Author: admin

యువగళం పాదయాత్ర లో హామీ ఇచ్చిన విధంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు . దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి జగజ్జనని పరమేశ్వరి కన్యక అవతారం దాల్చారు. తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన వాసవీ దేవి ఆత్మార్పణ చేస్తూ అగ్నిప్రవేశం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా లోకేష్ ఆకాంక్షించారు.

Read More

కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ మేరకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 3వ సారి సంపూర్ణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.రేపు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను సమర్పించనుంది.అయితే పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించడానికి ముందు గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.అయితే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆమె ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించారు.

Read More

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జెర్సీ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది.ఇందులో విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే నటిస్తోంది.ఈ చిత్రం అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నవిజయ్ అభిమానులకు నిర్మాత సూర్య దేవర నాగవంశీ అదిరిపోయే న్యూస్ చెప్పాడు.నేను గౌతమ్‌ను చాలా హింస పెట్టాక.. ఫైనల్‌గా టైటిల్‌ను లాక్ చేశాం….వీడీ 12 టైటిల్‌ త్వరలోనే వెల్లడిస్తామని నాగవంశీ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. Mee andari abuses tarvathaa nenu Gowtam ni chala himsa pettaka 😝😝Finally we’ve locked the title!! 🤓#VD12 title will be out very soon!!Watchout…

Read More

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ మేరకు కేంద్రం రూ. 12వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు.గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలసి పోటీ చేసి అద్భుత విజయం సాధించింది.జగన్ ప్రభుత్వాన్ని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ నుండి 21మంది కూటమి సభ్యులు ఎంపీలుగా విజయం సాధించారు.ఈ విజయంతో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా కూటమి ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలోనే ఏపీకి కేంద్రం కొత్త పథకాల మంజూరు,నిధుల కేటాయింపునకు అధిక ప్రాదాన్యం ఇస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే రూ. 12 వేల కోట్లను మంజూరు చేసింది.తాజాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌…

Read More

రెబెల్ స్టార్ ప్రభాస్‌ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వీ నటిస్తోంది.అయితే ప్రభాస్ ఇంటి నుండి మంచి రుచికరమైన భోజనం సెట్స్‌కు వస్తుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ప్రభాస్ తన ఆతిథ్యంతో ఊపిరాడకుండా చేస్తాడని సినీ ప్రముఖులు చాలామంది అనేక సందర్భాల్లో చెప్పారు.తాజాగా ప్రభాస్‌ ఇంటి విందుకు ఫిదా అయినా వారి జాబితాలో ఫౌజీ కథానాయకి ఇమాన్వీ కూడా చేరింది.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది. సెట్స్‌లో బ్రేక్ సమయంలో ప్రభాస్‌ కిచెన్‌లో ఇంటి నుండి వచ్చిన భోజనాన్ని ఇమాన్వీ రుచి చూసింది.ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియజేస్తూ…ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో గ్లింప్స్ షేర్ చేసింది.రుచికరమైన యమ్మీ యమ్మీ భోజనం రుచి చూపించిన ప్రభాస్‌కు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.అయితే ఈ చిత్రం సీతారామం, రాధేశ్యామ్ లైన్‌లో వింటేజ్‌…

Read More

ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. ఇటీవల కుంభమేళాలో జరిగిన తొక్కసలాట ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గతేడాది చివరిలో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రసంగంలో కీలక అంశాలు: 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దిగువ నుండి పైకి తీసుకొచ్చాం. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలను అమలు చేస్తున్నాం. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్ లో ప్రాధాన్యత. ఆయుష్మాన్ భారత్ తో 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుంది. గత ప్రభుత్వాల కంటే ఎన్టీయే ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పని చేస్తోంది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో ఆధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశాం.…

Read More

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తూ మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలుస్తుందని, మా నాయకుడు జగన్ మళ్ళీ సీఎం అవుతారని, అప్పుడు టీడీపీ కార్యకర్తలు తాట తీస్తామని అన్నారు.వైసీపీ నేతలు,కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు అని చెప్పారు.సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టిన వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం కార్యకర్తల పని పడతామని తీవ్రంగా హెచ్చరించారు.మాపై దాడులు చేసిన వారిపై ఖచ్చితంగా ప్రతి దాడులు చేస్తామని అన్నారు.మా తడాఖా ఏంటో రుచి చూస్తారని మండిపడ్డారు.ఇకపై జగన్ కు ప్రతి కార్యకర్త అండగా ఉంటామని జగన్ చెప్పారని తెలిపారు.ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

Read More

ఈరోజు నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. రేపు కేంద్ర బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఇక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. మహాలక్ష్మి మనకు సిద్ది, బుద్ధిని ప్రసాదిస్తుందని పేదలు సామాన్యులపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వరుసగా మూడో సారి ఎన్డీయేకు ప్రజలు విజయాన్ని అందించారని తెలిపారు. మరోసారి పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్ విశ్వాసం నింపుతుంది న్నారు. భారత్ అభివృద్ధే లక్ష్యంగా మిషన్ మోడ్ తో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇన్నోవేషన్, ఇన్క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. నూతన విధానాల పైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నాం. పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ…

Read More

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో సంబంధిత జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. కృష్ణా మరియు గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా, తూర్పు గోదావరి – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇంఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.ఏడు నెలల్లోనే రూ.6,33,568 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం తద్వారా 4,10,125 మంది యువత రానున్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించాలని సూచించారు.…

Read More

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం ఫిబ్రవరి 16న చారిత్రాత్మక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదికగా జరగనుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ వచ్చే నెల 19న ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీని కోసం స్టేడియాలను ఆధునీకరించింది. ఇక వస్తున్న వార్తలను బట్టి షెడ్యూల్ ప్రకారం ఆధునికీకరించిన గడాఫీ స్టేడియాన్ని ఫిబ్రవరి 7న పీసీబీ ప్రారంభించనుంది. దీనికి పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదే నెల 11న కరాచిలో జాతీయ స్టేడియాన్ని ఆరంభిస్తారు. ఆ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశాన్ని ఈ సారి నిర్వహించడం లేదని తెలిసింది. టోర్నీకి ముందు ప్రధాన జట్లు ఇతర మ్యాచ్లతో తీరికలేకుండా ఉండటమే ఇందుకు కారణగా తెలుస్తోంది.

Read More