ఏపీ మెగా డీఎస్సీ 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం డీఎస్సీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో apdsc.apcfss.in ఉంచింది. అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకుని, ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయవచ్చని ఆయన సూచించారు.
Author: admin
నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం…ఓ స్ఫూర్తి అని కొనియాడారు.జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువారు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. మోడీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉందని అన్నారు. భారత్ ది డెడ్ ఎకానమీ కాదు…గుడ్ ఎకానమీ అని కొనియాడారు.మోడీ నాయకత్వంలో త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. సినీ రంగ సమస్యలు మరియు సినీ కార్మికుల ఆందోళనలపై నిర్మాతల నుండి వినతిపత్రం మంత్రికి అందించారు. ఇరుపక్షాల అభిప్రాయాలను శ్రద్ధగా విని, ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు నివేదించి చర్చిస్తానని మంత్రి దుర్గేష్ వారికి తెలిపారు. అలాగే ప్రభుత్వ జోక్యం అవసరమైతే, రాష్ట్ర స్థాయిలో తగిన నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్టూడియోలు, రీ-రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. రియాల్టీ, ఆటో స్టాక్స్ రాణించాయి. దీంతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 80,636 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 221 పాయింట్లు లాభపడి 24,585 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.66గా ఉంది. సెన్సెక్స్ లో ఎటర్నల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానం దేశ రాజధాని ఢిల్లీలో నేషనల్ కేపిటల్ రీజియన్ లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో కుక్కల వలన కుక్క కాటు, రేబిస్ వంటి వాటి వలన మరణాలు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ ఆదేశాలు జారీచేసింది. 8 వారాల లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఈ చర్యలను అడ్డుకునేందుకు ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వీధి కుక్కల వలన ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేపట్టింది. ఇక దీనిపై కేంద్రం వాదనలు మాత్రమే వింటామని తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్ లు విచారించబోమని సుప్రీంకోర్టు…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా విడుదల చేసిన వీడియో మన దేశ భద్రతా దళాల సామర్థ్యానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాంలో టూరిస్ట్ లపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే నెలలో పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడి సత్తా చాటింది. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఏం చేయగలదో చాటి చెప్పింది. ఐఏఎఫ్ విడుదల చేసిన 5 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో ఈ ఆపరేషన్ వివరాలు ఉన్నాయి. ఈ వీడియోలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఫైటర్ జెట్లు జరిపిన వైమానిక దాడుల దృశ్యాలు, ధ్వంసమైన శిబిరాల చిత్రాలు ఉన్నాయి. ఇక తాజాగా బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ వివరాలను ధ్రువీకరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఐదు పాకిస్థానీ యుద్ధ…
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘స్త్రీ శక్తి’ పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు. తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్…
కృష్ణా నది పరివాహక ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు పెరుగుతోంది. శ్రీశైలం ఇన్ ఫ్లో 1,99,714 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,00,800 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885…ప్రస్తుతం 881.20 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 194.30 టీఎంసీల నీరు ఉంది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. శ్రీశైలం నుంచి సాగర్ కు వరద ప్రభావం పెరిగింది. దీంతో 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ కు 65,800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 1,10,483 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి, ప్రస్తుత నీటి మట్టాలు 590 అడుగులుగా ఉన్నాయి.…
1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ చెర నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్న వారియర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ (రిటైర్డ్) కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న తన నివాసంలో ఈనెల 10న ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీకే పారుల్కర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పారుల్కర్ మృతి పట్ల భారత వాయుసేన సంతాపం వ్యక్తం చేసింది. 1971 వార్ హీరో, పాకిస్థాన్ చెర నుంచి సాహసోపేతంగా తప్పించుకుని అసామాన్య ధైర్యసాహసాలు, చాకచక్యం చూపిన గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ అమరులయ్యారు. వాయు యోధులందరి తరఫున ఆయనకు హృదయపూర్వక నివాళులని ఐఏఎఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.
మహేంద్ర సింగ్ ధోనీ భారత మాజీ కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులను కనువిందు చేస్తున్న ధోనీ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న ఐపీఎల్ లో ఆడతాడో లేదో అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.కాగా తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేను ఆడతానో లేదో తెలియదు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ వరకు వేచి చూస్తా. కాబట్టి ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించాడు. అయితే ఆయనకు ఫ్యాన్స్ నుండి మళ్లీ ఆడాలని విజ్ఞప్తి వచ్చింది. ఒక అభిమాని ‘మీరు తప్పకుండా ఆడాలి సర్’ అని కోరారు. ధోనీ దానికి స్పందిస్తూ “నా మోకాలు నొప్పిగా ఉంది. మరి దానిని ఎవరు భరిస్తారు?” అని సరదాగా సమాధానం ఇచ్చాడు.…