Author: admin

బెంగళూరులో నేటి నుండి 5 రోజుల పాటు ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమంలో అమెరికా, రష్యా తదితర దేశాల ఫైటింగ్ జెట్ విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. 30 దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు హాజరవనున్నారు. ఇక భారత రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా బెంగళూరు చేరుకున్నారు. భారత రక్షణ రంగం కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలతో పాటు దేశ ఆర్థిక సామర్ధ్యాన్ని కూడా పెంచుతుందని రాజ్ నాథ్ అన్నారు. స్వయం సమృద్ధి, ఆత్మ నిర్భరత, స్వాలంబనకు ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. మన రక్షణ రంగం ఉత్పాదన పరంగా రూ. 1.27 లక్షల కోట్లు, ఎగుమతుల్లో రూ.21 వేల కోట్లు దాటిందని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక షో గా నిలిచే ఈ షోకు ఈ సారి ‘రన్ వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్’ అన్న థీమ్ ను ఎంచుకున్నట్లు తెలిపారు.

Read More

మరికొద్ది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈనెల 19న మొదలయ్యే ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భద్రతను మిలటరీ, పారామిలటరీ రేంజర్స్ పర్యవేక్షించనున్నాయి. ఈమేరకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ బలగాలు లాహోర్, రావల్పిండి, కరాచీలోని హోటల్స్, స్టేడియాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక భారత్ ఆడే మ్యాచ్ లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్ లు పాక్ లోనే జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ పద్దతిలో యూ.ఏ. ఈ లో జరగనున్నాయి.

Read More

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లీగ్-2025 (డబ్ల్యూపీఎల్) లో యూపీ వారియర్స్ కు ఆల్ రౌండర్ దీప్తి శర్మ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా లీగ్ కు దూరమైంది. దీంతో దీప్తి శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. ఈమేరకు టీమ్ మేనేజ్మెంట్ ఆమెకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. ఇక ఈ సీజన్ కోసం గాయం కారణంగా దూరమైన హీలీ స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ లో చినెలీ హెన్రినీ జట్టులోకి తీసుకుంది. గత సీజన్ లో దీప్తి 295 పరుగులు సాధించింది. బౌలింగ్ లో 10 వికెట్లు పడగొట్టింది.

Read More

ఆసియా మిక్స్డ్ డబుల్స్ టీమ్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం వలన టోర్నీకి దూరమైంది. ఈనెల ఈనెల 11 నుండి 16 వరకు చైనాలోని కింగ్ దావో వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం గువహటిలో భారత టీమ్ కు ట్రైనింగ్ క్యాంప్ కొనసాగుతోంది. ఈ టోర్నీకి భారత జట్టుతో కలిసి ప్రయాణించట్లేదనే విషయాన్ని పంచుకోవడం బాధగా ఉంది. గాయం నుండి కోలుకునేందుకు ఊహించడానికంటే ఎక్కువ సమయం పడుతోందని ఎం.ఆర్.ఐ స్కాన్ లో తేలిందని సింధు ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.

Read More

నేషనల్ స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ యర్రాజీ జ్యోతి వరుసగా మూడోసారి మహిళల 110 మీటర్ల హర్డిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. 2022 గుజరాత్, 2023 గోవా నేషనల్ స్పోర్ట్స్ లో కూడా ఆమె ఈ విభాగంలో జ్యోతి గోల్డ్ మెడల్ సాధించింది. పురుషుల విభాగంలో తేజస్ శిర్సే కూడా గోల్డ్ తో సత్తా చాటాడు. అతను కూడా హ్యాట్రిక్ సాధించడం విశేషం. నేషనల్ స్పోర్ట్స్ లో వరుసగా మూడు సార్లు ఈ ఘనత సాధించాడు. మరోవైపు పురుషుల డెకాథ్లాన్ లో ఏపీకి చెందిన రోహిత్ రోమన్ కాంస్యం సాధించాడు.

Read More

ఇండో అమెరికన్ క్షమా సావంత్‌కు భారత్ అత్యవసర వీసాను తిరస్కరించింది.కాగా క్షమా సావంత్ మద్దతుదారులు అమెరికాలోని సియాటెల్ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.పలువురు ఆందోళనకారులు గుమికూడటంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని,స్థానిక అధికారులను పిలవాల్సి వచ్చిందని భారత కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది. అయితే కొంతమంది వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణంలోకి వచ్చే ప్రయత్నం చేశారని,వారిని ఎందుకు వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే, వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లు భారత కాన్సులేట్ పేర్కొంది.వారు వెళ్లడానికి నిరాకరించారని వెల్లడించింది.సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని,బెదిరింపులకు దిగారని పేర్కొంది.శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులను పిలిపించినట్లు వెల్లడించింది.అయితే ఈమె అనేక ప్రసంగాల్లో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడేది.అలానే భారత వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనేది అని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేస్తున్నారు.

Read More

మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేశారు.ఈ మేరకు ఆయన రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో రాష్ట్ర గవర్నర్‌తో సమావేశమయ్యారు.ఆ తర్వాత తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు.గత కొంత కాలం నుండి మణిపూర్‌లో రెండు జాతుల మధ్య అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమైనట్లు సమాచారం వచ్చింది.దీనితో బీరెన్ సింగ్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read More

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 2-0 ఆధిక్యంతో నిలవడమే కాక సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటయింది.‌ జో రూట్ 69 (72; 6×4), డకెట్ 65 (56; 10×4) హాఫ్ సెంచరీలు సాధించారు. లివింగ్ స్టోన్ 41 (32; 2×4, 2×6), జాస్ బట్లర్ 34 (35; 2×4), హ్యారీ బ్రూక్ 31 (52; 3×4, 1×6) సాల్ట్ 26 (29; 2×4, 1×6) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 300 మార్క్ దాటింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, షమీ, హార్షిత్ రాణా, హార్థిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి…

Read More

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.ఈ క్రమంలో అతను యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.ఈ మ్యాచ్‌లు మూడో సిక్స్ బాది క్రిస్ గేల్‌ను అధిగమించాడు.గస్ అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్.. సకీబ్ మహ్మూద్ వేసిన మరుసటి ఓవర్‌లో మరో సిక్స్ కొట్టాడు.మహ్మూద్ వేసిన ఐదో ఓవర్‌లో మరో సిక్స్ కొట్టి క్రిస్ గేల్ అత్యధిక సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించాడు. క్రిస్ గేల్ 301 వన్డే మ్యాచ్‌ల్లో 331 సిక్స్‌లు బాదగా..రోహిత్ శర్మ 335 సిక్స్‌లత కొనసాగుతున్నాడు.ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.అతను 398 మ్యాచ్‌ల్లో 351 సిక్స్‌లు కొట్టాడు.మరో 16 సిక్స్‌లు బాదితే హిట్…

Read More

కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది.హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది.దీని కారణంగా అమెరికాకు సునామీ ముప్పు ఉందని జియోలాజికల్‌ సర్వే సంస్థ హెచ్చరించింది.భారీ భూకంపం కరేబియన్ సముద్రాన్ని అల్లల్లాడించింది.అయితే కేమన్ దీవులకు నైరుతి వైపు కరేబియన్ సముద్రంలో రెక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ మేరకు భూమిపై ప్రభావం ఏర్పడిందో లేదో ఇంకా తెలియలేదు.నిన్న రాత్రి యునైటెడ్ స్టేట్స్ కు చెందిన జియోలాజికల్ సర్వే ఈ భారీ భూకంపాన్ని గుర్తించింది.

Read More