స్పేస్ సెక్టార్ లో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ‘గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్’ సందర్భంగా ఆయన ప్రసంగించారు. భారత్ చేపట్టిన మంగళ్ యాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాల గురించి ప్రస్తావించారు. విజయవంతంగా వీటిని భారత్ చేసిందన్నారు. చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడను కనుగొన్నామని పేర్కొన్నారు. సౌత్ ఆసియా దేశాల కోసం ప్రత్యేక శాటిలైట్ ప్రయోగించినట్లు గుర్తు చేశారు. త్వరలో భారత ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) రోదసి లో పర్యటిస్తాడని స్పష్టం చేశారు. 2050 నాటికి చంద్రుడిపై భారతీయులు అడుగు పెడతారని పేర్కొన్నారు. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ ఈనెల 9వరకు జరగనుంది.
Author: admin
కొనసీమ జిల్లా కొత్తపేటలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్న ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది.మన్యం వీరుడు,విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని నేతలు పాదాల వద్ద ఉంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చీరాల జగ్గి రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట తిమూర్తులు,మాజీ మంత్రి సీ వేణుగోపాల్ పాల్గొన్నారు.మహానీయుడి చిత్రాన్ని ఈ విధంగా ఉంచడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అల్లూరి వంటి మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారి చర్యలు అల్లూరి అభిమానుల మనసును బాధించాయని వ్యాఖ్యానిస్తున్నారు.ఒక వేళ తెలియక చేసిన తప్పయినా,నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు గారి గౌరవాన్ని భద్రంగా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అని పోస్ట్లు పెడుతున్నారు.అయితే ఈ ఘటనపై వైసీపీ నాయకులు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో ఈ…
భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై ఈరోజు తెల్లవారుజామున కచ్చితమైన దాడులు చేశాయి. ఈ కీలక పరిణామం అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన కీలక వివరాలను ప్రధాని రాష్ట్రపతికి వివరించారు. భారత సైన్యం చేసిన ఈ దాడుల్లో భాగంగా, పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది కీలక స్థావరాలు ఉండడం పాక్ ఏస్థాయిలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో అర్థమవుతోంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్ నీచ బుద్ది మరోసారి తేటతెల్లమైంది.
పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై ఈరోజు భారత బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ తో విరుచుకుపడి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను అంతమొందించిన సంగతి తెలిసిందే.పహాల్గాం దాడికి ప్రతిచర్యగా పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎం లు, సీఎస్ లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. రేపు దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ జరగనుంది.
ఆపరేషన్ సింధూర్ వివరాలను విదేశాంగ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు . ఏప్రిల్ 22న పహల్గామ్ లో భారత పర్యటకులపై ఉగ్రదాడి జరిగింది.. ఈ దాడిలో సుమారు 26 మందిని చంపేశారు.. జమ్మూ కశ్మీర్ లో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి.. కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు దాడి చేశారని విక్రమ్ మిస్రీ అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని తెలిపారు ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉందన్నారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసింది. ఈ దాడి చేశామని సోషల్ మీడియాలో టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందనే పాకిస్తాన్ పై దౌత్య, వాణిజ్య పరమైన ఆంక్షలు విధించామని పేర్కొన్నారు . చాలా కాలం నుండి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని విదేశాంగ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ పునరుద్ఘాటించారు. నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ లోని ఎల్ఈటీ క్యాంపుపై మొదటి…
భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై వేగంగా ప్రతీకారం తీర్చుకున్నందుకు భారత సాయుధ దళాల వీర యోధులకు గర్వంతో సెల్యూట్ చేస్తున్నాను. వారి అసమానమైన శౌర్యం మరియు ఖచ్చితత్వంతో, మన దేశం ఉక్కు సంకల్పంతో తనను తాను రక్షించుకుంటుందనే విషయాన్ని వారు మళ్లీ నిరూపించారు. నేడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ప్రపంచం మన బలాన్ని మరియు సంకల్పాన్ని చూసింది. మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంది మరియు మన సాయుధ దళాలకు దృఢంగా మద్దతు ఇస్తుంది. జై హింద్! అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని తీవ్ర హెచ్చరికలు పంపారు. ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ఇది భారత్ స్పందనని తెలిపారు. మన దేశ భద్రతా బలగాల చర్యలపై ఎంతో గర్వంగా ఉంది. పహాల్గాం లో జరిగిన దారుణ హాత్యలకు ప్రతిస్పందించే ఈ ఆపరేషన్ అని స్పష్టం చేశారు. భారత్ పై దేశ ప్రజలపై జరిగే ఏ దాడికైన తగిన రీతిలో స్పందించేందుకు మోడీ సర్కారు కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారత్ లోని రాజకీయం సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పౌరులు భారత సాయుధ దళాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు నేటి తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేశాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట నిర్వహించిన ఈ కచ్చితమైన దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు అత్యున్నత స్థాయి భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్ లకు చెందిన మొత్తం 9 ఉగ్రస్థావరాలపై ఈ దాడులు జరిగాయి. పహల్గామ్‌లో 26 మంది అమాయక పౌరుల మృతికి కారణమైన దాడికి ప్రతిచర్యగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది.
పహల్గామ్ లో అమాయక టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ దళాలు నేటి వేకువ జామున సంయుక్తంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని 9 ఉగ్రవాద లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో మిసైల్ దాడులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై మూడు రక్షణ దళాలు కలిసికట్టుగా దాడి చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. పహాల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి. “భారత్‌పై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేస్తున్న పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం ఒక ప్రకటనలో…
ఐపీఎల్ సీజన్ 18 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గుజరాత్ నెగ్గింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ 53 (35; 5×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ (35), కార్బిన్ బాస్ (27) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 2 వికెట్లు, సిరాజ్, అర్షద్ ఖాన్, కొయిట్జీ, ప్రసీద్ కృష్ణ, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం గుజరాత్ టార్గెట్ ను 19 ఓవర్లలో 147 పరుగులుగా నిర్ణయించారు. గుజరాత్ సరిగ్గా 19 ఓవర్లలో లక్ష్యాన్ని…
