నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘హిట్-3’. మే1న విడుదలైన ఈ చిత్రం పేరుకు తగ్గట్టే భారీ హిట్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా మరో రికార్డు సాధించింది. రూ.100 కోట్ల మార్కును దాటింది. కేవలం 4 రోజుల్లోనే రూ.101 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయం తెలుపుతూ మూవీ టీమ్ ‘సర్కార్ సెంచరీ ‘ అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. విజయవంతమైన ‘హిట్’ ఫ్రాంచైజీ నుండి వచ్చి ప్రేక్షకుల అంచనాలను అందుకొని విజయవంతంగా దూసుకుపోతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్స్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందింది. తిపిరినేని ప్రశాంతి నిర్మించారు. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలరించారు. నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించారు.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
Author: admin
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసి 85 సంవత్సరాలైన సందర్భంగా ఈ వేడుకలు జరుపుతున్నారు. రెండున్నర కిలోల బంగారంతో తయారు చేసిన వాసవీ మాత విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలకృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు.
ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఐదు వేర్వేరు సంఘటనలలో తమిళనాడుకు చెందిన 24 మంది భారతీయ జాలర్లు ఎదురుకున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశం మరియు శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక మరియు నిరంతర సంభాషణలో పాల్గొనడం అత్యవసరమని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖకు తన పోస్ట్ ట్యాగ్ చేశారు. నాగపట్నం జిల్లాకు చెందిన ఈ జాలర్లు సముద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గాయపడ్డారని తెలుసుకోవడం బాధాకరం, ఇది వారి జీవనోపాధిని కూడా ప్రభావితం చేసిందని తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం మరియు శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా, పునరావృతమయ్యే ఈ సంఘటనలను గమనించి, ఈ పరిస్థితులను స్నేహపూర్వకంగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.
పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ పై పలు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుండి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో పాక్ అడ్డ దారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంకల మీదుగా వాటిని భారత్ కు పంపించాలనే వంకర బుద్ధిని చూపుతోంది. దీంతో కస్టమ్స్ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు పలు ఇంగ్లీష్ మీడియా కథనాలు వెలువడ్డాయని తెలుస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు పాకిస్థాన్ నుండి వచ్చే ఏ వస్తువైనా ఏ మార్గం నుంచైనా భారత్ లోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి అధికారిక మార్గాల్లో పాక్ నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తువుల విలువ చాలా తక్కువే. అయితే, మూడో దేశం మీదుగా పాక్ నుంచి అనేక ఉత్పత్తులు భారత్ కు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.…
ప్రపంచం లోనే అత్యంత విలువైన వజ్రమైన కోహినూర్ తిరిగి తన స్వదేశమైన భారత్ కు చేరుకునే అవకాశం ఉందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది సాధ్యపడవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటన్ మహారాణి కిరీటంలో పొదిగి ఉన్న ఆ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేస్తారా? అనే ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా నాండీ తాజాగా స్పందించారు. భారత్-బ్రిటన్ ల మధ్య సాంస్కృతిక కళాకండాల మార్పిడి కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చనే ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ అంశంపై భారత సాంస్కృతిక శాఖతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె అధికారిక పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీలో మాట్లాడారు.
‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈనెల లోనే ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కడపలో ఈ నెల 27,28,29 మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘మహానాడు’ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18 నాటికి రాష్ట్రస్థాయి కమిటీలు మినహా మిగితా కమిటీలు వేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వచ్చే నెల 12 నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక ఇటీవల అమరావతి పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రపంచం దృష్టి రాజధానిపై పడిందని పేర్కొన్నారు. ఇక మరో కీలక ప్రజా సంక్షేమ కార్యక్రమం ‘తల్లికి వందనం’ ను స్కూల్స్ ప్రారంభానికి ముందే రూ. 15వేల చొప్పున అందించనున్నట్లు…
ఉమెన్స్ ట్రై యాంగిల్ వన్డే సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన భారత జట్టు తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. రిచా ఘోష్ 58 (48; 5×4, 3×6) టాప్ స్కోరర్. జెమీమా రోడ్రిగ్స్ (37), ప్రతీక రావెల్ (35), హార్మన్ ప్రీత్ కౌర్ (30) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో సుగంధిక 3 వికెట్లు, చమరి ఆటపట్టు 3 వికెట్లు తీశారు. ఇక లక్ష్యాన్ని శ్రీలంక నీలాక్షిక సిల్వా 56 (33; 5×4, 3×6), హార్షిత సమరవిక్రమ 53 (61; 5×4) హాఫ్ సెంచరీలతో రాణించారు. కలిసి (35), విష్మీ (33), అనుష్క (23 నాటౌట్ ) కీలక ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నారు. దీంతో శ్రీలంక 49.1 ఓవర్లలో 7 వికెట్లు…
ఐపీఎల్ సీజన్-18లో భాగంగా పంజాబ్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. అన్ని విభాగాల్లో రాణించిన ఆ జట్టు మరోసారి సమిష్టి ఆటతీరుతో ఆకట్టుకుని ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ 91 (48; 6×4, 7×6) కీలక ఇన్నింగ్స్ తో మంచి ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 45 (25; 4×4, 2×6), జాస్ ఇంగ్లిస్ 30 (14; 1×4, 4×6) శశాంక్ సింగ్ 33 (15; 4×4, 1×6) పరుగులు చేయడంతో భారీ స్కోర్ సాధించింది. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్ 2 వికెట్లు, దిగ్వేష్ రాఠీ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 1 వికెట్…
కోల్ కతా నైట్ రైడర్స్: 206-4 (20). రాజస్థాన్ రాయల్స్: 205-8 (20). ఉత్కంఠ భరిత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం ఒక పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది. ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.ఆండ్రీ రస్సెల్ 57 (25; 4×4, 6×6) మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. రఘువన్షీ 44 (31; 5×4), గుర్బాజ్ 35 (25; 4×4, 1×6), అజింక్య రహానే 30 (24; 1×4, 2×6) పరుగులు చేయడంతో భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. రాజస్థాన్…
ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ను భారత్ అన్ని వైపుల నుండి కట్టడి చేసి పలు నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని పాక్ కు భయం పట్టుకుంది. ఇటీవలే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ఈ భేటీలో కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.
