Author: admin

వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన అధికారులతో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని ఆదేశించారు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేయాల‌ని, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధి, సుస్థిరమైన అక్వాకల్చర్, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతం వంటి లక్ష్యాలకు తోడ్పడతాయని, రొయ్య‌ల‌ రైతులకు కూట‌మి ప్ర‌భుత్వం నుండి సంపూర్ణ మద్దతు,ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు మేలు జ‌రిగేలా సుంకాల భారంపై సీఎం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. సుంకం త‌క్కువ ఉన్న‌ దేశాల‌కు రొయ్య‌ల‌ను ఎగుమ‌తి చేస్తే రైతుల‌కు న‌ష్టం వాటిల్ల‌దని పేర్కొన్నారు. చికెన్ వ్య‌ర్ధాల‌ను చేప‌ల చెరువుల‌కు త‌ర‌లిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.…

Read More

ఈ రోజు వెలగపూడి సచివాలయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తొలిభేటీలో మంత్రులు అనిగాని సత్య ప్రసాద్, నారాయణ, హోం మంత్రి , బి.సి.జనార్థన్ రెడ్డి, రామా నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ లు పాల్గొన్నారు. జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుపై ఇప్పటికే ప్రభుత్వానికి అందిన వినతులపై చర్చించినట్లు తెలిపారు. ఈరోజు కూడా కొంతమంది ప్రజలు తమకు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని, జిల్లాల సరిహద్దులు మార్చాలని వినతులు సమర్పించారని వివరించారు. త్వరలోనే మంత్రుల బృందం జిల్లాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల వెసులుబాటు, ఆయా ప్రాంతాలతో ముడిపడిన సాంస్కృతిక భావోద్వేగాలు, దూరాభారం ఇలా పలు అంశాలను బేరీజు వేసుకుని జిల్లాలు, మండలాలు, గ్రామాల భౌగోళిక సరిహద్దులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, సామరస్య నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

Read More

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల ఆధిపత్యం కనబరిచారు. 1.శుభ్ మాన్ గిల్ (భారత్) – 784 పాయింట్లు 2. రోహిత్ శర్మ (భారత్)-756 పాయింట్లు 3. బాబర్ అజామ్ (పాకిస్థాన్)- 751 పాయింట్లు 4. విరాట్ కోహ్లి (భారత్)- 736 పాయింట్లు 5. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 720 పాయింట్లు 6. చరిత్ అసలంక (శ్రీలంక)- 719 పాయింట్లు 7. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్)- 708 పాయింట్లు 8. శ్రేయస్ అయ్యర్ (భారత్)- 704 పాయింట్లు 9. ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్థాన్)- 676 10. కుశాల్ మెండిస్ (శ్రీలంక)- 669.

Read More

తుళ్లూరు గ్రామంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. భూమి పూజ చేశారు.ఈ హాస్పిటల్ ను 21 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. తొలి దశలో రూ.750 కోట్ల తో 500 పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుతో నిర్మాణం జరగనుంది. మొదటి విడత పనులు 2028 నాటికి పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు బాలకృష్ణ తెలిపారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నారా బ్రాహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు , ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు నారాయణ, సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులోకి రావడం వల్ల క్యాన్సర్ చికిత్సలో నాణ్యమైన సేవలను అందించేందుకు మెరుగైన వైద్య సదుపాయాలు, పరిశోధనల విస్తరణకు ఈ సంస్థ ఏర్పాటు ఉపయోగపడుతుంది. అందుబాటు ధరల్లో కేన్సర్ చికిత్స రాష్ట్ర ప్రజలకు…

Read More

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా భారత టెస్టు కెప్టెన్ శుభ్ మాన్ గిల్ ఎంపికయ్యాడు. జూలైలో ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా 3 టెస్టు మ్యాచ్ లలో 94.50 యావరేజ్ తో 567 రన్స్ చేశాడు. మొత్తంగా ఇంగ్లాండ్ తో సిరీస్ లో 4 సెంచరీలు సహా 754 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ‘ గా నిలవడం గిల్ కు ఇది 4వ సారి. ఈ సంవత్సరం ఫిబ్రవరి, 2023 జనవరి, సెప్టెంబర్ లలో కూడా గిల్ ఈ అవార్డును పొందాడు. ఇన్నిసార్లు ఆ అవార్డు గెలుచుకున్న మెన్స్ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ కావడం గమనార్హం. ఉమెన్స్ క్రికెటర్లలో వెస్టిండీస్ కు చెందిన హేలీ మ్యాథ్యూస్, ఆస్ట్రేలియా కు చెందిన ఆష్లీ గార్డ్ నర్ నాలుగేసి సార్లు ఈ అవార్డు పొందారు. ఇక జూలై…

Read More

భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఐపీఎల్ తర్వాత రోహిత్ కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్.. వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతను గత ఏడాదే టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. రోహిత్ కు నాయర్ పర్సనల్ కోచ్ కూడా. నాయర్ ఇంతకుముందు కార్తీక్, రాహుల్, రింకు సింగ్లతో కూడా కలిసి పనిచేశాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ లో ఆడేదానిపై చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వన్డే దిగ్గజం ఆ ఫార్మాట్లో 32 సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ పై భారత్ గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద…

Read More

భారతదేశం సెమీకండక్టర్ రంగంలో వేగంగా అడుగులు వేస్తోంది, మన డిజిటల్ భవిష్యత్తుకు శక్తినివ్వడానికి మరియు ప్రపంచ ఆవిష్కరణలను నడిపించడానికి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పంజాబ్‌లలో సెమీకండక్టర్ యూనిట్ల ఆమోదానికి సంబంధించిన తాజాగా తీసుకున్న మంత్రివర్గ నిర్ణయం, తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది, ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారతదేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.

Read More

పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్‌ డే. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా పంచుకుని మరీ అరాచకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు . పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దుచేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనందాల్చడం విచారకరమని అన్నారు.

Read More

పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తయింది. ప్రజలు తమ హాక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది! అని అన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం… భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదని దుయ్యబట్టారు.

Read More

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి మారెడ్డి లతా రెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడ నుంచి బయటకు పంపించి అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ ఎన్నికలను కూటమి మరియు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగనుంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నారు.

Read More