మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా కన్నప్ప నుండి ఫస్ట్ సింగిల్ ‘శివ శివ శంకర’ సాంగ్ రేపు విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ మేరకు శ్రీ రవిశంకర్ గురూజీ ఈ పాటను లాంచ్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ…సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేశారు. కాగా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.ఇందులో రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించగా…అక్షయ కుమార్,కాజల్ శివపార్వతులుగా నటిస్తున్నారు.ప్రీతి ముకుందన్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడు కూడా ఈ చిత్రంతో తెరంగేట్రం చేయబోతున్నారు.అవ్రా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కలెక్షన్ మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 🎶 The countdown is…
Author: admin
ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ కొనుగోలు అంశంపై ఇటీవల వస్తున్న వార్తలకు సంబంధించి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. దాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి లేదని మస్క్ తెలియజేశారు. తనకు కంపెనీలను కొనుగోలు చేయడం కంటే నెలకొల్పడం అంటేనే ఎక్కువ ఇష్టమని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మస్క్ పేర్కొన్నారు. అమెరికాలో నిషేధం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని నుండి తప్పించుకునేందుకు అమెరికాలోని టిక్‌టాక్ కార్యకలాపాలను ఎలాన్ మస్క్‌కు విక్రయించాలని సంస్థ యాజమాన్యం యోచిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. గత నెలలో ఒక వీడియోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టిక్‌టాక్‌ను భారత్ సహా పలు దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా దీని వినియోగంపై ఆంక్షలు విధించారు. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనని అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల తీర్మానించింది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మంచి పోరాటం కనబరిచి ద్వితీయ స్థానంలో నిలవగా… కాంగ్రెస్ మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ ఖాతా తెరవక పోవడం గమనార్హం. ఢిల్లీ ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. అంకితభావంతో పని చేసిన ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరియు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ లోని కాలుష్యం, ద్రవ్యోల్బణం మరియు అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రగతి మరియు ఢిల్లీవాసుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో ప్రపంచ ఛాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ క్వార్టర్స్ చేరాడు. రౌండ్ రాబిన్ లీగ్ లో 9 రౌండ్ల తరువాత 3.5 పాయింట్లతో గుకేష్ 8వ స్థానంలో నిలిచాడు. దీంతో నాకౌట్ ఆడే అవకాశం సాధించాడు. 6,7 గేమ్ లలో కరువానా, కీమర్ లతో డ్రాగా ముగించగా.. 8వ రౌండ్ లో ఫెదోసీవ్ తో పాయింట్ షేర్ చేసుకున్నాడు. చివరిదైన 9వ రౌండ్ లో మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ఓడినప్పటికీ 8మంది ఆడే నాకౌట్ లో స్థానం సంపాదించుకున్నాడు.
ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే లో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు చారిత్రాత్మకమైన అధికారాన్ని సాధించినందుకు బీజేపీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు ప్రతిధ్వనిగా నిలుస్తున్నాయి. హర్యానా మరియు మహారాష్ట్రల తర్వాత ఢిల్లీలో సాధించిన ఈ విజయం ప్రధాని మోడీ యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంపై మరియు వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఆయన అంకితభావంపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ విజయం మన దేశ రాజధానికి అభివృద్ధికి మరియు శ్రేయస్సుకి కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వేదికగా BIMSTEC యూత్ సమ్మిట్ జరుగుతోంది. ఈనెల 11 వరకు ఐదురోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. యువత నేతృత్వంలో అభివృద్ధి! అనే నినాదంతో జరగనుంది. యువత నేతృత్వంలో సహకారం, ఆవిష్కరణలు మరియు ప్రాంతీయ వృద్ధిని పెంపొందించడంలో ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన భూమిక పోషించనుంది. ఖాట్మండులో జరిగిన 4వ BIMSTEC సమ్మిట్‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువత ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తమిళ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘రెట్రో’.తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది.ఈ మేరకు తెలుగు టీజర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.ఈ వేసవి కానుకగా మే 1న ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు రూపొందిస్తున్నాడు.ఇందులో సూర్యకు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది.ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్, జయరామ్, కరుణకరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ బ్యానర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిసున్నారు. https://youtu.be/8u6sxVEqXYI?si=F02wWbZvCuBglORv
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.ఆప్ సీనియర్ నాయకులంతా ఊహించని రీతిలో పరాజయం పాలయ్యారు.ముఖ్యమంత్రి అతిషి మాత్రం స్వల్ప మెజారిటీతో గెలిచారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది.ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం అయ్యింది.కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో లానే ఈసారి కూడా ఖాతా తెరువలేదు.కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.అయితే దేశ రాజధానిలో కాంగ్రెస్ కనుమరుగైనట్లేననే రాజకీయ విశ్లేషణలు వ్యాఖ్యానిస్తున్నారు.షీలా దీక్షిత్ నాయకత్వంలో 1998 నుండి 2013 వరకు వరుసగా 3 సార్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఇలాంటి దుస్థితి ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది.ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని ఆదేశించారు.ఆప్ ఓటమి పాలైన క్రమంలో… సెక్రటేరియట్ లోని కీలక ఫైళ్లు తరలిపోకుండా ఉండేందుకు ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఆయన ఆదేశాలతో సెక్రటేరియట్ ను జీఏడీ సీజ్ చేసింది.కాగా 10 ఏళ్లగా ఆప్ పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది.ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని గతంలో ప్రధాని మోదీ చెప్పారు.
దశాబ్దానికి పైగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. అత్యధిక స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ ను నిరాశ కలిగించాయనే చెప్పాలి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి అగ్రనేతలు పరాజయం పాలయ్యారు. ఇక ఈ ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని, ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లం తెలిపారు. ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి అభినందనలు తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికల ఫలితాలతో తన స్ఫూర్తి దెబ్బతింటుందని భావించడంలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత పదేళ్లలో ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ సహా అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని వివరించారు. ఎన్నికల్లో ఓటమి చెందినా నిరంతరం…
