Author: admin

భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ అయిన క్రియేటర్‌ల్యాండ్‌ను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేటివ్‌ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 25వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఎఫ్‌డీఐని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ & క్రియేట్ ఫర్ ది వరల్డ్‌ కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్‌షిప్ చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథలు మరియు AI-డ్రైవెన్ కంటెంట్‌కు కేంద్రంగా ఉంటుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, గ్లోబల్ పార్టనర్‌షిప్‌లు మరియు మన యువత నైపుణ్యం కోసం క్రియేటర్‌ల్యాండ్ అకాడమీతో, ఏపీ సృజనాత్మక మరియు డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా మారనుందని వివరించారు.

Read More

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లతో కూడిన భారత బృందం భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరానికి తీసుకువెళ్లారు. ఒక చారిత్రక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరానికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో తనను భాగస్వామిగా అవకాశం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకూ వియత్నాంలో జరగబోయే బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శనలో భాగంగా న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఏపీ మంత్రి దుర్గేష్ లు కలిసి పవిత్ర అవశేషాలను పేటికలో భద్రపరిచి ప్రత్యేక హెర్క్యులస్…

Read More

డైమండ్ లీగ్ మీట్ లో భారత్ టాప్ రేంజ్ 3000మీ స్టీపుల్ ఛేజర్ అవినాష్ సాబ్లే 8వ స్థానంలో నిలిచాడు. తాజాగా అతను 8 నిమిషాల 23.85 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. ఇందులో ఇథియోపియా కు చెందిన అబ్రహం సైమ్ (8నిమిషాల 7.82 సెకన్లు) విజేతగా నిలిచాడు. కెన్యాకు చెందిన ఎడ్మండ్ సెరెమ్ (8 నిమిషాల.08.68 సెకన్లు) రెండో స్థానంలో, సిమోన్ కిప్రాప్ కోయెచ్ (8 నిమిషాల.9.05 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. 2024 ఒలింపిక్స్ లో సాబ్లే (8 నిమిషాల.14.18 సెకన్లు) తో 11వ స్థానంలో నిలిచాడు. దీంతో సెప్టెంబర్ లో టోక్యో లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యాడు.

Read More

ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని చవిచూసింది. తాజాగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో పోరాడి ఓడింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 62 (33; 5×4, 5×6), జాకబ్ బెతెల్ 55 (33; 8×4, 2×6) రాణించారు. ఆఖర్లో రొమారియా షెపర్డ్ 53 (14; 4×4, 6×6) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. దీంతో భారీ టార్గెట్ ను చెన్నై ముందుంచింది. చెన్నై బౌలర్లలో పతిరన 3 వికెట్లు, సామ్ కరన్ 1 వికెట్, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై…

Read More

భారత నేవీ త్రిశూల శక్తిని నిర్వచించే విధంగా ఆసక్తికర ఫోటోను ఇండియన్ నేవీ సోషల్ మీడియా లో పంచుకుంది. The trident of Naval Power – Above, below and across the waves అనే క్యాప్షన్ ను ఆ పోస్ట్ కు పెట్టింది. భారత నేవీ త్రిశూల శక్తి సముద్రం పైన…కింద…అలలపైన అని అర్థం. సబ్ మెరైన్, నేవీ హెలికాప్టర్, వార్ షిప్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పహాల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలు చాటే వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సంగతి తెలిసిందే. మరో పక్క వివిధ చర్యలతో భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దు, అంతర్జాతీయ వేదికపై పాక్ దుశ్చర్యలను ఎండగడుతూ దౌత్య పరమైన నైపుణ్యం కనబరుస్తోంది.

Read More

ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుండి వచ్చే అన్ని పార్శిల్స్, మెయిల్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల పార్శిల్ ఎక్సేంజ్ లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చే అన్ని డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించింది. పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలను కూడా భారత్ మూసివేసింది. ఆకాశ మార్గాన్ని కూడా ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, ఎఫ్.ఏ.టీ.ఎఫ్ గ్రే లిస్టులోకి పాక్ ను తీసుకొచ్చేలా ప్రయత్నాలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలతో శత్రు దేశం పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాలని భావిస్తోంది.

Read More

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి…. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ…ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Read More

దాదాపు రెండు దశాబ్దాలుకు పైగా వీడియో కాలింగ్ సేవలతో యూజర్లకు సేవలందించిన ‘స్కైప్’ ఇక చరిత్రలోకి వెళ్లిపోతోంది. కోవిడ్ సమయంలో ఈ సాంకేతికత సర్వీస్ బాగా ఆదరణ పొందింది. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్కైప్ సేవలను బాగా వినియోగించారు. అయితే, ప్రస్తుతం యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్‌లో మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం తదితర కారణాలతో స్కైప్ మే 5 నుండి కనుమరుగు కానుంది. స్కైప్ సేవలను నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించింది. స్కైప్ యూజర్లను మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.

Read More

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు. చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా నిన్న ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణతో కేదార్‌ నాథుని ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. నిన్న‌ సాయంత్రం 7 గంటల వరకు అధికారిక గణాంకాల ప్రకారం 30 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్న‌ సందర్భంగా భారత సైన్యం యొక్క గర్హ్వాల్ రైఫిల్స్ బృందం భక్తి గీతాలను వాయించింది. ఇక ధామ్ పోర్టల్ ప్రారంభోత్సవానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా వచ్చారు. కేదార్‌నాథ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్య సేవక్ భండారాలో భక్తులకు ఆయన ప్రసాదం పంపిణీ చేశారు. మే 4న బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయని ఈ సంద‌ర్భంగా సీఎం తెలిపారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులను స్వాగతించడానికి రాష్ట్ర ప్రభుత్వం…

Read More

అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవం నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ గారు మనకు ఇస్తున్నది ఏమిటి ? ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి…

Read More