Author: admin

వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ప్రయత్నంగా తెలుస్తోంది.‌ విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించి తన ఎంపీ పదవికి , వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఆయన రాజీనామా పై వైఎస్ జగన్ స్పందించారు. మా రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు. రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి. మనంతట మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏంటి? అని…

Read More

ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ హాల్ టికెట్ లు విడుదలయ్యాయని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో ను పంచుకున్నారు. విద్యార్థులు ఏవిధంగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చో తన పోస్ట్ ద్వారా లోకేష్ వివరించారు. ప్రియమైన II సంవత్సరం MPC & BIPC విద్యార్థులారా, మీ ప్రాక్టికల్ హాల్ టిక్కెట్లు ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని దీని ద్వారా యాక్సెస్ చేయవచ్చు: 1. మీ కళాశాల లాగిన్ 2. అధికారిక BIE AP వెబ్‌సైట్: (bie.ap.gov.in) 3. మన మిత్ర, AP ప్రభుత్వ WhatsApp సేవ (9552300009) విద్యా సేవలను ఎంచుకోవడం ద్వారా మరియు మీ మునుపటి హాల్ టికెట్ నంబర్ / IPE 2025 హాల్ టికెట్ నంబర్ / ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని అందించడం ద్వారా పొందవచ్చు.…

Read More

ప్రముఖ నటుడు సోనుసూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి హాజరుకాలేని కారణంగా పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఈ ఉత్తర్వులను విడుదల చేసింది.అయితే ముంబయిలోని అంధేరి వెస్ట్‌ ప్రాంతంలోని ఒషివారా పోలీస్‌ స్టేషన్‌కు,లుథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.లుథియానా కి చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా,మోహిత్ శర్మ అనే వ్యక్తి తనను ₹10 లక్షలు మోసం చేశాడని కోర్టులో ఫిర్యాదు చేశారు.రిజికా కాయిన్ పేరుతో పెట్టుబడి పెట్టించారని తన వాదన.ఈ కేసులో సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్‌ పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ,ఆయన హాజరుకాలేదు.దీనితో వెంటనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 10న జరగనుంది.

Read More

ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ నేషనల్ స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించింది. 25-23, 21-19 స్కోరుతో‌ తమిళనాడు టీమ్ పై విజయం సాధించింది. తాజాగా జరిగిన ఫైనల్ లో కె.మణికంఠరాజు, ఎల్.దివ్యసాయి ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆర్చరీలో వెటరన్ దీపికా కుమారి 18 ఏళ్ల జుయల్ సర్కార్ విజేతలుగా నిలిచారు. బీహార్ కు చెందిన అంకితపై దీపికా కుమారి 6-4 తో గెలుపొందింది.

Read More

ప్రత్యేక అధికారాలతో వరుసగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టు షాక్ ఇచ్చింది.జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసేలా ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పటికే రెండు ఫెడరల్‌ కోర్టులు నిలిపివేశాయి.ఈ నేపథ్యంలో నిన్న మరో కోర్టు కూడా అదే విధంగా ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ట్రంప్‌ ఇచ్చిన ఉత్తర్వులను కూడా మరో కోర్టు నిలిపివేసింది. కాగా ఈ ఉత్తర్వులను 22 రాష్ట్రాలు కోర్టులో సవాలు చేశాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఫెడరల్‌ జడ్జీలు ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు.తాజాగా సియాటిల్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి జాన్‌ కఫెనార్‌ కూడా ట్రంప్‌ ఉత్తర్వులను నిలిపివేస్తూ తీర్పు వెలువరించారు.

Read More

అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు.కాగా ఈ వలసదారుల్లో ఒకరి పేరు ఇంటర్‌పోల్‌ నేరగాళ్ల లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే దీనిపై జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.అమెరికా నుండి 104 మంది అక్రమ వలసదారులతో బయల్దేరిన సీ-17 విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.విమానం చేరుకున్న వెంటనే అధికారులు వలసదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎటువంటి నేర చరిత్ర లేని వారిని అవసరమైన తనిఖీల అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు.

Read More

కేవలం 99 రూపాయలతో హాయిగా హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకోనే విధంగా ఈవీ (ఎలక్ట్రానిక్ వెహికల్)బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను నిన్న బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటీవో మోటార్స్ సీఎంవో రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడారు. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సర్వీసులు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుండి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5…

Read More

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు నాగ్ పూర్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటయింది. జాస్ బట్లర్ 52 (67; 4×4), జాకోబ్ బెతెల్ 51 (64; 3×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. సాల్ట్ 43 (26; 5×4, 3×6), డకెట్ 32 (29; 6×4) పర్వలేదనిపించారు. జోఫ్రా ఆర్చర్ 21 నాటౌట్ (18; 3×4, 1×6) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హార్షిత్ రాణా 3 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు, షమీ, అక్సర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ మొదట్లోనే తడబడింది. రోహిత్ శర్మ (2), యశస్వీ జైశ్వాల్…

Read More

యువ హీరో విశ్వక్​ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘లైలా’.ఈ చిత్రానికి దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.సాహు గార్లపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది.వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం వహించాడు.ఇప్పటికే సినిమా నుండి టీజర్, పాటలను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృంద్రం విడుదల చేసింది. https://youtu.be/FyhFBHpTh6Y?si=55htgswMU2sBG6am

Read More

ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో లిమిటెడ్ తమ కంపెనీ పేరును మార్చింది.ఇక నుండి ఈ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ గా వ్యవహరించనుంది.అయితే ఈ పేరుకు అనుగుణంగా కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు.గత 2 ఏళ్లుగా ఈ పేరును అంతర్గతంగా ఉపయోగిస్తూ…వచ్చిన జొమాటో తాజాగా అధికారికంగా పేరు మార్పును ప్రకటించింది.ఈ అంశాన్ని కంపెనీ సీఈఓ,సహవ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వాటాదారులకు లేఖ ద్వారా తెలియజేశారు.బ్లింకిట్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి తమ సంస్థను అంతర్గతంగా ఎటర్నల్ గా పిలుచుకుంటూ వచ్చినట్లు దీపిందర్ గోయల్ లేఖలో పేర్కొన్నారు.

Read More