Author: admin

గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకు అధికారం రావడానికి ప్రతిపక్ష కాంగ్రెస్సే కారణమంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా ‘బంగ్లార్‌ నిర్బచోన్‌ ఒ అమ్రా’ పేరుతో తాను రాసిన మూడు పుస్తకాలను ఆమె విడుదల చేశారు.ఆ పుస్తకంలో 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేశారు. కాగా బీజేపీ గెలుపునకు కాంగ్రెస్‌ కారణమని అందులో మమతా పేర్కొన్నారు.కేంద్రంలోని ఎన్డీయే ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పడ్డాయి.అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకుతీసుకెళ్లాయి.అయితే నాయకత్వం కోసం కూటమిలోని అభ్యర్థులు పరస్పరం పోటీకి దిగారు.తృణమూల్‌ కాంగ్రెస్‌ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్‌ వైఫల్యం కారణంగా ఇండియా కూటమికి గెలుపు దక్కకుండా పోయిందని విమర్శలు గుప్పించింది.మెజారిటీ రాకపోయినా బిజేపికుకు అధికారం దక్కిందని ఆమె పుస్తకంలో పేర్కొన్నారు.

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ లో కూడా లాభాలతోనే ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆద్యంతం అదే బాటలో కొనసాగి లాభాలతో ముగిశాయి. ఐటీ, ఆటోమొబైల్ షేర్లు రాణించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 631 పాయింట్లు లాభపడి 76,532 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో 23,163 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.55గా కొనసాగుతోంది. టాటా మోటార్స్, జొమాటో, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతను అదరగొడుతున్నాడు. మంగళవారం ఇంగ్లిష్ జట్టుతో జరిగిన మూడో టీ20లో వరుణ్ 24 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైనప్పటికీ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. అతను ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఒక స్థానం మెరుగై తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లిష్‌ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ 13 స్థానాలు జంప్ చేసి ఆరో ర్యాంకు సాధించాడు. భారత ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్ సింగ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. రవి బిష్ణోయ్‌ ఐదు స్థానాలు దిగజారి 10వ ర్యాంకుకు పడిపోయాడు. అక్షర్ పటేల్ ఐదు స్థానాలు మెరుగై 11వ ర్యాంకు…

Read More

అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ చ‌రిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ప‌ది వేల ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఆ ఘ‌న‌త‌ను అందుకున్న 15వ బ్యాట‌ర్ అయ్యాడు. దీంతో ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చేరాడ‌త‌ను. ఇండియాతో ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు సిరీస్ స‌మ‌యంలో.. స్మిత్ ప‌ది వేల ప‌రుగుల మైలురాయికి ఒక్క ప‌రుగు దూరంలో నిలిచాడు. అయితే ఇవాళ శ్రీలంక‌తో ప్రారంభ‌మైన టెస్టులో ఆ మైలురాయి దాటేశాడు. టెస్టుల్లో ప‌ది వేల ర‌న్స్ చేసిన బ్యాట‌ర్ల‌లో 15వ ప్లేయ‌ర్‌గా నిలిచాడ‌త‌ను. ఆస్ట్రేలియా త‌ర‌పున నాలుగ‌వ బ్యాట‌ర్ అయ్యాడు. గ‌తంలో ప‌ది వేల ర‌న్స్ చేసిన ఆసీస్ బ్యాట‌ర్ల‌లో రికీ పాంటింగ్‌(13,378), అల‌న్ బోర్డ‌ర్‌(11,174), స్టీవ్ వా(10,927) ఉన్నారు. టెస్టుల్లో లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడు. అత‌ను 15,921 ర‌న్స్ చేశాడు.

Read More

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాఖీ… ఇప్పుడు మూడో పెళ్లితో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ఆయనను పెళ్లి చేసుకోబోతున్నానని రాఖీ ప్రకటించింది. తాజాగా తన ప్రియుడి వివరాలను వెల్లడించింది.పాకిస్థానీ నటుడు, పోలీసు అధికారి అయిన డోడి ఖాన్ తో తాను ప్రేమలో ఉన్నానని రాఖీ తెలిపింది. తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని… త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని… తమది ప్రేమ వివాహమని చెప్పింది. తనది భారత్, ఆయనది పాకిస్థాన్ అని… ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపింది.రితేష్ సింగ్ ను రాఖీ తొలి వివాహం చేసుకుంది. ఇద్దరూ బిగ్ బాస్ 15లో కూడా పాల్గొన్నారు. 2022లో బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. అదే సంవత్సరం ఆదిల్ ఖాన్ ను రాఖీ రెండో వివాహం చేసుకుంది. అయితే ఆదిల్ కు…

