పాకిస్థాన్ ఉగ్ర కుట్రలకు ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’ తో తగిన గుణపాఠం చెప్పిన భారత్ అంతర్జాతీయంగా కూడా పాక్ దుష్టబుద్దిని ఎండగట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిల పక్ష టీమ్ లను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ లకు నాయకత్వం వహించే 7 మంది ఎంపీలను కూడా నేడు ప్రకటించింది. శశిథరూర్ -కాంగ్రెస్, రవిశంకర్ ప్రసాద్-బీజేపీ, బైజయంత్ పాండాబీజేపీ, సంజయ్ కుమార్ ఝా-జేడీయూ, కనిమొళి-డీఎంకే, సుప్రియా సూలే- ఎన్సీపీ -ఎస్పీ, శ్రీకాంత్ శిందే- శివసేన. ఈ బృందాలకు ఈ ఏడుగురు నాయకత్వం వహించనున్నారు. మొత్తంగా 7 గ్రూపులు 10రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఈ విషయంపై విపక్షాలతో చర్చలు జరిపి సభ్యులను ఎంపిక చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇటీవల జరిగిన పరిణామాలు, ఉగ్రవాదంపై భారత్ పోరాడుతున్న తీరు తదితర అంశాలను విదేశాలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
Author: admin
అగ్ర కధానాయకుడు మెగాస్టార్ చిరంజీవి వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారో మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. నయనతార మెగాస్టార్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. #మెగా 157 లో ఆమె అలరించనున్నట్లు మూవీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈసినిమాను సుస్మితా కొణిదెల, సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందిస్తున్నారు. Welcoming the ever graceful queen, #Nayanthara garu to our #Mega157 journey as she brings her brilliance and elegance alongside our Megastar @KChiruTweets garu once again ❤️— https://t.co/P5SFAMwNKR#ChiruAnil SANKRANTHI 2026 – రఫ్ఫాడించేద్దాం…
ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏపీ లోని కూటమి ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇక నేడు ఈ నెలలో మూడో శనివారం సందర్భంగా కర్నూలు జిల్లా, పాణ్యంలో సీఎం చంద్రబాబు..”స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యానవనం అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసి,శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఖతార్ వేదికగా జరిగిన దోహా డైమండ్ లీగ్ 2025లో భారత జావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో మొదటిసారి 90మీ. మార్క్ ను దాటాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ మూడో రౌండ్‌లో 90.23 మీటర్ల త్రో విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హౌమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు. తొలి రౌండ్‌లో 88.84మీ. విసిరాడు. రెండో రౌండ్ ఫౌల్ అయింది. ఇక మూడో రౌండ్‌లో తన కెరీర్ బెస్ట్‌ను సాధించాడు. ఏకంగా 90 మీటర్లు విసిరి సత్తా చాటాడు. అయితే జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ (91.06 మీటర్లు) చివరి రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత అండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లతో మూడో…
ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి నేతలు తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ పతాకాలు చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే, మనం వాళ్ళ ఇంట్లో దూరి కొడతాం… ఇది నయా భారత్, శాంతి వచనాలు పనిచేయవు, సహనం పేరుతో ఇక చేతులు కట్టేయలేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ తో మన దేశ పోరాట పటిమను చాటిచెప్పిన సైనిక దళాలకు వందనం.రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. పహల్గాం పేరు వింటేనే ఆ విషాదం గుర్తుకొచ్చి రక్తం మరిగిపోతుంది. మనందరి గుండెల నిండా ఉన్న…
అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ. 22వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్లీన్ ఎనర్జీ రివల్యూషన్‌కి అనంతపురంలో భూమి పూజతో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఇండియాలో క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్‌కి భూమి పూజ చేసిన చారిత్రక ఘట్టంలో తానూ భాగం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. క్లీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్‌ని హబ్‌గా తీర్చిదిద్దేందుకు సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. విజనరీ సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో ది ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీ దేశానికి దిక్సూచిగా నిలవనుందని తెలిపారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్ , రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ…
భారతీయ సినిమా పితామహుడు, దిగ్గజం దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో తెలుగు స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని వస్తున్న వార్తల ప్రకారం తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఎస్.ఎస్.కార్తీకేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారని ఆ వార్తలను బట్టి తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ‘మేడ్ ఇన్ ఇండియా ‘ పేరుతో పలు భాషల్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో కూడా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన అసలు పేరు ధుందిరాజ్ గోవింద్ ఫాల్కే (1870-1944), భారతదేశంలో సినిమా పరిశ్రమకు పునాది వేసిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. 1913లో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి చూపుతున్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం జరిగింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఎనర్టీ, పర్యాటకం, ఐటీ,ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 6 ఎస్ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు.
మన భారతీయ త్రివర్ణ పతాక రంగులతో చంద్రగిరి కోట కాంతులతో వెలిగిపోతోంది. మన సాయుధ దళాల్ని వారు దేశానికి చేసిన వారి నిస్వార్థ సేవను గౌరవిస్తూ త్రివర్ణ పతాక రంగులతో కాంతులీనుతోందని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుపతిలో ఉన్న ఈ కోట ఆంధ్రప్రదేశ్ గత కాలపు శిల్పకళా వైభవాన్ని మరియు సాంస్కృతిక ఖ్యాతిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. దురదృష్టవశాత్తూ, ఇటీవలి సంవత్సరాల్లో దీని సంరక్షణ నిర్లక్షించబడిందని, అయితే ఈ కోటను పునరుద్ధరించి, జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. దీని ద్వారా ఇది భారత వారసత్వ పటంలో తగిన స్థానం తిరిగి పొందేలా చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రక స్మారకాలను సంరక్షించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరచిపోయిన అధ్యాయాన్ని ప్రజలకు గుర్తుకు తీసుకువస్తున్నామని చంద్రబాబు అన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో ఉదయం వరకు నష్టాల బాటలో పయనించిన సూచీలు మధ్యాహ్నం తర్వాత దూసుకెళ్లాయి. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ కు కలిసొచ్చాయి. దీంతో భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 82,530 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 395 పాయింట్ల నష్టంతో 25,062 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.52గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకి షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
