Author: admin

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వలన తమకు జరిగిన నష్టాన్ని పాకిస్థాన్ ఇప్పుడిప్పుడే మెల్లగా తెలుపుతోంది. 11 మంది సైనికులు మరణించారని 78 మంది గాయపడ్డారని తాజాగా వెల్లడించింది. 40 మంది పౌరులు మరణించారని 121 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఈమేరకు పాకిస్థాన్ సైన్యానికి చెందిన డీజీ ఐ.ఎస్.పీ.ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ తమ దేశం ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్లు తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఫైటర్ జెట్ స్వల్పంగా ధ్వంసమైందని తెలిపారు. పాకిస్థాన్ చెబుతున్న దాని కంటే నష్టం ఎక్కువగానే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన ఎయిర్ మార్షల్ ఏకే భారతీ మీడియాతో మాట్లాడుతూ పాక్ జెట్ లను కూల్చిన విషయాన్ని ధ్రువీకరించారు.

Read More

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు పదవీ విరమణ చేయనున్నారు. దేశ 51వ చీఫ్ జస్టిస్ గా ఆయన సేవలందించారు. ఆయన స్థానంలో, సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పదవీ విరమణకు ముందు తదుపరి సీజేఐగా జస్టిస్ బి.ఆర్. గవాయ్ పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అధికారికంగా సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో జస్టిస్ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ ఖన్నాకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం జరగనుంది.

Read More

ఏపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పారితోషికాలను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీఓ) జారీ చేసింది. పెంచిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు గెస్ట్ లెక్చరర్లు కాదు, మన యువత భవిష్యత్తుకు మార్గదర్శకులని వారి సేవలకు న్యాయం చేయాలనే సంకల్పంతో జీతాలు పెంచామని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని గంటకు రూ.375 కి పెంచడం ద్వారా నెల వారీ పారితోషికం గరిష్టంగా 10,000 నుండి ₹27,000 కు పెరిగింది. ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు.

Read More

ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ నెల 17 నుండి సవరించిన షెడ్యూల్ తో ఐపీఎల్ జరగనుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈనెల 8న ఆగిన ఈ టోర్నీ తిరిగి 17న ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా కోల్ కతా-ఆర్సీబీ ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ముంబైలో మిగతా లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ వేదికలు తరువాత ప్రకటించనున్నారు. హైదరాబాద్ లో జరగాల్సిన రెండు మ్యాచ్ లను తరలించారు.

Read More

దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రసంగించారు. ‘ఆపరేషన్ సిందూర్’ తరువాత ఆయన మొదటి సారి దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. మన బలగాలకు సెల్యూట్‌ చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆపరేషన్‌ సింధూర్‌లో సాహసోపేతమైన ప్రదర్శన చేశారని భద్రతా దళాలను కొనియాడారు. పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే చంపారని మన తల్లుల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించామని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరుమొదలుపెట్టామని స్పష్టం చేశారు. పాక్‌ లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు ధ్వంసం చేశామని తెలిపారు.మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తేఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే జరుగుతాయి. పాక్‌కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదని పునరుద్ఘాటించారు. సైనికుల సాహస, పరాక్రమాలు దేశ మహిళలకు అంకితమని అన్నారు. రక్షణ దళాలు చేసిన సాహసం దేశానికే తలమానికం. ఉగ్రదాడి తర్వాత దేశం ఒక్కటిగా నిలిచిన సందర్భాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్‌లోని…

