దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, , గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ రక్షణలో తన కర్తవ్యంలో ఉండగా ఆయన మరణించడం పట్ల దేశవ్యాప్తంగా అందరూ ఆయన త్యాగాన్ని కొనియాడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మురళి నాయక్ ను కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
Author: admin
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో ఐపీఎల్-2025ను బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిరవధిక వాయిదా వేసింది. భద్రతా కారణాల వలన నిన్న ధర్మశాలలో జరిగిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్న సంగతి ప్రపంచమంతా తెలిసిన విషయమే. తమ దేశం అటువంటివి ప్రోత్సహించదని మాత్రం పైకి నీతులు చెప్పే దాని వంకర బుద్ది మరోసారి తేటతెల్లమైంది. ఇటీవల పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ తో విరుచుకుపడి ఉగ్రవాదులను ఏరి పారేసింది. ఆ దాడులలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సైనికాధికారులు , ప్రభుత్వ అధికారులు హాజరై నివాళులు అర్పించారు. దానికి సంబంధించిన ఫొటోనూ భారత హై కమిషనర్ విక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టి పాక్ దుర్బుద్ధిని ప్రపంచానికి తెలిపారు. పాక్ ఏస్థాయిలో ఉగ్రమూకలను తయారుచేస్తుందనే దానికి ఇదొక కీలక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరణించిన వారిలో 1999 కాందహార్ లో IC 814 ఫ్లైట్ హైజాక్ లో కీలక సూత్రధారి రవుఫ్ అజర్ కూడా ఉన్నాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 9 నుండి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఐసీఏఐ తెలిపింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని వివరించింది. ఎగ్జామ్స్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్ icai.orgలో అధికారిక నోటీస్ చెక్ చేసుకోవాలని సూచించింది.
భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పులకు భారత ఆర్మీ అత్యంత సమర్థవంతంగా తిప్పకొట్టాయి. ఈ క్రమంలో పలు పాకిస్థానీ సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాక్ సైనిక పోస్టును భారత దళాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను కూడా భారత సైన్యం తాజాగా విడుదల చేసింది. గత రాత్రి పాకిస్థాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి పలు దాడులకు పాల్పడ్డాయని భారత సైన్యం అధికారికంగా తెలిపింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ పొడవునా పాక్ దళాలు అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఏడీజీ పీఐ-ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా తెలిపింది. పాకిస్థాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడుల ప్రయత్నాలను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన కొద్ది గంటల్లోనే పాక్ దళాలు…
మరోసారి పాకిస్థాన్ దుష్ట వైఖరిని ప్రదర్శించింది.అయితే దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ము కశ్మీర్ తో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులకు సెలవులను రద్దు చేశాయి. అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని, అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. ఈ సమాచారం అందిన వెంటనే, ప్రధానమంత్రి మోడీ తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,…
భారతదేశంలోని 15 నగరాలపై ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. ఈ పరిణామంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆకాశంలోనే ఎదుర్కొన్నాయి. సోషల్ మీడియా లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.జమ్మూతో పాటు 300 కిలోమీటర్ల దూరంలోని కుప్వారా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ పట్టణాలలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి, బ్లాక్‌అవుట్ ప్రకటించారు. బారాముల్లాలోనూ పూర్తిస్థాయి బ్లాక్‌అవుట్ అమలులో ఉంది. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడింది. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే, భారత వాయు రక్షణ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించి, ఈ క్షిపణులన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేశాయి.
భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. ఇన్నేళ్ల కెరీర్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 38 ఏళ్ల రోహిత్ 2013లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 67 మ్యాచ్ లు ఆడి 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఇక వన్డేల్లో మాత్రమే అతను కొనసాగుతాడు. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఒకసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరింది. జూన్ లో భారత్ ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అతని స్థానంలో ఎవరు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారో చూడాలి.
వైవిధ్యభరితమైన కథాంశంతో వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనలే ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం “కర్మణ్యే వాధికారస్తే”. ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈచిత్రం యొక్క కథాంశం. తాజాగా నేడు ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్ ఆసక్తికర కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే తన దర్శకత్వ శైలితో ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించారు. గ్యానీ సంగీతం సమకూర్చారు. కథ- సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు. శత్రు, బ్రహ్మాజీ, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించగా…పృథ్వీ, శివాజీరాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు…
చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు “ఆపరేషన్ సిందూర్” కొనసాగాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రక్షణ బలగాల వెనుక 140 కోట్ల భారతీయులు ఉన్నారని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయాలకు యావత్ జాతి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు. భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
