సీనియర్ హీరో వెంకటేష్ ఈ సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సినిమాను ఆయన నేడు ప్రారంభించారు. వెంకటేష్ 77వ చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఇది తెరకెక్కనుంది. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్ వంటి హీరోలతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్ మొదటి సారి సీనియర్ టాప్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం టాప్ లీగ్ లో ఉన్న దర్శకులందరూ కూడా సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం లేదు. యంగ్ స్టార్స్ తోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అయితే గతంలో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలు అతిపెద్ద విజయాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల మధ్యలో…
Author: admin
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం, పోలీసు గౌరవ వందనం స్వీకరించి, పెరేడ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని నమ్మి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్ తో తమ ఎన్డీయే కూటమిని దీవించారని అన్నారు. ఏపీని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేశామని పేర్కొన్నారు. మొదటి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం…
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దేశం ఘనంగా వేడుకలు జరుపుకుంటోంది. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఎర్రకోటపై వరుసగా 12వ సారి జాతీయజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవమని ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై మూడు రంగుల జాతీయ జెండా ఎగిరే సమయమన్నారు. సమైక్య భావనతో దేశం ఉప్పొంగే తరుణమని అన్నారు. ఆయన తన ప్రసంగంలో కీలక అంశాలపై మాట్లాడారు. దేశంలో హైపవర్డ్ డెమోగ్రఫీ మిషిన్ను అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో అవకాశాలు చొరబాటుదారులు లాక్కోకుండా చూడటమే దీని లక్ష్యమని ముఖ్యంగా ఆదివాసీల భూములను చొరబాటుదారులు లక్ష్యంగా చేసుకొంటున్నారని ఇకపై వారి ఆటలు సాగనీయబోమని స్పష్టం చేశారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 ఏళ్లుగా దేశానికి సేవ చేస్తోంది. వారి అంకితభావానికి నా సెల్యూట్ చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్…
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు: దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలో అన్ని విధాలా బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ : దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగధనుల ఆత్మార్పణల ఫలితమే. దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి. నుదిటి సిందూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించి, వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను…
బిహార్ లో ఇటీవల నిర్వహించిన ఓటర్ లిస్టు ప్రత్యేక సమగ్ర సవరణ లో 65 లక్షల మంది పేర్లను తొలగించిన సంగతి విదితమే. కాగా, ఆ 65 లక్షల మంది వివరాలను ఈ నెల 19 లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 22 నాటికి సంబంధిత నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. అదేవిధంగా.. ఓటర్ లిస్ట్ లో పేర్లు లేనివారు ఆధార్ కార్డు సమర్పించవచ్చని తెలిపింది. బిహార్ లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు లో ఈరోజు విచారణ జరిగింది. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్టు 19 నాటికి బహిర్గతం చేయాలని ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశించింది. తొలగింపునకు కారణాలుతో పాటు ప్రచురించి జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని తెలిపింది. ప్రసార మాధ్యమాల ద్వారా…
పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు సూచించింది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి.కోనసీమ, కాకినాడ, , అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.విజయనగరం, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది.ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 5,20,531 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు.
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ నేషనల్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. 3000 మీటర్ల రన్ లో అతను తన పేరు మీద ఉన్న నేషనల్ రికార్డును తిరగరాశాడు. బుడాపెస్ట్ లో జరిగిన హాంగేరియన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి లో 3000 మీటర్ల రేసును 7 నిమిషాల 34.49 సెకన్లలో పూర్తి చేసి 5వ స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ కిస్సాంగ్ మ్యాథ్యూ 7 నిమిషాల 33.23 సెకన్లలో రేసు పూర్తి చేసి విజేతగా నిలిచాడు. మెక్సికో కు చెందిన హెరీరా 7ని.33.58సెకన్లతో రెండో స్థానంలో, ఆస్కార్ చెలిమో 7ని.33.93 తర్వాత స్థానంలో నిలిచారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది. కూటమి తరపున బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. టీడీపీకి 6,735 ఓట్లు, వైసీపీ-683 ఓట్లు వచ్చాయి . 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకుంది.పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని హామీ ఇచ్చిన ప్రకారం, నీరు అందించి, అన్ని నియోజకవర్గాలు లాగే, అభివృద్ధి ఫలాలను పులివెందుల ప్రజలకు, కూటమి ప్రభుత్వం అందిస్తుందని టీడీపీ పేర్కొంది.
78 సంవత్సరాల క్రితం రేగిన విభజన గాయాలను భారత్ ఇప్పటికీ తలచుకుంటూనే ఉంది. అప్పటి ఘర్షణల కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎందరి జీవితాల్లోనో చీకటి అధ్యాయంగా ప్రపంచ చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడింది. ఆగష్టు 15న స్వాతంత్ర్యం సాధించినా దానికి ఒక్కరోజు ముందు జరిగిన ఘటనలు ఇప్పటికీ దేశ చరిత్రలో చీకటి ఘట్టాలుగా మిగిలిపోయాయి. 1947 ఆగస్టు 14న మన దేశం మతాధారంగా భారత్ మరియు పాకిస్తాన్‌గా విభజించబడింది. ఈ విభజన దేశ చరిత్రలో అత్యంత దుర్ఘటనలలో ఒకటి. ఇందువల్ల లక్షలాది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది తమ ఇళ్లను, ఊర్లను విడిచి శరణార్థులయ్యారు. వారి బాధ, విడిపోవు వేదన, మానవత్వం చూపిన అజ్ఞాత వీరుల ఔదార్యం ఇవన్నీ మన సామూహిక స్మృతిలో ఎప్పటికీ నిలిచి ఉండాలి. ప్రతి ఏటా మాదిరిగానే ఈరోజు భారతదేశం దేశ విభజన గాయాల స్మారక దినం (PartitionHorrorsRemembranceDay)ను పాటిస్తూ, ఆ దురదృష్టకరమైన చారిత్రక…
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ, నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వచ్చే మూడేళ్ల పాటు ఈ పాలసీని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త పాలసీలో అనేక కీలక మార్పులు జరిగాయి. గతంలో బార్లను వేలం ద్వారా కేటాయించగా, ఇప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇందుకోసం 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి అదనంగా, గీత కార్మికుల కోసం మరో 84 బార్లకు తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇక లాటరీ నిర్వహణకు ఒక బార్ కి కనీసం 4 దరఖాస్తులు రావాలనే నిబంధన పెట్టారు. బార్ల పనివేళలను ప్రభుత్వం 2 గంటలు పెంచింది. దరఖాస్తు రుసుముగా నాన్-రిఫండబుల్ ఫీజు రూ. 5 లక్షలు, అదనంగా రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజును మూడు రకాలుగా విభజించారు. 50,000 లోపు జనాభా…