Author: admin

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 7 నుంచి రేషన్‌కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.కొత్త రేషన్‌కార్డులు, కుటుంబసభ్యుల చేరిక-తీసివేత, చిరునామా మార్పులు వంటివి చేసుకోవచ్చని వివరించారు. అర్హత లేకుండా రాయితీ పొందుతున్న వారు కార్డులను సరెండర్‌ చేయాలని సూచించారు.క్యూ ఆర్ కోడ్‌‌తో స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కుటుంబ సభ్యులు పేర్ల అన్ని చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ చేస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలల రేషన్ తీసుకున్న వివరాలు కూడా కనిపించేలా వీటిని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా ఈ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలను కూడా తెలుసుకోవచ్చన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ అవుతుందని ఆయన స్సష్టం చేశారు. జూన్…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగించాయి. కేంద్ర ప్రభుత్వం రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించడంతో మళ్లీ భారత్ పాక్ లో మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికి తోడు అమెరికా ఫెడ్ రిజర్వ్ నుండి ఇంట్రెస్ట్ రేట్లపై రేపు నిర్ణయం వెలువడనుండడం కూడా సూచీల జోరును తగ్గించింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 81 పాయింట్ల లాభంతో 24,379 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.43గా కొనసాగుతోంది. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, హిందూస్థాన్ యూనీలివర్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి.

Read More

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. భారత్ తిరిగి ప్రతీకార దాడులు చేస్తుందోనని పాకిస్థాన్ వణికిపోతోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు కేంద్రం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో పౌరులకు అవగాహన కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 7 న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటి సారి. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. శత్రు దేశాల నుంచి ఆకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పించేందుకే ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్. ఇక ఇందులో భాగంగా పలు కీలక అంశాలను కేంద్ర…

Read More

రోడ్ యాక్సిడెంట్లలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత ట్రీట్మెంట్ అందించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణం ఇది అమలులోకి వచ్చినట్లు అందులో తెలిపింది. రహదారి ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ అందించాలని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ -2025’ గా పేరు పెట్టింది. మోటార్ వెహికల్ వలన ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ స్కిమ్ కింద హాస్పిటల్స్ లో రూ.1.5 లక్షల వరకూ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందడానికి అర్హులవుతారు. యాక్సిడెంట్ అయినప్పటి నుండి 7 రోజుల వరకు ఈ సేవలు పొందవచ్చు. పేషేంట్ కు ట్రామా పాలీ ట్రామా సేవలు అందించే సామర్థ్యం ఉన్న అన్ని హాస్పిటల్స్ ను…

Read More

ఈరోజు, రేపు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పల్నాడు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పిడుగులు పడడంతో పాటు 50 కిమీ నుండి 60 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసారి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. నిన్న పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read More

ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎలాంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. పదోతరగతి పరీక్షా ఫలితాలపైనా సమీక్షించారు. ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలని అంబేద్కర్ విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభానికి విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Read More

విజయవాడ నుండి విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీస్ జూన్ 1 నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ రూట్ ఆంధ్రప్రదేశ్‌ రవాణా అనుసంధానం లో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని లోని విజయవాడను, ఆర్థిక కేంద్రమైన విశాఖపట్నంతో ఇది కలుపుతుందని అన్నారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం మరియు రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా ఈ కీలకమైన విమాన సేవ మళ్లీ ప్రారంభమవడం ఆనందంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక సవరించిన షెడ్యూల్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించనుంది. ఇండిగో విమానం ఉదయం 7:15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి, ఉదయం 8:25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, విమానం ఉదయం 8:45 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, ఉదయం 9:50…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో లాభాలతో ముగిశాయి. ఫారెన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సూచీలు లాభాలను ఆర్జించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 294 పాయింట్లు లాభపడి 80,796 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 114 పాయింట్ల లాభంతో 24,461 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.28గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

ఐసీసీ విడుదల చేసిన మెన్స్ క్రికెట్‌ వార్షిక ర్యాంకింగ్స్‌లో లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్లలో భారత హవా కొనసాగుతోంది. వన్డేలు, టీ20లలో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే టెస్టు ఫార్మాట్‌లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 2024 మే నుండి ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ర్యాంకుల‌ను వెల్ల‌డించింది. వ‌న్డే ర్యాంకుల్లో భారత్ నెంబర్ వన్ గా ఉంది. ఇటీవ‌ల ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని గెలుచుకున్న‌ భార‌త్ త‌న రేటింగ్ పాయింట్ల‌ను 122 నుండి 124కు పెంచుకుని అగ్రస్థానాన్ని కైవ‌సం చేసుకుంది. చాంపియ‌న్స్ ట్రోఫీ ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు టీ20ల్లో కూడా భారత జట్టే టాప్‌ లో ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్ లు ఉన్నాయి. టెస్టుల్లో ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

Read More

యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి SchneiderElectric సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి, 2027వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, NAC శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ ల ఏర్పాటుద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9వేల మంది యువతకు శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు.

Read More