Read More

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్లతో ఈ మిషన్ ను అమలు చేయనుంది. భారత్ లో ఆఫ్ షోర్ ప్రాంతాల్లో కీలకమైన మినరల్స్ అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ ను చేయనుంది. అరుదుగా లభించే మినరల్స్ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడంతో పాటు ఈ రంగంలో స్వావలంబన దిశగా అడుగులు వేయడమే ఈ మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక సి.హెచ్.వి మొలాసిస్ నుండి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరను రూ.56.28 నుండి రూ.57.97కు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. బి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరకు రసం/చక్కెర/చక్కెర సిరప్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు.

Read More

హిరోషిమా, నాగసాకిపై అణుదాడి జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను జపాన్‌ ఆహ్వానించింది. ఈమేరకు ఆ రెండు నగరాల మేయర్లు సంయుక్తంగా ఓ లేఖను రాశారు. ‘‘ట్రంప్‌ స్వయంగా అణుబాంబు బాధితుల అనుభవాలను తెలుసుకోవాలి. శాంతి కోసం వారు పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోండి. అణ్వాయుధాల అమానవీయతపై అవగాహన పెంచుకోండి. ఈ ఆయుధాల నిషేధం దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అమెరికా 1945వ సంవత్సరం ఆగస్టు 6, 9వ తేదీల్లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణ్వాయుధాలతో దాడులు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ లొంగిపోయింది. హిరోషిమాలో 1,40,000 మంది, నాగసాకిలో 74,000 మంది మరణించారు. నాడు గాయాలతో బయటపడిన వారు కూడా ఆ తర్వాత రేడియేషన్‌ ప్రభావంతో చనిపోయారు. ఈ బాంబు దాడులకు సంబంధించి అమెరికా ఏనాడు క్షమాపణలు చెప్పలేదు. కానీ, 2010లో తొలిసారి అమెరికా…

Read More

బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో వెళ్లి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కోరినట్లు స్పేస్ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. 2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో వారు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా వారిని భూమి పైకి తీసుకువచ్చేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పేస్‌ఎక్స్‌ను కోరారని.. త్వరలో ఆ పని పూర్తి చేస్తామని పేర్కొంటూ మస్క్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు అప్పటినుంచి…

Read More

మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళా లో విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి ప్రయాగ్‌రాజ్‌ కు వెళ్లడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లను నిలిపివేసినట్లు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు. అధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సాధారణ రైళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాట్‌కు భక్తులు వస్తున్న వాహనాలు, బస్సులను ప్రయాగ్‌రాజ్‌ సరిహద్దుల్లో 24 గంటల పాటు నిలిపివేశామన్నారు. కుంభమేళా ప్రాంతంలో ఇప్పటికే పది కోట్ల మంది ప్రజలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తుండడంతో 24 గంటల పాటు ఇతరులను అనుమతించట్లేదని జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర పేర్కొన్నారు. మరోవైపు.. ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్న రైలు సదుపాయాలను ఆపివేయలేదని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్ నుంచి భక్తులను తిరిగి…

Read More

తిరుపతిలో జరిగిన 3160 -డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్‌‌ 41వ వార్షిక సమావేశంలో ఏపీ మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. సామాజిక సేవలకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన రోటరీ క్లబ్ తో తనకు విశేష అనుబంధం ఉందని మంత్రి తెలిపారు. 1905లో షికాగోలో పౌల్ హారిస్ స్థాపించిన రోటరీ క్లబ్ తన సేవలతో అంతర్జాతీయంగా విస్తరించి నేడు మహా వృక్షమైందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రోటరీ క్లబ్ చేసిన, చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి. విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, విలువల పెంపు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ.. ఇలా ఎన్నో రకాల సేవలందిస్తున్న రోటరీ క్లబ్ సేవాభావం అద్వితీయమైనదని కొనియాడారు. వివిధ రంగాల ద్వారా ప్రజలకు సేవ చేయడమే కాకుండా, రోటరీ క్లబ్ ద్వారా సామాజిక రంగం పురోగతికి చేయందిస్తున్న క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నో స్కూళ్లు, హాస్పిటల్స్ తదితర వాటికి స్థలాలిచ్చిన…

Read More