దౌత్య పరంగా భారత్ మరో విజయం సాధించింది. భారత జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ అప్పగించింది. బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా ఏప్రిల్ 23న సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, భారత్-పాక్ మధ్య సంప్రదింపుల ద్వారా నేడు అట్టారి సరిహద్దు వద్ద భారత అధికారులకు పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ భారత్ కు అప్పగించింది. అప్పగింత శాంతియుతంగా, స్థిరపడిన ప్రోటోకాల్‌ల ప్రకారం జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Author: admin
స్కిల్ డెవలప్మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధి శాఖలోని స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, న్యాక్, సీడాప్, ఓంక్యాప్ విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. స్కిల్ పోర్టల్ ను సింగిల్ ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. స్కిల్ ట్రైనింగ్ తద్వారా జరిగే ఉద్యోగ కల్పనను రంగాల వారీగా ట్రాక్ చేయాలని జిల్లాల వారీగా అమలు ప్రణాళికలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్ వృత్తి విద్యల బలోపేతం ద్వారా ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో స్థానంలో నిలిచింది. ఇటీవలే జరిగిన శ్రీలంకలో జరిగిన భారత్ ముక్కోణపు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో స్మృతి 5 ఇన్నింగ్స్ ల్లో 264 పరుగులు సాధించింది. ఫైనల్లో శ్రీలంకపై 101 బంతుల్లో 116 పరుగులు చేసింది. ఇక ఈ లిస్టులో నంబర్వన్ బ్యాటర్ లారా వోల్వార్ట్ కు స్మ్రతి కేవలం 11 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉంది. స్మృతి చివరిసారి 2019లో అగ్రస్థానం సాధించింది. బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారత్ నుండి దీప్తి శర్మ నాలుగో స్థానంలో ఉంది. సోఫీ ఎకిలోన్ నంబర్వన్ బౌలర్ కొనసాగుతోంది. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఆష్లీ గార్డ్నర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఉద్యానవన సాగుతోనే రైతుకు అత్యధిక ఆదాయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి రైతు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. హార్టీకల్చర్ పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఐదేళ్లలో సాగు రెట్టింపయ్యేలా ప్రణాళికల అమలు చేయాలని సమీక్షలో చంద్రబాబు పేర్కొన్నారు. 11 ప్రాధాన్య పంటలు – 24 క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలన్నారు. త్వరలో డ్రిప్ ఇరిగేషన్‌కు ఆటోమెషిన్ పరికరాల ఏర్పాటు. పండ్లతోటల రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్ల పంపిణీ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశానికి మంత్రి కె.అచ్చెన్నాయుడు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే దాకా సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని తెలిపింది. ఈ అంశంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించిందని పునరుద్ఘాటించింది. పాక్ పీవోకేని ఖాళీ చేయడమే మిగిలిందని వెల్లడించింది. కాల్పుల విరమణపై కూడా భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల నుండి సంప్రదింపులు జరిపిన వారితోనూ ఇదే విషయాన్ని చెప్పామని ఉగ్రవాదులను అణచివేయడమే భారత్ ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. దానికి బదులుగా పాక్ దుస్సాహసానికి దిగిందని ఎండగట్టారు. ప్రతిచర్యగానే భారత్ దాడులు చేసిందని తెలిపారు .
దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీ లాభాల తరువాత నేడు నష్టాల బాటలో పయనించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1281 పాయింట్లు నష్టపోయి 81,148 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 346 పాయింట్ల నష్టంతో 24,578 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.33గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎస్.బీ.ఐ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిన్న నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా సూచీలు దూసుకెళ్లాయి.
దేశ సైన్యానికి, నాయకత్వానికి దేవ సేనాని శక్తినివ్వాలని జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ సుబ్రహ్మణ్యుడి ఆశీస్సులతో ముష్కర మూకల ఆటకట్టించాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సిందూర్ తో దేశానికున్న ఆపదలు దూరం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశంతో రాష్ట్రంలోని పలు శ్రీ సుబ్రహ్మణ్య ఆలయాలు, అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య క్షేత్రంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు చేశారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్ అదే విధంగా పిఠాపురం శక్తి పీఠంలో జనసేన నేతల పూజలు చేశారు. పళని క్షేత్రంలో ఎమ్మెల్యే పంతం నానాజీ పళనిలో, ఎమ్మెల్యే సుందరపు విజయ్ తమిళనాడు లోని మధురై లో ఉన్న ప్రాముఖ్యమైన మధుర మీనాక్షి దేవాలయం, తిరుపురంకుండ్రమ్ అరుల్మీగు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను దర్శించి దేశం కోసం ప్రత్యేక…
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీ.బీ.ఎస్.ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. నేటి ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది 10 రిజల్ట్స్‌లో 93.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రం రీజియన్ పాస్ పర్సెంటేజీ లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 0.06 శాతం పెరిగింది. అటు 12వ తరగతి ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే 0.41 శాతం పాస్ పర్సంటేజ్ పెరిగింది. అత్యధికంగా విజయవాడ రీజియన్‌లో 99.60 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.
దేశ సేవలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీ నాయక్ ఇంటికి వెళ్లి.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దేశం కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందజేస్తామని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి అన్నివిధాలుగా తోడుగా ఉంటామని అన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్ లలో ఒకటైన ఆదంపూర్ ఎయిర్ బేస్ ను నేడు సందర్శించారు. సైనికులతో మాట్లాడారు. అదాంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను మరియు సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం మరియు నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇటీవలే భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ పని పట్టిన సంగతి తెలిసిందే. భారత సాయుధ దళాలు తమ సత్తా చాటాయి. అనంతరం భారత్ పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. గత రాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ తదనంతర పరిణామాలు గురించి జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్ కు తగిన బుద్ధి చెప్పినట్లు తెలిపారు. భారత్ పై మళ్లీ దాడిచేస్తే తగిన…
