దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో సూచీలు నేల చూపులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ లో నమోదిత కంపెనీల విలువ రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.440 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 24 వేల మార్కు దిగువకు చేరింది. సెన్సెక్స్ 765 పాయింట్లు నష్టపోయి 79,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్ల నష్టంతో 24,363 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.71గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, ట్రెంట్, ఐటీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
Author: admin
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల పెంపుతో మిగిలిన అతిపెద్ద ఎకానమీస్ చేతులు కలిపే దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు అతిపెద్ద ఎకానమీలైన భారత్, చైనా మధ్య సంబంధాల విషయంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నట్లు చైనా నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని మోడీ వస్తున్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ధృవీకరించారు.
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పారిశ్రామిక వేత్తలతో పీ-4 సమావేశంలో మాట్లాడుతూ నాడు పెట్టుబడులు అడిగాను… నేడు పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను.నాటి జన్మభూమి సమాజం కోసం… నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా మారి పేద కుటుంబాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు పిలుపునకు సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, ఎన్నారైల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి ఒకేసారి 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇంకా పలువురు ఎన్నారైలు, స్థానిక వ్యాపారవేత్తలు వందలాది కుటుంబాలను, పాఠశాలలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఆర్థికంగా సాయం చేయలేని…
రాష్ట్రంలో వేసవి కాలంలో ఉన్నట్లు పలు ప్రాంతాల్లో ఎండలు అదరగొడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడి పోతున్నారు. అయితే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురిసేందుకు అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో, తర్వాత మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ వంటి చిత్రం వచ్చి ఘనవిజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి కాంబో లో వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఈ రోజు నాని ఫస్ట్ లుక్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, ఆయన లుక్ ఇంతకు ముందు పాత్రల కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో పోస్టర్ ను షేర్ చేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మీ అందరి ముందుకి ‘జడల్’ను తీసుకొస్తున్నా. ఈసారి మా హీరో నాని అన్న నరకంలోకి నడిచివెళ్లి దాన్ని ‘ది ప్యారడైజ్’గా మార్చేస్తాడు” అని పేర్కొన్నారు. నాని కూడా తన లుక్‌ను షేర్ చేస్తూ, “వాడి పేరు ‘జడల్’. ఉన్నది ఉన్నట్లు…
భారత కెప్టెన్ శుభ్ మాన్ గిల్ దేశవాళీ క్రికెట్లో ఆడనున్నాడు. ఈనెల 28న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో పాల్గొనే నార్త్ జోన్ జట్టుకు గిల్ నాయకత్వం వహించనున్నాడు. పేసర్లు అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ లతో కూడిన 15 మంది టీమ్ ను సెలెక్టర్లు ప్రకటించారు. ఇక యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ సెప్టెంబరు 10న ప్రారంభంకానుంది. దీంతో దులీప్ ట్రోఫీ మొత్తానికి గిల్ అందుబాటులో ఉండకపోచ్చు. సెప్టెంబరు 10న యూఏఈ, 14న పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. ఎంపిక చేసిన టీమ్: శుభ్ మన్ గిల్ (కెప్టెన్), అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), శుభం కజూరియా, ఆయుష్ బదోని, యశ్ ధూల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధూ, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్ వీర్ సింగ్ చరక్, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబి, కన్హయ్య (వికెట్…
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి పెంచిన టారిఫ్ ల ప్రభావం భారత్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. నేటి ట్రేడింగ్ లో ప్రారంభంలో నష్టాల్లో కదలాడినా ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ కు కలిసొచ్చాయి. ట్రంప్ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. మన ఎకానమీ పై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 80,623 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 22 పాయింట్ల లాభపడి 24,596 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.69గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్, ఎటర్నల్ ,యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి షేర్లు లాభాలతో ముగిశాయి.
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఈసీ (ఎలక్షన్ కమీషన్)అక్రమాలకు పాల్పడిందిని ఆరోపించారు. ఈసీకి వ్యతిరేకంగా తమ దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయని అన్నారు. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మారుతున్నాయని ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది.. ఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఇక ఆయన వ్యాఖ్యలకు ఈసీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. అక్రమాలు జరిగాయని భావించినా అనుమానాలు ఉన్నా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చని పేర్కొంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలు చూపించాలని ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండని ఎన్నికల కమిషన్ కౌంటర్ ఇచ్చింది.
ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వార్ 2’ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు మరింత పెంచేస్తూ, చిత్రబృందం తాజాగా ఓ అదిరిపోయే పాట ప్రోమోను విడుదల చేసింది. ‘సలామ్ అనాలి’ పాట ప్రోమోలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి తమ డ్యాన్స్ తో అలరించారు. ఈ పాట పూర్తి వీడియోను థియేటర్లలోనే చూడాలంటూ చిత్ర బృందం ప్రకటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease… #SalamAnali full song in theatres only! pic.twitter.com/ArvExjqhkI#War2 releasing in Hindi, Telugu and…
మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. రాష్ట్రంలో వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను సీఎం పరిశీలించారు. క్లస్టర్లలో ఎంతమంది డిజైనర్లను నియమించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఉత్పత్తులకు ఏ మేర డిమాండ్ ఉందని అడిగారు. చేనేత ఉత్పత్తులపై సెలబ్రిటీలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారని డిజైనర్లు తెలిపారు. ఒక్క సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా చేనేత ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. చేనేత ఉత్పత్తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి తనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా పథకాన్ని ప్రకటించారు. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటన చేశారు.చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్…