Author: admin

నేడు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది.దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులను అప్పగించారు.కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కర్ణాటక విధాన సౌధ లో నేడు జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కాండ్రే, ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు…

Read More

ఛత్తీస్ ఘడ్ అడవులు మరోసారి తుపాకులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏకంగా 27 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించాడు. మరికొందరు మావోలు గాయపడినట్టు సమాచారం. మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మరణించిన విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాళ్ల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆయనపై రూ.1.5కోట్లు రివార్డు ఉన్నట్లు తెలిపారు.

Read More

జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదో ఈవెంట్ కోసం యోగా దినోత్సవం చేయటం కాదు, అందరి జీవితాల్లో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో ప్రధాన సిద్ధాంతం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగానే యోగాని కూడా ప్రొమోట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా, విశాఖ తీరంలో యోగా దినోత్సవం చేస్తున్నాం. వచ్చే నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందికి తక్కువగాకుండా యోగా దినోత్సవంలో పాల్గొనాలన్నది సంకల్పమని పేర్కొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం నిధి భవన్ లో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనంలోని అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. అయితే ఎవరికి ప్రమాదం వలన హాని జరగలేదు. మంటలు ఎగిసిపడడంతో కంప్యూటర్లు కాలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు.

Read More

గుజరాత్ లో ఆసియా సింహాల సంతతి భారీగా పెరిగింది. గతంలో 674 సింహాలు ఉండేవని అయితే ఇప్పుడు ఆ సంఖ్య 891కి చేరిందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. సింహాల జనాభాపై నిర్వహించిన 2025 గణాంకాలను విడుదల చేశారు. గిర్ సోమనాథ్, జునాఘడ్, రాజ్ కోట్, భావ్ నగర్, మోర్బి, సురేంద్ర నగర్, ద్వారకా, దేవభూమి, జామ్ నగర్, పోరుబందర్, అమ్రేలి, బోటాడ్ జిల్లాల్లో ఈ సింహాలు విస్తరించాయని తెలిపారు. ఈనెలలో సింహాల జనాభా గణనను జోనల్, సబ్-జోనల్ అధికారులు, ఎన్యుమరేటర్ లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్ లు, ఇన్స్పెక్టర్ లు సహా 3000 మంది వాలంటీర్ల సహాయంతో నిర్వహించినట్లు సీఎం తెలిపారు . వాటి సంరక్షణ, పర్యవేక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Read More

పాకిస్థాన్ ఉగ్ర కుట్రలకు ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’ తో తగిన గుణపాఠం చెప్పిన భారత్ అంతర్జాతీయంగా కూడా పాక్ దుష్టబుద్దిని ఎండగట్టి ప్రపంచ దేశాల ముందు ఉంచేందుకు భారత్ తన దౌత్య కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏడు భారత ప్రతినిధి బృందాల్లో రెండు బృందాలు తమ నిర్దేశిత దేశాలకు ఈరోజు పయనమయ్యాయి. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం ఇండోనేసియా, మలేసియా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, హేమాంగ్ జోషి, ప్రదాన్ బారువా, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ ఉన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో బృందం యూఏఈ, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్, లైబీరియా దేశాలకు…

Read More

తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, విలక్షణ నటుడు రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ రెండో సీజన్ జూన్ 13 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్త హంగులతో సీజన్ 2 రూపుదిద్దుకుంది. మొదటి సీజన్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్‌ రానున్నట్లు సమాచారం రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో విడుదలైన ‘రానా నాయుడు’ మొదటి సీజన్, వీక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. మొదటి సీజన్ కు లాగా మరింత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరమైన కథాంశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. దియా మీర్జా, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి ప్రముఖ తారాగణం నటించారు.

Read More

వచ్చే సంవత్సరం నుండి అధిక సంఖ్యలో ప్రభుత్వ విద్యార్థులు ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకొని పనిచేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంచి మనస్సుతో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం వరిస్తుంది. విద్యా శాఖ మంత్రి గా బాధ్యతలు తీసుకున్నప్పుడు రిస్క్ ఎందుకు అన్నవారే ఎక్కువ అని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి అని ఏడాది పాటు పడ్డ శ్రమ ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 47 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడి ర్యాంకులు సాధించడం గర్వకారణమని అందులో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉండటం శుభపరిణామని అన్నారు. వారంతా షైనింగ్ స్టార్స్, ప్రభుత్వ విద్యకు వారు బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి వారిని లోకేష్ సన్మానించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆయనను వెంటాడుతున్నాయి. మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు పొడవడమే అనేలా చంద్రబాబు పాలన ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నేడు ఇంగ్లీష్ మీడియం లేదు, గోరుముద్ద లేదు, నాడునేడు పనులు ఆగిపోయాయి. అమ్మ ఒడితో తల్లికి ప్రోత్సాహం లేదు, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదు. ఏ రైతుకూ గిట్టుబాటుధర లేదు, ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయిందని కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్ సీపీ కార్యకర్తల్ని, నాయకులకి అన్యాయం చేసిన వారు రిటైర్డ్ అయిపోయినా.. చివరికి దేశం విడిచిపెట్టి పోయినా లాక్కుని వచ్చి చట్టం ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఒక్కొక్కడికి సినిమా ఎలా చూపించాలో.. అలా చూపిస్తా.. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు.

Read More

మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో అర్హత రౌండ్లో శ్రీకాంత్ 9-21, 21-12, 21-6తో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ యు పై విజయం సాధించాడు. అంతకుముందు మొదటి అర్హత రౌండ్లో శ్రీకాంత్ 21-8, 21-13తో చైనీస్ తైపీకే చెందిన కువాన్ లిన్ పై గెలిచాడు. మిగతా మ్యాచ్లో తరుణ్ మన్నేపల్లి 13-21, 21-23తో థాయ్ లాండ్ కు చెందిన పనిచఫోన్ చేతిలో శంకర్ సుబ్రమణ్యన్ 20-22, 20-22తో చైనాకు చెందిన షువాన్ చెన్ చేతిలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించారు.

Read More