Author: admin

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. దీనికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ(ZPTC) స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలని ఆక్షేపించారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుగారు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను…

Read More

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎలక్షన్ కమీషన్ పై తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. డిజిటల్ ఓటర్ల లిస్ట్ ను విడుదల చేయాలన్న తన డిమాండ్‌కు ప్రజల నుంచి కూడా మరింత మద్దతు కోసం ‘ఓట్ చోరీ’ పేరుతో నేడు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, దానిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ మద్దతు అందించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇక ఈ ప్రచారానికి సంబంధించి రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. “ఓట్ చోరీని బయటపెట్టడం చాలా కీలకమని అన్నారు. ఈ ప్రచారానికి మద్దతివ్వాలని కోరారు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు స్వచ్ఛమైన లిస్ట్ అత్యంత ఆవశ్యకమని ప్రజలు, పార్టీలు ఓటర్ల లిస్ట్ ను తనిఖీ చేసేందుకు వీలుగా ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించి డిజిటల్ ఓటర్ల…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణానికి అద్దం పట్టే ఆసక్తికర పరిణామం ఈరోజు మంగళగిరిలో చోటుచేసుకుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నేరుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయింది. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారంతా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వారితో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ…

Read More

రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి మనసు పులకరిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ప్రాజెక్టు నిండేలా.. ప్రతి చెరువుకు నీరందేలా… చివరి భూములను సైతం తడిపేలా.. అత్యధిక సామర్థ్యంతో హంద్రీ-నీవా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తున్నాయని పేర్కొన్నారు. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మా కల సాకారమవుతోంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తోందని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Read More

పాడేరు మండలం వంజంగిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు మంత్రి సంధ్యా రాణి గారు, స్థానిక గిరిజన మహిళలు రాఖీ కట్టారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేను మీ మనిషిని.. గిరిజనులకు న్యాయం చేసే బాధ్యత నాది.. ఆ బాధ్యత తీసుకుంటున్నా మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తా, గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన బిడ్డలకే, టీచర్ ఉద్యోగాలు వచ్చేలా పోరాడతానని చంద్రబాబు అన్నారు. మొట్టమొదటి సారిగా గిరిజన ప్రాంతాల్లో, గిరిజనులకు మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా జీవో ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన వాదనలు వినిపించక కోర్టులో జీవో కొట్టేసారని అన్నారు. మళ్ళీ తాను 2000వ సంవత్సరంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వటమే కాక, అందులో కూడా 33% ఆడబిడ్డలకు ఇస్తూ జీవో 3 ఇచ్చాన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.…

Read More

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. వాటితో పాటు ఓ భారీ ‘ఎయిర్‌ బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్‌’ను కూడా కూల్చేశామన్నారు. ‘S 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో 5 పాకిస్తాన్ జెట్లను పేల్చేశాం. రెండు ఎయిర్ బేస్ లు ధ్వంసం చేశాం. మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. మే 9వ తేదీ రాత్రి ఎక్కువగా పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. డ్రోన్, ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాగా పనిచేసింది. వారి యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాం. వాటిని ఎంతో సమర్థవంతంగా కూల్చిపడేశాం. ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌కు స్పష్టమైన…

Read More

అగ్ర కధానాయకుడు మహేష్ బాబు హీరోగా గ్రాండీయర్ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా నుంచి మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నేడు అప్డేట్ ను అందించారు. మహేశ్ ప్రీలుక్ ఫొటోను రాజమౌళి పంచుకున్నారు. దీని పూర్తి లుక్ ను నవంబర్ లో రివీల్ చేస్తామని చెప్పారు. “మేం ఈ సినిమా నేడు ఈ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ పంచుకుంటారని ఫ్యాన్స్ భావించారు. వారిని ఉద్దేశిస్తూ రాజమౌళి ఇటీవలే ఈసినిమా ప్రారంభించాం. దీనిపై మీ అందరి ఆసక్తి చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఈసినిమా చాలా భారీస్థాయిలో రానుంది. కేవలం ప్రెస్మీట్ పెట్టి లేదా కొన్ని ఇమేజ్ లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేము. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం. ఈ ఏడాది నవంబర్ మహేశ్ లుక్ ను విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా దీన్ని రూపొందిస్తున్నాం.…

Read More

దేశవ్యాప్తంగా ప్రజలు ఈరోజు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, సోదర సోదరీమణుల మధ్య ఉండే విడదీయరాని ప్రేమ, విశ్వాసం, రక్షణ అనే బంధానికి అంకితమైన పవిత్రమైన పండుగ ‘రక్షాబంధన్’ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ తదితరులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Read More

ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసి… ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది కాలంలో ఏజెన్సీ  ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వివరించి…. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై వారితో చర్చించి నేడు నిర్ణయాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసుల సొంతం. కూటమి ప్రభుత్వంలో ఆదివాసీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిత్యం కృషిచేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,557 కోట్ల నిధులను వారి సంక్షేమం కోసం…

Read More

నేడు రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. నా తెలుగింటి ఆడపడుచులకు, నా ప్రియమైన అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ల అనుబంధం వ్యక్తం చేస్తూ ‘నీ కోసం నేనున్నాను’ అనే భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అని రాఖీ పండుగ సందర్భంగా మరో సారి ప్రకటిస్తున్నాను. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తానని హామీ ఇస్తూ అందరికి మరొక్కమారు రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు.

Read More