Author: admin

ఇజ్రాయెల్ -హమాస్ మధ్య యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, కొన్ని వైపులా నుండి దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందించారు. ట్రంప్ నిర్ణయానికి మద్దతు పలికారు. ఆయన ప్రతిపాదనలో తప్పేమీ లేదని అన్నారు. గాజాను స్వాధీనం చేసుకుని అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చేసి అక్కడి ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. హమాస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా బలగాలను గాజాకు పంపడం ఆ ప్రాంతాన్ని పునరుద్ధరించేందుకు ఆర్థిక సాయం చేస్తానన్నాడు తాను నమ్మలేకపోతున్నట్లు నెతన్యహూ తెలిపారు. ఇక మరోవైపు గాజాలో ఉద్రిక్తతల వలన నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ ఇటీవల…

Read More

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి వైదొలగనున్నట్లు అర్జెంటీనా ప్రకటించింది.అయితే Covid -19 కట్టడికిచేయడంలో విఫలమవడం, పలు ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్జెంటీనా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.ఈ మేరకు అధ్యక్ష ప్రతినిధి మాన్యుయెల్ అడోర్నీ ఓ సమావేశంలో మాట్లాడుతూ…ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేశారు.అర్జెంటీనా ఏ అంతర్జాతీయ సంస్థను తన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోదని స్పష్టం చేశారు.డబ్లూహెచ్వో స్వతంత్రంగా పని చేయడం లేదని,దాని నిర్ణయాలు బాహ్య ఒత్తిడికి లోబడి ఉంటాయని ఆరోపించారు.మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన కొవిడ్-19 సమయంలో డబ్లూహెచ్వై సరిగా పని చేయలేదని విమర్శించారు.

Read More

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఇస్మాయిలీ ముస్లిముల 49వ వారసత్వ ఇమామ్ ప్రిన్స్ కరీం అల్ -హుస్సేనీ అగాఖాన్ IV మరణించారు. ఆయన మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన తన జీవితాన్ని సేవ మరియు ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దూరదృష్టి గలవాడని కొనియాడారు . ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సాధికారత వంటి రంగాలలో ఆయన చేసిన కృషి చాలా మందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు . ఆయన కుటుంబానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అనుచరులు మరియు ఆరాధకులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఆయన స్విట్జర్లాండ్లో 1936 డిసెంబరు 13న జన్మించారు. విద్యార్థిగా ఉండగా 20ఏళ్లకే ఆయన తాత(ఆగాఖాన్-3) తన వారసుడిగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింల 49వ ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించారు. ఇక 1957లో ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ ఆయనకు ‘హిజ్ హైనెస్’ బిరుదును అందజేశారు. 2015లో…

Read More

ఈశాన్య రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. తాజాగా త్రిపుర ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించిన 2800 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సౌత్ కొరియా విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలు బయటి నెట్‌వర్క్‌లకు అనుసంధానమైన తమ మంత్రిత్వ శాఖ కంప్యూటర్లలో చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ డీప్‌సీక్‌ వాడకాన్ని నిలుపుదల చేశాయి. విదేశాంగ మంత్రి జై శంకర్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సెక్రటరీ జనరల్ నుర్లాన్ ఎర్మక్ బేయేవ్ తో భేటీ అయ్యారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా “RC16” చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్పాట్ లో ఓ ప్రత్యేక అతిథి సందడి చేసింది.ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుంది. రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ నేడు హైదరాబాద్‌లో జరిగింది. అయితే రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారతో చిత్రీకరణ ప్రదేశంలో కనిపించారు.లొకేషన్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.షూటింగ్ స్పాట్ లో తన కుమార్తె చేయి చాచి ఏదో చూపిస్తుండగా రామ్ చరణ్ ఆమెను చూస్తూ ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