Read More

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జాన‌కీరామ్ కుమారుడు నంద‌మూరి తార‌క రామారావు హీరోగా పరిచయం కాబోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వైవీఎస్ చౌద‌రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. మూవీ ప్రారంభ‌త్స‌వ‌ కార్య‌క్ర‌మానికి నారా భువ‌నేశ్వ‌రి, దుగ్గ‌బాటి పురందేశ్వ‌రి, గారపాటి లోకేశ్వ‌రి హాజ‌ర‌య్యారు. నారా భువ‌నేశ్వ‌రి హీరో హీరోయిన్ల‌పై క్లాప్ కొట్టి అభినందించారు. ఇక మరోవైపు ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు తార‌క రామారావుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోష‌ల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్‌టీఆర్ గొప్ప విజ‌యాలు అందుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. “తార‌క రామారావు ఇండ‌స్ట్రీలో అడుగుపెడుతోన్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ఎన్‌టీఆర్ గొప్ప విజ‌యాలు అందుకోవాల‌ని కోరుకుంటున్నానని సీఎం చంద్ర‌బాబు పోస్ట్ చేశారు.

Read More

‘ఆపరేషన్ సింధూర్’ పై డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి కీలక ప్రకటన చేశారు. మా పోరాటం పాక్‌ ఆర్మీ, ప్రజలపై కాదని పేర్కొన్నారు. భారత్‌ పోరాటం ఉగ్రవాదంపైనేనని ఏకే భారతి మరోసారి పునరుద్ఘాటించారు. దేశం కోసం తమ బాధ్యత నిర్వర్తించామని తెలిపారు. పాకిస్తాన్‌ వివిధ రకాల డ్రోన్లను వినియోగించిందని దేశీయంగా తయారు చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్ తో మనం వాటిని అడ్డుకున్నట్లు తెలిపారు. ఆకాశ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్ తో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాక్‌ దాడి చేసిందని అయితే వాటిని మనం ఆకాశ్‌ క్షిపణులతో నిర్వీర్యం చేశామని చెప్పారు. పాక్‌లోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడి చేసిందని తెలిపారు. దీంతో నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ రన్‌వేకు తీవ్రనష్టం జరిగిందన్నారు. ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్‌ చేస్తున్నారు. 9, 10 తేదీల్లో పాక్‌…

Read More

భారత టెస్ట్ క్రికెట్ లో ఒక అత్యద్భుత శకం ముగిసింది. భారత స్టార్ క్రికెటర్ ఈ తరం మేటి ఆటగాడు విరాట్ కోహ్లీ అనుకున్నట్లుగానే టెస్టు క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ కూడా తన బాటలోనే పయనించాడు. వీరిద్దరూ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తరువాత ఒకే సారి ఆ ఫార్మాట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలతో భారత టెస్ట్ క్రికెట్ లో ఒక శకం ముగిసినట్లయింది. విరాట్ కోహ్లీ 14 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2011లో వెస్టిండీస్ తో మొదటి టెస్ట్ ఆడాడు. తన కెరీర్ లో 123 టెస్టు మ్యాచ్ లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి…

Read More

భారత్-పాక్ నియంత్రణ రేఖ (LOC) వద్ద గత రాత్రి ఎటువంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం తెలిపింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత నుండి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితులు తెలిసిందే. కాగా, 19 రోజుల తరువాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడించిందని తెలిపింది. ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత సైనిక ఘర్షణ ఆపేందుకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే, అదే రోజు పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాక్ వెనక్కి తగ్గింది. ఆ తరువాత ఎటువంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ స్పష్టం చేసింది.

Read More

భారత్-పాక్ ల మధ్య కాల్పుల విరమణను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించిన విషయం విదితమే. విక్రమ్ మిస్రీ పై పలువురు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖండించారు. మిస్రీ అద్బుతంగా పని చేశారని కొనియాడారు. ‘సంఘర్షణలు జరుగుతున్న వేళ విక్రమ్ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు తెలిపారు. ఆయన చాలా కష్టపడ్డారని భారత్ గొంతును బలంగా వినిపించారని అలాంటి అధికారిని ఎవరు? ఎందుకు? ట్రోల్ చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని శశి థరూర్ అన్నారు. ఆయనను విమర్శించే వారు అంతకంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేయగలరా? అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా శశి థరూర్, భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పనితీరును కూడా అభినందించారు.

Read More