27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1. రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా అడిషనల్ డీజీపీ (గ్రేహౌండ్స్, ఆక్టోపస్) రాజీవ్ కుమార్ మీనాను బదిలీ చేశారు. 2. లా అండ్ ఆర్డర్ ఐజీగా ఉన్న సీహెచ్. శ్రీకాంత్ ఐజీ (ఆపరేషన్స్)గా నియామకం. టెక్నికల్ సర్వీసెసస్ ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. 3. ఎన్.మధుసూదనరెడ్డిని అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బదిలీ. 4. ఏసీబీ ఐజీ/డైరెక్టర్ గా ఆర్.జయలక్ష్మిని నియమించారు. 5. ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా ఐజీ జి.పాలరాజును నియమించారు. 6. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు 7. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ. 8. ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీగా బి.రాజకుమారి. 9. సీఐడీ ఎస్పీగా శ్రీధర్ ను నియమించారు. 10. సీఐడీ, ఎస్…
Author: admin
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.నేడు గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.దీంతో జనవరి 19 రాత్రి నుంచి పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 14కి చేరిందని పోలీసులు వెల్లడించారు.మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు.ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు,ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా…ఆయన పదవీకాలం ