ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఒక చర్యపై భారత అభిమానులు మండిపడ్డ సంగతి తెలిసిందే. కరాచీలోని నేషనల్ స్టేడియంపై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ ఆడుతున్న ఎనిమిది దేశాలలో ఏడు దేశాల జెండాలను ఉంచిన పీసీబీ… భారత జాతీయ పతాకాన్ని మాత్రం ప్రదర్శించకపోవడం పట్ల భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆ స్టేడియం పై భారత పతాకాన్ని ఉంచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కరాచీ స్టేడియం తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. దాంతో నెటిజన్లు ఇది పాక్ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భద్రత సంబంధమైన కారణాలతో తమ జట్టును పాక్ కు పంపించమని బీసీసీఐ తేల్చిచెప్పడంతో ఐసీసీ ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్…
Author: admin
వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 15వ స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ లో ఆమె రెండు స్థానాలు కోల్పోయింది. గాయంతో ఇటీవల జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్ లో ఆమె పాల్గొనలేదు. ఈ ప్రభావం ర్యాంకింగ్స్ పై పడింది. మరో షట్లర్ మాళవిక బాన్సోద్ మూడు స్థానాలు మెరుగై 28వ స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో లక్ష్యసేన్ 10వ స్థానంలో నిలిచాడు. ప్రణయ్ 31వ ర్యాంక్ పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ 7వ ర్యాంకు, మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం 9వ ర్యాంకు మిక్స్డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీష్ క్యాస్ట్రో జోడీ 30వ ర్యాంకులో నిలిచారు.
భారత జావెలిన్ త్రో స్టార్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా త్వరలోనే 90 మీటర్ల త్రో సాకారమవుతుందని పేర్కొన్నాడు. తన కోచ్ జెలజ్నీ తన ఆటలో కొన్ని టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ చేసినట్లు తెలిపాడు. అతని మార్పులు తనకు ఉపయోగపడతాయని అన్నాడు. తన కోచ్ తన నుండి ఆశిస్తున్నది తాను అర్థం చేసుకోగలిగిన టాగ్లు వివరించాడు. పారిస్ లో చాలా తక్కువ ఎత్తులో త్రో విసిరానని చెప్పాడు. కొన్ని మార్పులు చేసుకుంటే మెరుగవుతానని తెలిపాడు. నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 89.94మీటర్లు. 2022లో అతను ఈ ఫీట్ సాధించాడు.
ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ లో ఈరోజు సాయంత్రం నాటికి 55 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న ఈ మహాత్తర కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని యూపీ ప్రభుత్వం తెలిపింది. దేశ విదేశాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దేశంలోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర గంగానదిలో స్నానమాచరించారని తెలిపింది. ఎంతో విశిష్టత కలిగిన జనవరి 29న మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ కు వచ్చారు.
ఇటీవల ఒక కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలులో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు…
రన్ వే లతో పనిలేకుండా తక్కువ ప్రదేశంలోనే టేకాఫ్ ల్యాండింగ్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) అయ్యే విధంగా ఉండే ఎయిర్ అంబులెన్స్ లు మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ స్టార్టప్ ‘ఈప్లేన్’ వీటిని అభివృద్ధి చేయనుంది. వీటి కొరకు ఈప్లేన్ మరియు ప్రముఖ అంబులెన్స్ సంస్థ ఐసీఏటీటీ మధ్య రూ.8,648 కోట్లు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద 788 ఎయిర్ అంబులెన్స్ లు సరఫరా కానున్నాయి. దేశంలోని ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచాలని కంపెనీ భావిస్తోంది. వివిధ ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మూడు రకాల ప్రోటోటైప్లను ఈప్లేన్ రూపొందిస్తోంది. వీటి రాకతో ఎమర్జెన్సీ వైద్య రవాణాలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఆద్యంతం మందకొడిగా కదలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 29పాయింట్లు నష్టపోయి 75,967గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 22,945 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.95గా కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జొమాటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్ లోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీరంతా ఆయా యూనివర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు. యూనివర్సిటీ వీసీల వివరాలు: అనంతపురం జేఎన్టీయూ – హెచ్. సుదర్శన రావు కాకినాడ జేఎన్టీయూ – సి.ఎస్.ఆర్.కె ప్రసాద్ రాయలసీమ యూనివర్సిటీ – వెంకట బసవరావు తిరుమల పద్మావతి మహిళా యూనివర్సిటీ – ఉమ యోగి వేమన యూనివర్సిటీ – పి.ప్రకాష్ బాబు మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ – కె. రాంజీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ – ప్రసన్న శ్రీ విక్రమ సింహపురి యూనివర్సిటీ – అల్లం శ్రీనివాస రావు ఆంధ్రా యూనివర్సిటీ – జి.పి.రాజశేఖర్.
భారత ఎన్నికల సంఘం నూతన కమీషనర్ గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎంపికపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తదుపరి ఎన్నికల కమీషనర్‌ని ఎంపిక చేయడానికి కమిటీ సమావేశం సందర్భంగా, ప్రధాని మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కి ఒక నివేదిక అందించినట్లు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మన జాతి వ్యవస్థాపక నాయకుల ఆదర్శాలను నిలబెట్టడం మరియు ప్రభుత్వానికి బాధ్యత వహించడం తన కర్తవ్యమని రాహుల్ గాంధీ స్పష్టం…
ఇటీవల ఒక కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ లోని సబ్ జైలులో ములాఖాత్ అయ్యారు. కాగా , వంశీతో ములాఖత్ పై జగన్ జవాబివ్వాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో 10 పాయింట్లను ప్రస్తావించారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినందుకు మద్దతు ఇస్తున్నారా అని జగన్ ను ప్రశ్నించారు.
