Author: admin

ఏపీ సీఎం చంద్రబాబు కృషి వల్లనే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడు నెలలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాకారం అందించిందని పేర్కొన్నారు. నేడు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా జల్ జీవన్ మిషన్ లో రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని మరో సంవత్సరం పొడిగించిందని తెలిపారు. ప్రస్తుతం నిధుల సమీకరణకు గత ప్రభుత్వం చేసిన తప్పులు అడ్డంకులు గా ఉన్నాయని పేర్కొన్నారు.

Read More

ఇటీవల ఒక కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయిన సంగతి తెలిసిందే. కాగా, నేడు వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. ఆయనను కలిసి పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు వల్లభనేని వంశీ అరెస్ట్ అద్దం పడుతోందని మండిపడ్డారు.వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే చెప్పారని వంశీపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు . పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పట్టాభిని సీఎం చంద్రబాబే పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని అన్యాయాలు చేసే వారిని బట్టలూడదీసి నిలబెడతానని జగన్ మండిపడ్డారు.

Read More

రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌, హను రాఘవపూడి కలయికలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘ఫౌజీ’.ప్ర‌స్తుతం ఈ చిత్రం శర వేగంగా చిత్రీకరణ జ‌రుపుకుంటుంది.పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు రుపొందిస్తున్నాడు.ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ న‌టిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తుంది.ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్న‌ట్లు తెలుస్తుంది.స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండ‌గా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్‌ కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతుంది.ఈ చిత్రంలో కీల‌క‌మైన బ్రిటిష్‌ యువ‌రాణి పాత్ర‌లో బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ నటించనున్నారని సమాచారం.యువ‌రాణి పాత్ర ఇందులో కీల‌కం కావ‌డంతో..ఈ పాత్ర కోసం ఆలియా భ‌ట్‌ని తీసుకోబోతున్న‌ట్లు చెబుతున్నారు.అయితే ఈ విషయంపై చిత్రిబృందం నుండి అధికారక ప్రకటన రావాల్సింది ఉంది.కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అనుపమ్ ఖేర్ న‌టిస్తున్నాడు.

Read More

సముద్రాలలో పరిశోధనల కోసం రూపొందించిన సబ్ మెరైన్ “మత్స్య -6000” ప్రయోగం విజయవంతమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) ఒక ప్రకటనలో తెలిపింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ఫోర్త్ జనరేషన్ సబ్ మెరైన్ అభివృద్ధి చేసే బాధ్యతను NIOTకి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అప్పగించగా…ఆ సంస్థ దీనిని రూపొందించింది. దీనిలోని సబ్ సిస్టమ్స్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు. ఈ సబ్ మెరైన్ ను జనవరి 27 నుండి ఫిబ్రవరి 12 వరకు చెన్నై సమీపంలోని కాట్టుపల్లి పోర్ట్ లో ఉన్న ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో 500 మీటర్ల లోతులో పరీక్షించి విజయవంతమైనట్లు ప్రకటించారు.

Read More

అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో తెరక్కుతున్న చిత్రం ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినీ అభిమాలను ఆకట్టుకుంది.ఇక ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు.ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 18న విడుదల చేయన్నునారని సమాచారం.దీంతో ఘాటీ రిలీజ్‌పై నెలకొన్న అనుమానాలకు చెక్ పడినట్లు అయ్యింది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Read More

నా దేశానికి తిరిగి వెళ్తాను…కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు.దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని అన్నారు.అయితే బంగ్లాదేశ్ ప్రజలను ప్రస్తుతం ఉగ్రవాద ప్రభుత్వం పాలిస్తోందని, మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో హసీనా జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ…తాను త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు.అయితే పార్టీ కార్యకర్తలు,నాయకులు అంతవరకూ ఓపిక పట్టాలని ఆమె కోరారు.ఈ మేరకు మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా…అల్లర్లు ఆగలేదన్నారు.దేశంలో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని,ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు.ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఆందోళనల్లో మరణించిన పలువురు పోలీసుల కుటుంబాలతో ఈ సందర్భంగా హసీనా మాట్లాడారు.

