Author: admin

తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ లపై టారిఫ్ ల వార్ కు తెరలేపిన సంగతి తెలిసిందే. ట్రంప్ టారిఫ్ వార్ పై భారత ప్రధాని మోడీ స్పందించారు. రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని తనకు తెలుసని అయితే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దేశంలోని రైతులు, మత్స్యకారుల కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని ప్రధాని మోడీ అన్నారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్ల గురించి ప్రస్తావించారు. రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోమని స్పష్టం చేశారు.

Read More

చేనేత కళాకారులందరికీ మంత్రి నారా లోకేష్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందని లోకేష్ తెలిపారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని పేర్కొన్నారు. మన నేత సోదరులు నేసిన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుగడించాయి. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని భరించనుంది. దీంతో పాటు త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేయనుంది. నేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి నిలుస్తోందని అన్నారు.

Read More

అగ్రనటి అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత నటిస్తోన్న చిత్రం ‘ఘాటి’.ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇంతకుముందు వీరిద్దరి కలయికలో “వేదం” తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఇక ఇప్పుడు ‘ఘాటి’ కోసం మరోసారి అనుష్క – క్రిష్ కలసి పనిచేస్తున్నారు.యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నాగవెల్లి విద్య సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అనుష్క నటన, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విక్రమ్ ప్రభు,జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. https://youtu.be/cHd-vTYZ87A?si=lEpVztR2tWajmJQ3

Read More

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ మన క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు. మన దేశంలో చాలా టాలెంట్ ఉందన్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు టెస్టులకు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అందరూ అనుకున్నారు. అయితే అంచనాలకు మించి అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి సిరీస్ ను డ్రా చేసుకుని మన యువ క్రికెటర్లు ఇంగ్లాండ్‌ లో తమ సత్తా చాటారు. దీంతో భారత జట్టు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో గంగూలీ స్పందిస్తూ మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని అన్నారు.ఇంగ్లాండ్ టూర్‌లో మన ఆటగాళ్లు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని ప్రశంసిస్తూ భారత క్రికెట్ అలాగే ఉందన్నారు. భారత క్రికెట్ ఎదుగుదల క్రమాన్ని గుర్తు…

Read More

భారత్ పై మరోసారి టారిఫ్ లను పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్ పై మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే భారత్ పై 25 శాతం ప్రతీకార సుంకం విధించారు. దీంతో భారత్ నుండి దిగుమతయ్యే ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ వర్తించనుంది. ఈ మేరకు ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అక్కసు వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. 24 గంటల్లో భారత్ పై భారీ టారిఫ్ వేస్తానని నిన్న ప్రకటించి నేడు ప్రకటించారు.

Read More

నూతన బార్‌ పాలసీ సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నూతన బార్‌ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఏపీ సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి క్యాబినెట్‌ పచ్చజెండా ఊపిందన్నారు. సమావేశంలో నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని.. అరకు, భవానీ ఐలాండ్స్ ని అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.రూ.900 కోట్ల ఏపీ బీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వైష్ణవి ఇన్ఫ్రా కంపెనీకి 25 ఎకరాల టీటీడీ భూమిని ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచామన్నారు. 40వేల హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇక ఇటీవల తన సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఆగస్ట్ 15వ తేదీ.. స్వాతంత్ర దినోత్సవమని.. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. కానీ సమయాన్ని సర్దుబాటు చేసుకుని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని వారికి సీఎం సూచించారు. సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు.

Read More

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జన్ ధన్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 నాటికి తమ రీ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించింది. జూలై 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేడు తెలిపారు. రూల్స్ ప్రకారం, యాంటీ-మనీ లాండరింగ్ ప్రోటోకాల్స్‌లో భాగంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కస్టమర్ వివరాలను ధృవీకరించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో జన్ ధన్ ఖాతాలకు కేవైసీ అప్‌డేషన్ గడువు ముగియనుందని, గడువులోగా రీ-కేవైసీ…

Read More

డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే విలక్షణ నటుడు మంచు మనోజ్ ఒక భారీ చారిత్రక యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన 21వ సినిమాగా రానున్న దీనికి ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్‌ ను ప్రకటించారు. ఇందులో మనోజ్ ఇదివరకుచూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 21 ఏళ్లు పూర్తయిన ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా 1897 నుంచి 1922 మధ్య కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నేపథ్యంలో సాగుతుందని చిత్రబృందం తెలిపింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన ఒక సామాన్య యోధుడి సాహసగాథగా ‘డేవిడ్ రెడ్డి’ని తెరకెక్కించనున్నారు. “మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలిస్తున్నాడు” అనే ట్యాగ్‌లైన్ సినిమా కథాంశంపై మరింత ఆసక్తిని…

Read More

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే అంశంపై భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల హెచ్చరికలను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన ముందుగానే ఖరారైందని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, భారత్- రష్యా సంబంధాలపై ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మాస్కోతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యంగా తెలిపాయి. రష్యా చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారం వంటి వాటితో పాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, రష్యాకు చెందిన ఎస్యూ-57 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలపై మాస్కో అధికారుల అజిత్ దోవల్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More