Author: admin

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం పాటు వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు పయనమయ్యారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా, పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చేసిన పనితో ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. విమానం ఎక్కిన ఆస్ట్రేలియా బయలుదేరిన పాంటింగ్ భారత్-పాక్ ల మధ్య కాల్పుల విరమణ ప్రకటన రాగానే విమానం దిగి ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. పంజాబ్ ఆటగాళ్లు మార్క్ స్టోయినీస్, ఆరోన్ హార్టీ, జోష్ ఇంగ్లీస్, బార్ట్ లెట్ లతో మాట్లాడి కాల్పుల విరమణ ప్రకటన గురించి చెప్పి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చి భారత్ లోనే ఉండే విధంగా ఒప్పించాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ వర్గాలు ధృవీకరించాయి.

Read More

భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో జరిగిన ట్రై యాంగిల్ సిరీస్ లో విజయం సాధించింది. తాజాగా జరిగిన ఫైనల్ లో శ్రీలంక పై 97 పరుగుల తేడాతో అలవోకగా విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతీ మంథాన 116 (101;15×4, 2×6) సెంచరీతో ఆకట్టుకుంది. హర్లీన్ డియోల్ 47 (56;4×4), జెమీమా (44; 29; 4×4), హర్మన్ ప్రీత్ కౌర్ 41 (30; 4×4, 1×6) పరుగులతో రాణించారు. మల్కీ మదార, దేవ్మీ విహంగ , సుగంధిక కుమారి తలో 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 245 పరుగులకే ఆలౌటైంది. చమరీ ఆటపట్టు 51(66; 6×4, 1×6) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 4 వికెట్లు, అమన్ జ్యోత్ 3…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ అధికారులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.‌ పహల్గామ్‌ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యుల ఆవేదనను దేశం మొత్తం చూసింది. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్‌ చేశామని చెప్పారు. 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం.. అజ్మల్‌ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీ లాంటివారికి శిక్షణ ఇచ్చిన ప్రాంతాలపై దాడి చేశాం.. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్‌ సిందూర్‌ అని DGMO రాజీవ్ ఘాయ్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలపై దాడిని వీడియో తీసి విడుదల చేశామని తెలిపారు. 9 ఉగ్రవాద శిబిరాల్లో వంద మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్‌ మాత్రం సామాన్యులు, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లను టార్గెట్‌ చేసిందని డీజీఎంవో రాజీవ్ ఘాయ్‌ పేర్కొన్నారు. నిన్న పాక్‌ DGMO నాతో మాట్లాడి కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. కాల్పుల విరమణ అంగీకారం కుదిరాక కూడా నిన్న రాత్రి పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడింది. దానిపై పాక్‌ DGMOను వివరణ…

Read More

‘ఆపరేషన్ సిందూర్’ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో భారత రాజకీయ, సామాజిక వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు . ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. మన సైన్యం పరాక్రమాన్ని చూపిందని పాకిస్థాన్ సైనిక హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి లో కూడా గర్జించిందని స్పష్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో ‘బ్రహ్మోస్’ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదంపై పోరులో భారత్ ధృఢ సంకల్పాన్ని మన సైనిక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పిందని పేర్కొన్నారు. భారత్ పాక్ పౌరులపై దాడి చేయలేదని పాక్ మాత్రం సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు.

Read More

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌ లో ఏర్పాటు చేసిన ఈ హై లెవెల్ మీటింగ్ లో, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం నిన్న ప్రకటించగా, అనంతరం కాసేపటికే పాకిస్థాన్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్.. జమ్మూకశ్మీర్‌, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ,…

Read More

దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సవిత, సత్య కుమార్ యాదవ్, అనిత, అనిగాని తదితరులు నివాళులు అర్పించారు. మంత్రి లోకేష్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. అగ్నివీర్ మురళీ నాయక్ ఋణం తీరనిదని పేర్కొన్నారు. మురళీ నాయక్ భౌతిక కాయాన్ని మోసి వీరు జవాన్ కు అశ్రు నివాళి అర్పించారు.

Read More

దేశ సరిహద్దుల్లో దేశ భద్రత కోసం తన ప్రాణాలర్పించిన ఏపీకి చెందిన సైనికుడు మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి మురళీ నాయక్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లితండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 5ఎకరాలతో పాటు 300 గజాల ఇంటిస్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనున్నారు. వీర మరణం పొందిన సైనికుడికి వ్యక్తిగతంగా పవన్ రూ.25లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

Read More

ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో భారత్ రెండు గోల్డ్ మెడల్స్ తో పాటు 5 మెడల్స్ గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో మధుర ధమాంగోకర్ గోల్డ్ మెడల్ గెలిచింది. ఫైనల్ లో 139-138తో అమెరికాకు చెందిన కార్సన్ క్రహే పై విజయం సాధించింది. 24 సంవత్సరాల మధుర టీమ్ సిల్వర్, మిక్సెడ్ బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్ లో మధుర, తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖలతో కూడిన జట్టు 221-234తో మెక్సికో చేతిలో పరాజయం చెందింది. ఇక మిక్సెడ్ టీమ్ లో మధుర, అభిషేక్ వర్మ జోడి కాంస్యం సాధించింది. మెన్స్ టీమ్ ఈవెంట్ ఫైనల్ లో గోల్డ్ గెలిచింది. ఫైనల్ లో అభిషేక్ శర్మ, ఓజాస్ దేవోతలే రిషబ్ యాదవ్ లతో కూడిన టాప్ సీడ్ భారత జట్టు 232-2228తో మెక్సికో పై విజయం సాధించింది.

Read More

శత్రు దేశం పాకిస్థాన్ మరోసారి తన దుష్ట వైఖరిని అవలంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన కొద్ది గంటలలోనే సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. నేడు రాత్రి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని దుయ్యబట్టారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్థాన్ దేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా బదులిస్తుందని పేర్కొన్నారు. పాక్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలను పాకిస్థాన్ నిలువరిస్తుందని ఆశిస్తున్నట్టు విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు.

Read More

భారత్ – పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు ఒప్పుకున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. నేటి సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరినట్లు మిస్రీ తెలిపారు. ఈనెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు వివరించారు. ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయన్న విషయంపై త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు పాక్ మంత్రి ఇషాక్‌దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఉద్రిక్తతలు చల్లబడనున్నాయి. భారత్-పాక్‌లతో జరిపిన చర్చలపై అమెరికా కార్యదర్శి రూబియో క్లారిటీ ఇచ్చారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో కలిసి ఇరుదేశాలతో చర్చలు జరిపినట్లు ప్రకటించారు. ఇరుదేశాల ప్రధానమంత్రులతో పాటు భారత్ విదేశాంగశాఖ మంత్రి జై…

Read More