Read More

దేశంలోని 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ తొలి స్థానంలో నిలిచింది.గత ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85 శాతం పెరిగింది.దేశంలోని 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.5,820.91 కోట్ల విరాళాల్లో అందులో బీజేపీ వాటా 75 శాతం కావడం గమనార్హం.కాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ నిన్న తన నివేదికలో పేర్కొంది.అయితే రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ 2వ స్థానంలో నిలిచింది.కాంగ్రెస్ పార్టీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 170.82 శాతం పెరుగుదలతో 772.74 కోట్లు ఎక్కువ విరాళాలు పొందింది.కాగా ఆ తర్వాత రూ.167.63 కోట్లతో సీపీఐ(ఎం),రూ.64.77 కోట్లతో బీఎస్పీ,రూ.22.68 కోట్లతో ఆప్‌, రూ.22.44 లక్షలతో ఎన్సీపి వరుసగా నిలిచాయి. ఆప్‌, ఎన్పీపీ తమ ఆదాయానికి మించి ఖర్చులు బీజేపీ తన ఆదాయంలో రూ.2,211.69 కోట్లు (50.96 శాతం) వ్యయం చేయగా.. కాంగ్రెస్‌…

Read More

రెండు తెలుగు రాష్ట్రాలలో స్వల్పంగా ఉష్ణోగ్రతలలో పెరుగుదల కనిపిస్తోంది. ఇంకా మార్చి నెల కూడా రానేలేదు. అప్పుడే తెలంగాణ‌లో ఎండ‌లు మండిపోతున్నాయి. ఉద‌యం 11 గంట‌ల‌ నుండి ఎండ తీవ్రత కనిపిస్తుంది. ఇళ్ల‌లో క‌రెంటు పోతే ఉక్క‌బోత త‌ప్ప‌డం లేదు. ఎండపట్టున పనిచేసే వారికి ముఖ్యంగా వ్య‌వ‌సాయ ప‌నుల్లో వుండే రైతులపైనా ఈ ప్ర‌భావం ప‌డుతోంది. దీంతో ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో సాగు ప‌నులు చేసుకుంటున్నారు. ఇప్పుడే ఈవిధంగా ఎండ‌లు ఉంటే వేసవి సీజన్ మధ్యలో మార్చి-ఏప్రిల్ ఆపై మండు వేస‌వి అయిన మే నెల‌లో ఇంకేస్థాయిలో ఉంటాయో అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నిన్న తెలంగాణ‌లో 35.6 డిగ్రీల నుండి 37.7 డిగ్రీల దాకా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయని వార్తలు వచ్చాయి. వేసవి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఏసీ, కూలర్లు వంటి వాటి కొనుగోలుకు సమాయాత్తమవుతున్నారు.

Read More

వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. గతేడాది ఎదుర్కొన్న పరిస్థితి దృష్ట్యా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాగునీటి వృథాను అరికట్టేందుకు పటిష్టమైన విధానాలకు పూనుకుంది. తాగునీటిని వెహికల్స్ కడగడానికి, తోటలకు, నిర్మాణ పనులు, ఫౌంటెయిన్ లలో ఉపయోగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పదేపదే అదే తప్పు చేస్తే అదనంగా మరో 5 వేలు జరిమానా అని, రోజుకు రూ.500 చొప్పున ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది. వాటర్ బోర్డ్ యాక్ట్ లోని సెక్షన్ 109 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బెంగళూరు నగరంలో ఈ వేసవిలో తాగునీటి కొరత ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాగునీటిని వృథా చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. వాటర్ బోర్డ్ కాల్ సెంటర్ నెంబర్ 1916 కు ఫోన్ చేసి చెప్పాలని పేర్కొంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ…

Read More

గత ఏడాది పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ రెండు కాంస్య‌ ప‌త‌కాల‌తో సత్తా చాటిన భార‌త స్టార్ షూట‌ర్ మ‌నూ భాక‌ర్ కు బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌’ పుర‌స్కారం లభించింది.అయితే పారిస్ ఒలింపిక్స్ లో కనబరిచిన ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.కాగా ఈ అవార్డు నిమిషం లో భారత మహిళ క్రికెట‌ర్‌ స్మృతి మంధాన‌, రెజ్ల‌ర్ వినేష్ ఫొగ‌ట్‌, గోల్ఫ‌ర్ అదితీ అశోక్‌, పారా షూట‌ర్ అవ‌నీ లేఖ‌రా పేర్లు ఉండ‌గా…మను భాక‌ర్ కు పుర‌స్కారం లభించింది.22 ఏళ్ల ఈ క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలుచుకున్న తోలి భారతీయ మహిళా షూటర్ గా రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే.ఇటీవల భారత ప్ర‌భుత్వం దేశ అత్యున్నత క్రీడా గౌరవం అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో స‌త్క‌రించింది.

Read More