గన్నవరం మాజీ ఎమ్మెలే , వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.కాగా వంశీ అరెస్ట్ అక్రమమని వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు…వంశీ అరెస్ట్ సక్రమమేనని ఆమె వ్యాఖ్యానించారు.వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని అన్నారు.అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేశారని వెల్లడించారు. ఈ మేరకు మరో మంత్రి సవిత మాట్లాడుతూ…టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం, కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి చర్యలు దారుణమని అన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పటి సీఎం జగన్ శాసనసభలో పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు.అయితే మహిళలను అవమానించిన రాజ్యాలు కూలిపోయాయని…దీనికి పురాణాలే సాక్ష్యమని అన్నారు.జగన్ తల్లిని,చెల్లిని వాడుకుని వదిలేశారని,బాబాయ్ పై గొడ్డలి వేటు వేశారని అన్నారు.
Author: admin
గన్నవరం మాజీ శాసనసభ సభ్యుడు,వైసిపి నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై… వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు.ఈ మేరకు వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ తెలిపారు.కాగా రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ…రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.అయితే అక్రమ అరెస్టులతో అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని జగన్ హెచ్చరించారు.
ప్రధాని నరేంద్రమోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెదక్ ఎంపీ, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ధీటైన జవాబు ఇచ్చారు.ప్రధాని కులం గురించి మాట్లాడే ముందు?…ముందు రాహుల్ గాంధీ కులం ఏమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు.సీఎం వ్యాఖ్యలపైనా స్పందిస్తూ…ఇష్టానుసారం మాట్లాడిన వారంతా చరిత్రలో కలిసిపోయారని రఘునందన్ రావు అన్నారు.రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు రఘునందన్ మాట్లాడుతూ…కుల గణనలో పాల్గొనాలని చట్టంలో ఎక్కడైనా రాసి ఉందా అని నిలదీశారు.కుల గణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని కొందరు అంటున్నారని…అలా చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని నిలదీశారు.అసలు నరేంద్ర మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.మా నాయకుడు నరేంద్రమోదీ మంత్రివర్గంలో 17 మంది బీసీలు ఉన్నారు…కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరే బీసీ మంత్రులు ఉన్నారని రఘునందన్ రావు గుర్తు చేశారు.ఏదైనా…
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మరోసారి నష్టాల బాటలో సూచీలు ప్రశ్నించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 75,939గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 102 పాయింట్లు నష్టంతో 22,929 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.80 గా కొనసాగుతోంది. టీసీఎస్ , ఇన్ఫోసిస్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు లాభాలతో ముగిశాయి.
అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తూ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాల నుండి అక్కడికి అక్రమంగా వెళ్లిన వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపిస్తున్నారు. కొన్నిరోజుల కిందటే 104 మంది భారతీయులను కూడా అమెరికా ప్రభుత్వం సైనిక రవాణా విమానంలో భారత్ కు పంపించి వేసింది. తాజాగా, మరో 200 మంది అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం భారత్ కు తరలించనుంది. అక్రమ వలసదారులతో కూడిన రెండు విమానాలు భారత్ చేరుకోనున్నాయి. ఈ నెల 15న ఒక విమానం, ఈ నెల16న మరో విమానం భారత్ కు రానున్నాయి.
అమెరికాలో మళ్లీ ప్రముఖ షార్ట్ వీడియో అప్లికేషన్ ‘టిక్ టాక్’ కనబడుతోంది. ఆ యాప్ ను నిషేధిస్తున్నట్లు ఇప్పటికే అమెరికా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ నిబంధనలకు కట్టుబడని కారణంగా జనవరిలో ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ల నుండి తొలగించాయి. అయితే తాజాగా మళ్లీ టిక్ టాక్ వాటిలో ప్రత్యక్షమైంది. దీని నిషేధం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో మళ్లీ తిరిగి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ యాప్ కు 170 మంది వినియోగదారులకు ఉన్నారు. ఇక ఇప్పటికే టిక్‌టాక్‌ను భారత్ సహా పలు దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభిస్తోంది.కాగా నాలుగు రోజుల్లో 7కు పైగా జీబీఎస్ వైరస్ కేసులు నమోదయ్యాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి వెల్లడించారు.అయితే వారిలో ఇద్దరి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు.జిబిఎస్ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. దీనికి సంబంధించి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధి సోకిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.ఒకరు వెంటిలేటర్‌పై, మరొకరు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.గతంలో ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చి పోయిన కొన్ని రోజుల తర్వాత ఈ వ్యాధి సోకుందని తెలిపారు.ఇది ప్రాణాంతకం కాదని ఒకరి నుండి మరొకరి సోకదని తెలిపారు.ఎలాంటి ఐసోలేషన్ అవసరం లేదని,తొలుత నాడి వ్యవస్థపై ప్రభాశం చూపుతుందని రమణ యశస్వి పేర్కొన్నారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ , దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నారని సమాచారం.ఈ మేరకు హరీష్ శంకర్ చెప్పిన ఓ స్టోరీలైన్‌కు బాలకృష్ణ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది.అయితే ఈ చిత్తాన్ని నిర్మించేందుకు ప్రముఖ బ్యానర్ కూడా ముందుకు వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. యాష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ బాలయ్య-హరీష్ శంకర్ కాంబినేషన్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని చూస్టునట్లు సమాచారం.కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.
పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా , దర్శకులు క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు”.ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రం కోసం దాదాపుగా ఐదేళ్ల నుండి అభిమానులు ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ చిత్రం నుండి చిత్రబృందం రెండో సాంగ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. కాగా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ పై సాగే డ్యూయెట్ సాంగ్ ను నేడు వాలెంటైన్స్ డే కానుకగా బ్యూటిఫుల్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది.అయితే ఈ సాంగ్ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మార్చ్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. Happy Valentine's Day from #HariHaraVeeraMallu ❤️Get ready to groove with the one and only Powerstar…
2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది వీర జవాన్లకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగం ఈ దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే. ఈ దుర్ఘటన జరిగి 6 ఏళ్లు అవుతున్నా.. ఈ దాడితో ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరు.? దాడులకు సంబంధించి విచారణలో తేలింది ఏంటి ? భద్రత వైఫల్యం మీద ఎవరు భాధ్యత తీసుకున్నారు ? కాంగ్రెస్ పార్టీ అడిగిన ఇలాంటి ప్రశ్నలకు బీజేపి నుంచి ఇప్పటికీ సమాధానం లేదని పుల్వామా దాడిపై శ్వేతపత్రం అడిగితే విడుదల చేసే దమ్ము కేంద్రానికి లేదని విమర్శించారు. కీలక సంస్కరణలు తెచ్చిన చిరస్మరణీయుడు మన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దామోదరం…
