Author: admin

వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడమే సూచీలు జోరు తగ్గడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 78,058 వద్ద ముగిసింది.‌ నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 92 పాయింట్ల నష్టంతో 23,603 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.59గా కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా మంత్రులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొదటి స్థానంలో ఫరూక్ నిలిచారు. ఫైళ్ల క్లియరెన్స్ లో సీఎం చంద్రబాబు 6వ స్థానంలో ఉండగా… లోకేష్ 8వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో నిలిచారు. ఏపీ మంత్రుల ర్యాంకింగ్స్: 1.ఎన్ఎండీ ఫరూఖ్ 2. కందుల దుర్గేశ్ 3. కొండపల్లి శ్రీనివాస్ 4. నాదెండ్ల మనోహర్ 5. డోలా బాలవీరాంజనేయస్వామి 6. సీఎం చంద్రబాబు 7. సత్యకుమార్ 8. నారా లోకేశ్ 9. బీసీ జనార్ధన్ రెడ్డి 10. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11. సవిత 12. కొల్లు రవీంద్ర 13. గొట్టిపాటి రవికుమార్ 14. నారాయణ 15. టీజీ భరత్ 16. ఆనం రామనారాయణరెడ్డి 17. అచ్చెన్నాయుడు…

Read More

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.ఈ మేరకు 2019లో నామినేటెడ్ పోస్టులకు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ…తీసుకున్న చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు,అందులో ఉన్న లోటుపాట్లను సవరించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది.అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కి కేబినెట్ అనుమతి ఇచ్చింది.పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది.గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా కేబినెట్ ప్రత్యేక ప్రతిపాదనలు చేసింది.

Read More

అమెరికా నుండి అక్రమ వలసదారుల తరలించే ప్రక్రియ కొత్తది ఏమి కాదు అని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తెలిపారు.కాగా నిన్న 104 మంది భారతీయులను అమెరికా స్వదేశానికి పంపించడంపై కేంద్రమంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు.అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతుంది. 2009 నుండి బహిష్కరణలు జరుగుతున్నాయి.భారత్ నుండి అక్రమ వలసలను అరికట్టేందుకు మనం ప్రయత్నాలు చేస్తున్నాం…అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా తిరిగి పంపించడమే మౌలిక విధానం.ఒక దేశానికి చెందిన ప్రజలు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు,వారిని తమ స్వదేశాలకు రప్పించడం ఆ దేశాల బాధ్యత” అని కేంద్రమంత్రి జైశంకర్‌ వ్యాఖ్యనించారు.

Read More

తలసేమియా వ్యాధి పై అవగాహన కల్పించే లక్ష్యంతో, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు తమన్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఎవరైనా టికెట్ కొంటేనే వారికి లోపలికి అనుమతి అని స్పష్టం చేశారు. ఫండ్ రైజింగ్ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిని నిర్వహించేందుకు తమన్ ముందుకొచ్చారని చెప్పారు. తమ కుటుంబ సభ్యుల కోసం చంద్రబాబు రూ.6 లక్షలు పెట్టిన టికెట్లను కొని టేబుల్ బుక్ చేశారని పేర్కొన్నారు. ‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ‘ అని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తితోనే ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరూ రక్త దాన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి…

Read More

హామీ ఇచ్చిన ఒక్క పథకమూ ఇవ్వలేదు. కానీ రాష్ట్రం అప్పులు మాత్రం కొండల్లా పెరిగిపోయాయి. మరి ఈ డబ్బంతా ఏమైపోయింది.ఎక్కడికి వెళ్తోంది..ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో చెప్పిన హామీలను నెరవేర్చలేమని 9 నెలల్లోనే చేతులెెత్తేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో దేశ జీడీపీ కన్నా రాష్ట్ర జిడిపి ఎక్కువగా ఉండేది. మా పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనించింది. దీన్ని ఎవరూ కాదనలేరని జగన్ అన్నారు. హామీలకు గ్యారెంటీ అని ఇంటింటికీ బాండ్లు పంపించారు.ఇప్పుడు ఆ బాండ్లు ఏమయ్యాయి..? మేనిఫెస్టోలో హామీలు ఏమయ్యాయి..? పంచిన పాంప్లెట్లు ఏమయ్యాయి..? ఎవరి చొక్కా పట్టుకోవాలి? చంద్రబాబుగారి పాలనలో అప్పులు రికార్డులు బద్దలు కొట్టేశాయి. 9 నెలల్లో మొత్తంగా రూ.1,45,000 కోట్లు ఇది ఇంకో రికార్డు. ఎన్ని అప్పులు చేసినా.. సూపర్ సిక్స్.. పేదలకేమైనా బటన్ నొక్కారా?…

