‘ఆపరేషన్ సిందూర్’ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని అదొక కమిట్మెంట్ అని రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆయన నేడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాకిస్థాన్ నుండి ఆయుధాలు తీసుకుని పర్యవేక్షించాలని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే పాకిస్థాన్ వంటి దేశం వద్ద అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉగ్రస్థావరాలు ఎక్కడ ఉన్నా ధ్వంసం చేస్తామని చెప్పారు. ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సైనికులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ పొ ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగా భావిస్తానని హెచ్చరించారు. మన భద్రతా దళాలు అద్భుతంగా పోరాడుతున్నారని తెలిపారు. పహాల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన పాకిస్థాన్ షెల్లింగ్ లో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు.
Author: admin
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 22వ సినిమా #RAPO22 టైటిల్ ను నేడు ప్రకటించారు. నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే పేరును ఖరారు చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో ఈమూవీ రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇక ఈసినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సూర్య కుమార్ అనే సూపర్ స్టార్‌గా కనిపించనున్నారు. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్…
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ‘స్పేస్ టూర్’ తేది ఖరారైంది. యాక్సియం స్పేస్ సంస్థ చేపట్టిన యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్‌లో భాగంగా ఆయన ఈ సంవత్సరం జూన్ 8న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) వైపు పయనించనున్నారు. ఈమేరకు ఈవిషయాన్ని యాక్సియం స్పేస్, నాసా సంయుక్త ప్రకటనలో ప్రకటించాయి. అయితే ముందుగా ఈ మిషన్‌ను మే 29న నిర్వహించేందుకు షెడ్యూల్ చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వలన అది వాయిదా పడింది. దీంతో ఈప్రయోగాన్ని జూన్ లోకి జరిపేందుకు నిర్ణయించారు. మన దేశ కాలమానం ప్రకారం జూన్ 8 సాయంత్రం 6:41కి ఫ్లోరిడా లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి డ్రాగన్ స్పేస్ షిప్ లో శుభాంశు స్పేస్ లోకి దూసుకెళ్లనున్నారు. ఇక ఈ యాత్రలో అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ, హాంగేరీకీ చెందిన టిబర్ కపు కూడా వెళ్లనున్నారు. రెండు వారాల పాటు…
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను బెంబేలెత్తించిన భారత్ యుద్ధ క్షేత్రంలోనే కాకుండా ఇంటర్నెట్ లో కూడా భారత్ పైచేయి సాధించింది. ఒకవైపు పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేస్తూనే మరోవైపు సైబర్ వార్ లోనూ ఆ దేశ హ్యాకర్ల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ చేసిన అనేక సైబర్ తప్పుడు ప్రచారాన్ని సైతం ప్రూఫ్ లతో సహా తప్పని నిరూపించింది. నాలుగు రోజుల ఘర్షణలో పాకిస్థాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను మన భద్రతా దళాలు కూల్చేసశాయి. ఎయిర్ డిఫెన్స్ తో చొరబాట్లను అడ్డుకుంది. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సైబర్ వారియర్స్ డిజిటల్ చొరబాట్లనూ అదే స్థాయిలో తిప్పికొట్టారని సోషల్ మీడియా మెయిన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
భారత్ జావెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ఇచ్చారు. ఈమేరకు రక్షణా మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే నీరజ్ చోప్రా ఆర్మీ లో సుబేదార్ మేజర్ గా ఉన్నాడు. 27 సంవత్సరాల అతను 2020 టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, 2024 పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2023 వరల్డ్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. ఇక 2011లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేసిన విషయం విదితమే.
రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబాబు సమీక్ష చేశారు. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 1000 కి.మీ పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ సెక్రటరీ టి.కె. రామచంద్రన్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఇక విజయవాడలో జరిగిన పశుసంవర్థక శాఖ – టెక్ AI 2.0 కాన్‌క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు ఆకర్షి, మాళవిక, గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ జోడీలు శుభారంభం చేశారు. ఆకర్షి జపాన్ కు చెందిన కావోరు సుగియామా పై 21-16, 20-22, 22-20తో గెలిచింది. మాళవిక బాన్సోద్ 21-12, 13-21, 21-17తో టర్కీకి చెందిన నెస్లిహాన్ అరిన్ పై విజయం సాధించింది. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం 21-15, 21-13తో మలేషియాకు చెందిన ఆంగ్ జి, సి టింగ్ పై గెలిచి ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ 18-21, 21-19, 17-21తో ఐర్లాండ్ కు చెందిన నాట్ గుయెన్ చేతిలో ఓడిపోయాడు.
భారత జట్టు స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. దీంతో సుదీర్ఘ కాలం పాటు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆటగాడిగా నిలిచాడు. 1,151 రోజులుగా జడేజా ఈ స్థానంలో కొనసాగుతున్నాడు. 400 పాయింట్లతో తాజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ప్లేయర్లు: 1.రవీంద్ర జడేజా (భారత్) – 400 పాయింట్లు 2.మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్) – 327 పాయింట్లు 3.మార్కో యన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 పాయింట్లు 4.పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) – 271 పాయింట్లు. 5.షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 253 పాయింట్లు 6.జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) – 249 పాయింట్లు 7.జో రూట్ (ఇంగ్లాండ్)…
మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో టీడీపీ అగ్రనేత లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో చర్చించారు. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించడం జరుగుతోందిమని పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించామని ఈ సందర్భంగా అన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. కడపలో నిర్వహించే మహానాడుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నేతలను కోరారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కింగ్డమ్’. మే 30న విడుదల కావాల్సిన ఈ మూవీ తాజాగా వాయిదా పడింది. ఈమేరకు మూవీ టీమ్ దీన్ని జులై 4న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని ఎంతో ప్రయత్నించాం. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీని వాయిదా వేస్తున్నాం. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ అంటూ సందడి చేయకూడదు. అందుకే మేం సినిమాను జులై 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.