Read More

పనామా కెనాల్ అంశంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పంతమే నెగ్గింది. పనామా కెనాల్ లో అమెరికా షిప్ లు ఫ్రీగా ప్రయాణించే విధంగా ఈమేరకు అమెరికా డిఫెన్స్ మినిస్టర్ హెగ్సే , పనామా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అలెక్స్ మధ్య ఒప్పందం కుదిరింది. తాజాగా జరిగిన ఒప్పందం ప్రకారం అమెరికా గవర్నమెంట్ షిప్ లకు భారీగా నగదు మిగిలిపోతుందని తెలిపారు. ఈ కెనాల్ లో అమెరికా షిప్ లు ఇంకా ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. గతేడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ పనామా కెనాల్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కెనాల్ ను 1914లో నిర్మించింది. దీనిని మొదట అమెరికానే నిర్వహించింది.అయితే, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తి…

Read More

బంగ్లాదేశ్‌ లో షేక్ హాసీనా అధికార పీఠం దిగిపోయిన తీరు తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. తాజాగా నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. ఆ దేశ జాతిపితగా పరిగణించే షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడిచేసి నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లు, విధ్వంసం తర్వాత పదవి కోల్పోయి, భారత్‌ కు వచ్చేసిన అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేక్ హసీనా ప్రసంగిస్తూ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని తన పార్టీ అవామీ లీగ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ వెంటనే ఢాకాలో ఆమెకు వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ నివాసంపై నిరసనకారులు దాడికి దిగి, దానికి నిప్పు పెట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరలవుతున్నాయి. దీనిపై ఆమె స్పందించారు. వారు ఒక భవనాన్ని కూల్చివేయగలరు కానీ,…

Read More

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షలు నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించింది. వాల్తేర్ డివిజన్ ను విశాఖ డివిజన్ పేరు మార్పు చేసి, పరిధి కూడా మార్పు చేసింది. విశాఖ డివిజన్ కిందికి 410 కిలోమీటర్ల రైల్వే సెక్షన్ లు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉన్నాయి. కొండపల్లి – మోటుమర్రి సెక్షన్ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు మారింది. కూటమి ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఏపీకి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ పరిధిని నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను చేర్చుతూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లుగా మూలన పడి ఉన్న ప్రత్యేక రైల్వే జోన్ అంశానికి కూటమి ప్రభుత్వం…

Read More

రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హెలెప్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. 33 ఏళ్ల హెలెప్ ట్రాన్సెన్వేలియా టోర్నీలో 1-6, 1-6 తో పరాజయం అనంతరం తన రిటైర్మెంట్ ప్రకటించింది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ టైటిల్స్ గెలిచింది. 2017లో ప్రపంచ నెంబర్ వన్ గా అగ్రస్థానంలో నిలిచింది. తన కెరీర్ లో 24 సింగిల్స్ టైటిల్ లు గెలిచింది. నిషేధిత ఉత్ప్రేరకం వాడిందని ఆమెపై 4 ఏళ్ల నిషేధం విధించారు. కానీ ఆమె స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీలు చేసింది. దీంతో ఆమెపై నిషేధం 9 నెలలకు తగ్గించి బడింది. అప్పటికే నిషేధం ముగియడంతో ఏప్రిల్ లో పునరాగమనం చేసింది. అయితే ఆ తర్వాత గాయాలతో సొంతమైంది. మోకాలి, భుజం గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ అర్హత పోటీల నుండి వైదొలిగింది. చివరిగా గ్రాండ్ స్లామ్ లో 2022 యూ.ఎస్ ఓపెన్ లో ఆడింది. తన వీడ్కోలు సందర్భంగా…

Read More

ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు మరో మూడు మెడల్స్ వచ్చాయి. కనోయ్ స్లాలొమ్ లో నాగిడి గాయత్రి గోల్డ్ మెడల్ సాధించింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో గణేష్ మణిరత్నం, సూర్య హాసిని ద్వయం సిల్వర్ మెడల్ సాధించారు. ఇక కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో గణేష్ మణిరత్నం బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కు 3 గోల్డ్, సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్ సహా మొత్తం 8 మెడల్స్ వచ్చాయి.

Read More