Read More

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్‌ సర్కారు వ్యూహం నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది.అయితే ది ఆఫీస్‌ ఆఫ్ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఇచ్చిన బైఅవుట్‌ ఆఫర్‌ గడువు ముగియనుంది.ఈ సందర్భంగా ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో తెలిపింది.ఈ విషయాన్ని ఓపీఎం ధ్రువీకరించింది.అయితే ట్రంప్‌ సర్కారు ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని,భవిష్యత్తులో ఈ సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఓపీఎం నుండి ఒక మెమో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ-మెయిల్‌ వెళ్లింది.ఇందులో స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలిన వారికి 8 నెలల జీతం ఇస్తామని తెలిపింది.ఫిబ్రవరి 6వ తేదీకి ముందు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్‌ వరకు పని చేయకుండానే జీతం పొందవచ్చని చెబుతున్నారు.అయితే దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు…

Read More

శ్రీకాంత్ అడ్డాల అనగానే కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు గుర్తుకు వస్తాయి.ఆ తర్వాత వచ్చిన ‘ముకుంద’ కూడా మంచి మార్కులు పడ్డాయి.కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో శ్రీకాంత్ అడ్డాల ఘోర పరాజయాన్ని అందుకున్నాడు.అయితే వెంకటేష్ తో నారప్ప మూవీ తీసిన అది కొవిడ్-19 కారణంగా థియేటర్స్ లో విడుదల కాకుండా ott లో విడుదలైంది.ఆ తరువాత చాలా గ్యాప్ తో తన శైలికి భిన్నంగా తీసిన “పెదకాపు’ కూడా నిరాశే మిగిల్చింది.తాజా ఆయనకు మళ్లీ కలిసొచ్చిన జానర్లో కథను శ్రీకాంత్ అడ్డాల తయారు చేసుకున్నారు.ఈ కథకు ‘కూచిపూడి వారి వీధి’ అని టైటిల్ కూడా పెట్టేశారు.గతంలో అన్నదమ్ముల కథగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తీశారు.ఇప్పుడు అక్కచెల్లెళ్ల కథగా ఈ ‘కూచిపూడి వారి వీధి’ తీయబోతున్నారు.దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం.ప్రస్తుతం ఇద్దరు కథానాయికల కోసం శ్రీకాంత్ అన్వేషిస్తున్నారని తెలుస్తుంది.

Read More

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీనియర్ నటుడు మురళీమోహన్, ప్రముఖ రచయిత పరిచూరి గోపాలకృష్ణ,ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్,సెక్రటరీ ప్రసన్న కుమార్,దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, రచయిత, జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ ఫిబ్రవరి 6ను అధికారికంగా “తెలుగు సినిమా దినోత్సవం”గా ప్రకటించింది. ఈ సందర్భంగా తెలుగు సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ…రాజకీయ నాయకుల కంటే సినీ నటులకే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంటుందని.రాజకీయ నాయకుడి పదవీ కాలం ముగిసిన తర్వాత అతనిపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతుంది.క్రీడాకారులకూ కేవలం కొంత కాలం మాత్రమే ప్రజాదరణ ఉంటుంది.కానీ సినీ నటులు మాత్రం ప్రజల మనసుల్లో సుస్థిరంగా ఉంటారని అన్నారు.కాగా ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా జరుపుకోవడం మాకు గర్వకారణం.మద్రాసులో ఉన్న రోజుల్లో,మేము సినిమా రంగానికి చెందిన వారమని గర్వంగా చెప్పుకునేవాళ్లమని…

Read More

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూ.జీ.సీ) కొత్త ముసాయిదా (డ్రాఫ్ట్) నిబంధనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డీఎంకే స్టూడెంట్స్ విభాగం నిరసన చేపట్టింది. ఈ నిరసనలు లో డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదు. ఇది మన సంప్రదాయం, చరిత్ర, సంస్కృతి, భాషలపై దాడి చేసేందుకు ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న ప్రయత్నం అని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల విద్యా వ్యవస్థ పై వారు చేస్తున్న ఈ ప్రయత్నం తమ ఎజెండా కోసమేనని రాహుల్ ఆరోపణలు చేశారు. ఈ ముసాయిదా తాము కూడా వ్యతిరేకిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ కూడా తెలిపారు. వర్శిటీలు, కాలేజీలో లెక్చరర్లు, టీచింగ్ స్టాఫ్ నియామకం, పదోన్నతి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు మార్గదర్శకాలు-2025 పేరిట యూజీసీ ఇటీవల ఒక…

Read More