస్తోంది. దిలీప్ మంచి కోచ్. 2021 నుండి అతడు జట్టుకు సేవలందించాడు జట్టులో ఎక్కుమందితో అతడికి సాన్నిహిత్యం ఉందని అందుకే ఇంగ్లాండ్ సిరీస్ కు దిలీప్ ను తీసుకెళ్తున్నామని బీసీసీఐ తెలిపింది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో తొలిరోజే భారత్ గోల్డ్ మెడల్ తో శుభారంభం చేసింది. 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ స్వర్ణంతో సత్తా చాటాడు. అతడు 28 నిమిషాల 38.63 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. జపాన్, కు చెందిన మెబుకి సుజుకి 28 నిమిషాల 43.84 సెకన్లతో సిల్వర్ మెడల్, బహ్రెయిన్ కు చెందినఆల్బర్ట్ రోప్, 28 నిమిషాల 46.82సె తో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. భారత అథ్లెట్ సవాన్ బర్వాల్ (28 నిమిషాల 50.53 సె) కొద్దిలో మెడల్ కోల్పోయాడు. గుల్వీర్ ఈ ఏడాది ఆరంభంలోనే 10 వేల మీటర్లలో నేషనల్ రికార్డు (27 నిమిషాల 00.22 సె) నెలకొల్పాడు. 5 వేల మీటర్లలోనూ నేషనల్ రికార్డు (12 నిమిషాల 59.77 సెకన్లు) అతడి పేరిట ఉంది. 20 కి.మీ రేస్వాక్లో సెబాస్టియన్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. అతడు గంట 21…
దేశానికే గర్వకారణమైన త్రివిధ దళాల అధిపతులను ఐపీఎల్ ఫైనల్ కు ఆహ్వానించినట్లు బీసీసీఐ తాజాగా తెలిపింది. ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఆ సందర్భంగా టోర్నీ ముగింపు కార్యక్రమం కూడా ఉండనుంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సాయుధ దళాలకు అంకితమివ్వనున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. “ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో ఉత్సవం జరపడానికి త్రివిధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులు, సైనికులను ఐపీఎల్ ఫైనల్ కు ఆహ్వానించాం. మన హీరోలకు గౌరవ సూచకంగా ముగింపు కార్యక్రమాన్ని సాయుధ దళాలకు అంకితమివ్వాలని నిర్ణయించామని పేర్కొన్నాడు.
ఈ సీజన్ లో సమిష్టిగా రాణిస్తూ అద్భుతమైన విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి టాప్-2 లోకి దూసుకెళ్లింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ఫామ్ తో సతమతమవుతున్న కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. 61 బంతుల్లో 11 ఫోర్లు 8 సికైసర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ 67 (37; 4×4, 5×6) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, తుకారాం, షెపర్డ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలోనే 230-4…
తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మహానాడు’ కడప వేదికగా నేడు ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహా పండుగను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మహానాడు ప్రాంగణంలో టీడీపీ జెండా ఎగురవేశారు. దేశవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు, నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని మాట్లాడిన వారి పని అయిపోయిందే కానీ, పార్టీ మాత్రం వెనక్కు తిరిగి చూడలేదని ఈసందర్భంగా చంద్రబాబు అన్నారు. ఈ జెండా ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. చైతన్యరథం నుంచి వస్తున్నా మీకోసం, యువగళం వరకు పార్టీ కార్యకర్తల్లో అదే స్ఫూర్తి.గత ప్రభుత్వం పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులని మార్చేసిందని దుయ్యబట్టారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రశ్నించిన నాయకులను వెంటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారు. ఎత్తిన జెండా…
తెలుగు దేశం మహానాడు కార్యక్రమం కడుపులో నేడు వైభవంగా ప్రారంభమైంది. మహానాడులో ఆరు శాసనాలతో “నా తెలుగు కుటుంబం” టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో..ప్రజా అవసరాలకు అనుగుణంగా,ఆరు శాసనాలను లోకేష్ ప్రతిపాదించారు. 1. తెలుగు జాతి, విశ్వ ఖ్యాతి 2. పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్ 3. స్త్రీ శక్తి 4. అన్నదాతకు అండగా 5. యువగళం 6. కార్యకర్తే అధినేత అనే అంశాలను ప్రకటించారు.
దేశానికి వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది అవసరమైన మార్పు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెన్నైలో ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్ ‘ పై జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత్ కు ఉన్న సామర్థ్యంతో ఇది ఆచరణ సాధ్యమేనని పేర్కొన్నారు. సమస్యలున్నా వాటిని అధిగమించగలమని అన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడిని ఆయన నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు.
YSR జిల్లా పేరుని YSR కడప జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.దీనిపై ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా పరిగణించడంపై గతంలో ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ప్రజల నుంచి కూడా వినతులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో 100కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరినట్లు కేంద్ర కొవిడ్-19 సమాచార నివేదిక తెలిపింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా కేరళలో 430, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొవిడ్ కారణంగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు సమాచారం. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర…
