Author: admin

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ థాయ్ లాండ్ మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో 21-19, 21-15 తో హాంకాంగ్ కు చెందిన జేసన్ పై విజయం సాధించాడు. మరో భారత షట్లర్ సుబ్రహ్మణ్యన్ 9-21, 21-10, 21-17 తో మూడో సీడ్ ఇండోనేషియా కు చెందిన చికాగో వార్డోయో పై గెలిచి క్వార్టర్స్ చేరాడు. పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ రాయ్ -సాయి ప్రతీక్ 14-21, 21-10, 21-9 తో థాయ్ లాండ్ కు చెందిన విచరపోంగ్-నరుసెత్ జోడీ పై నెగ్గి క్వార్టర్స్ చేరారు.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం నేడు జరిగింది. ఒప్పందాలపై ఇండస్ట్రీస్ యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు వివరించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించి వేగంగా రిజల్ట్స్ చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని సీఎస్ కు తెలిపారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుండి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు సాధించేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు టి జి భరత్, కె అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవి కుమార్, పి.…

Read More

రేపటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనపై గళం విప్పాలని కోరుతూ ఏపీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని షర్మిల ప్రశ్నించారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ గారు..రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూటమి ఎంపీలు తమ గళం విప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు హోదా ఇస్తామని ఇచ్చిన మాట మీద ప్రధాని మోడీ గారిని నిలదీయాలని పేర్కొన్నారు. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని హెచ్చరించారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించాయి. అనంతరం ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు చివరికి లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 76,759 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.64గా కొనసాగుతోంది. సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, హెచ్.యూ.ఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భారత మ‌హిళా క్రికెటర్ దీప్తి శర్మను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియ‌మించింది. ఒక క్రికెటర్‌గా దేశానికి ఆమె చేసిన సేవ‌ను గుర్తించి ఈనెల 27న యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో డీఎస్‌పీగా నియమిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ విష‌యాన్ని దీప్తి త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు త‌గిన‌ గౌరవం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మైలురాయిని సాధించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది. డీఎస్‌పీ పోస్టుతో నా చిన్న‌నాటి క‌ల నెర‌వేరింది. అన్ని విధాల నాకు తోడ్పాటు అందించిన‌ నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి అచంచలమైన మద్దతు, ఆశీర్వాదాలు నేడు న‌న్ను ఈ స్థాయిలో నిల‌బెట్టాయి. ఈ అవకాశం కల్పించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు . డీఎస్‌పీగా నా విధులను చిత్తశుద్ధితో నిర్వ‌హిస్తాన‌ని ఆమె పేర్కొన్నారు.

Read More

వక్ఫ్ సవరణ బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటుకు తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. రేపటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల లిస్ట్ ను కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షాలకు అందించింది. ఈ లిస్టులో వక్ఫ్ బిల్లు కూడా ఉంది. ఈ బిల్లుతో పాటు 16 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి ఇది వరకే కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read More

రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు గాయపడిన వారికీ సాయం చేయడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు.గాయపడిన వారిని కాపాడాలని చూస్తే పోలీసులు,కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏమో అని భయం,మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతలా అవుతుందని వెనకాడుతుంటారు.అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేసి తమ బాధ్యత అంతేనని అనుకుంటారు.ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూ ఉన్నాం.అయితే ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసుల్లో ఇరుక్కునే ఇబ్బంది ఉండదని పోలీసులు చెప్పారు.ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడితే రూ.25 వేల బహుమతి అందుకోవచ్చని తెలిపారు. ‘గుడ్ సమారిటన్ స్కీం’ వివరాలు కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్ స్కీం’ తెచ్చిందని వెల్లడించారు.రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చనిపోతున్న వారిలో చాలామంది సకాలంలో వైద్య సేవలు అందితే బతికేవారేనని వైద్యులు చెబుతున్నారు.బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు తీసుకురావాలని సూచిస్తున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం గుడ్ సమారిటన్ పథకం తీసుకొచ్చింది.క్షతగాత్రులను తక్షణం…

Read More

దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. పౌర సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం మరింత పెంపొందించడం కోసం రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. తొలిదశలో 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఈ రోజు లాంఛనంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించారు.దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రెండో విడతలో 360 సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ సౌకర్యం తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నయినా మెసేజ్ ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం,…

Read More

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్‌తో మెటా తన సంబంధాలు మెరుగుపరుచుకొనే పనిలో పడింది. క్యాపిటల్‌ భవనంపై దాడి సమయంలో ఆయన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.అప్పట్లో ట్రంప్‌ ఆ సంస్థపై దావా వేశారు.తాజాగా 25 మిలియన్‌ డాలర్లకు(రూ.216 కోట్లు) ఆ సంస్థ సెటిల్‌మెంట్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.2021లో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విటర్‌,ఫేస్‌బుక్‌,యూట్యూబ్‌,ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై నిషేధం విధించారు. అనంతరం 2023లో వాటిని పునరుద్ధరించారు.ఈ మేరకు ట్రంప్ గతంలో మెటా సంస్థపై దావా వేశారు.దీన్ని సెటిల్‌ చేసుకునేందుకు తాజాగా మెటా సిద్ధమైంది.అందులోభాగంగా 25 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది.సంస్థలో పలువురు వ్యక్తులు ఓ వార్తా సంస్థతో ఈ విషయాన్ని వెల్లడించారు.మెటా అందించే సొమ్ములో 22 మిలియన్‌ డాలర్లు ప్రెసిడెన్షియల్‌ లైబ్రెరీకి,మిగిలినవి కేసు ఖర్చులకు ఉపయోగించనున్నారు.

Read More

కేర‌ళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఇటీవ‌ల ఓ హెచ్చరిక చేశారు.ఈ మేరకు కాస్మిటిక్ ఉత్పత్తుల్లో అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే మెర్క్యూరీ స్థాయి ఎక్కువ‌గా ఉన్న ఉత్పత్తుల్ని కేర‌ళ‌లో అమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు.కాస్మటిక్ ఉత్పత్తులను లైసెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయా లేదా అన్న విష‌యాన్ని చెక్ చేసుకోవాల‌ని ఆమె త‌న ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు.ఇలాంటి ప్రోడ‌క్ట్‌ను కొనేముందు ఉత్పత్తిదారుడి అడ్రస్‌ను తెలుసుకోవాల‌ని కోరారు.కేర‌ళ రాష్ట్రవ్యాప్తంగా ఆప‌రేష‌న్ సౌంద‌ర్యను మొద‌లుపెట్టామని తెలిపారు. కాస్మటిక్ ఉత్పత్తుల్లో ప్రమాదక‌ర కెమిక‌ల్స్ కోసం అన్వేషిస్తున్నారు.ఫేక్ ఉత్పత్తుల్ని సీజ్ చేస్తున్నారు.2023లో తొలిసారి ఈ ఆప‌రేష‌న్ మొద‌లైంది.రెండు ద‌శ‌ల్లో దీన్ని చేప‌ట్టారు.ఆ సమయంలో 7 ల‌క్షల ఖ‌రీదైన న‌కిలీ కాస్మటిక్ ఉత్పత్తుల్ని సీజ్ చేశారు.ఇలాంటి ప్రమాదక‌ర ర‌సాయ‌నాల వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్యలు ఉత్పన్నం అయ్యే ఛాన్సు ఉన్నట్లు,కొన్ని సంద‌ర్భాల్లో అవ‌య‌వాలు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.ఫిర్యాదుల న‌మోదు కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్ జారీ చేశారు.

Read More