ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా లో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యాలో రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.దీనిపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ…సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు.భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన,విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు.భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.ఈ వ్యాజ్యం నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
Author: admin
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో తెలంగాణా లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు విషయంలో విధివిధానాలు రూపొందించి సత్వరం చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.యాదగిరిగుట్ట పాలక మండలి నియామకపు నిబంధనలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు అధికారులు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఈసందర్భంగా సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం పలు మార్పులు సూచించారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది స్మిత్‌కు 35వ టెస్ట్ శతకం. అలాగే ఇది అతనికి విదేశాలలో చేసిన 17వ సెంచరీ కావడంతో ఇప్పటివరకు విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ల జాబితాలో స్మిత్ ముందంజలో నిలిచాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇంతకుముందు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 16 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా..తాజాగా స్మిత్ 17వ శతకంతో కోహ్లీని దాటేశాడు. ఇక ఇదే టెస్టులో స్మిత్ మరో అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు. టెస్టుల్లో 10వేల పరుగుల మార్క్‌ను చేరాడు. దీంతో ఈ ఫీట్ అందుకున్న ప్రపంచ దిగ్గజ బ్యాటర్ల సరసన చేరాడు.
మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు ఘన నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు: మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింస ను పరమ ధర్మం గా చెప్పిన మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయం. జాతి పిత కు మరొక్కసారి ఘన నివాళి అర్పిస్తున్నాను. మంత్రి నారా లోకేష్: సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మాగాంధీ ఒకరు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు. భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. దేశానికి స్వాతంత్య్ర…
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే మూడేళ్లుగా విరాట్ కోహ్లీ నిలకడలేమి ఆటతో సతమతమవుతున్నాడు.గత 6 నెలలుగా అతని ప్రదర్శన మరీ పేలవంగా మారింది.పెర్త్ టెస్ట్ సెంచరీ మినహా కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.దీనితో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.జట్టులో నుండి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా విఫలమవడంతో భారత జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కొంది.కాగా అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆల్టిమేటం జారీ చేసింది.దీనితో సీనియర్ ఆటగాళ్లంతా రంజీ బరిలో నిలిచారు.అయితే మెడ నొప్పి గాయంతో గత రంజీ మ్యాచ్ ఆడని కోహ్లీ..ఈరోజు ప్రారంభమైన ఆఖరి లీగ్ రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.సౌరాష్ట్రతో ఢిల్లీలో అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న ఈ…
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి భారత్ ఆడనున్న మ్యాచ్ లు మినహా పాకిస్థాన్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా పాక్ లోని లాహోర్, కరాచీ లోని స్టేడియాలు సిద్దం కాలేదనే వార్తలు వస్తున్నాయి. గతేడాది ఐసీసీ ఇచ్చిన రూ.380 కోట్ల నిధులతో ఈ స్టేడియాల పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పనులు పూర్తయ్యాయా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు స్టేడియాలను పరీక్షించేందుకు ఫిబ్రవరి 8-14 తేదీలు మధ్య పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య ట్రై ఏంగిల్ సిరీస్ ను నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ఖలీస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్( ఎస్.ఎఫ్.జె) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ పై ఉన్న కేసుల సంఖ్యను తెలిపింది. అతనిపై 104 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ , చండీగఢ్, హర్యానా, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాలలో ఎస్.ఎఫ్.జె పై 96 కేసులు ఉన్నాయని మరో 8 కేసులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) విచారిస్తోందని కేంద్రం తన గెజిట్ లో పేర్కొంది. ఎస్.ఎఫ్.జెపై ఐదేళ్ల పాటు ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు ఢిల్లీ హైకోర్టుకు చెందిన ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ విషయం కేంద్రం తెలిపింది. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పన్నూ ప్రత్యక్షమవడం ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై భారత్ స్పందించింది. తమ దేశ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికా వద్ద ప్రస్తావిస్తూనే ఉంటామని తేల్చి చెప్పింది.
తమిళ నటుడు విజయ్ సేతుపతి పాన్ కార్డుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ కార్డు సమాచారాన్ని తమిళంలో కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్ధిక లావాదేవీలలో ఎంతో కీలకమైన పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని కోరారు. వాటికి సంబంధించిన అప్ డేట్స్ తమిళంలో కూడా అందించాలని కోరారు. పాన్ కార్డు వివరాలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఉంటున్నాయని ఆ భాషలు రాని వారు పాన్ కార్డు అప్ డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తమిళ భాషని యాడ్ చేయడం కష్టమైనప్పటికీ ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలకు పాన్ కార్డు విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు వారికి అర్ధమయ్యే భాషలో సమాచారం ఉంటే వారు గందరగోళానికి గురికాకుండా ఉంటారన్నారు. భాషతో సంబంధం లేకుండా పౌరులందరూ అవసరమైన ఆర్థిక సమాచారం ఈజీగా తెలుసుకునేందుకు పాన్ కార్డు సంబంధిత వివరాలను…
2018లో నాటి టిడిపి హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసిపి పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని లోకేష్ విమర్శించారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యిందని పేర్కొన్నారు. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు.. తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం.. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయని ఆక్షేపించారు.…
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శకటానికి 30 ఏళ్ల తర్వాత జ్యూరీ అవార్డు దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ వేంకటేశ్వరస్వామి, వినాయకుడు, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిబింబించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి మూడో స్థానం రావడం సంతోషకరమని… రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ శకటం, రెండవ స్థానంలో త్రిపుర శకటం ఉండగా మూడో స్థానం ఏపీకి దక్కింది. ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు… ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలుపారు. ఈమేరకు ఆయన…
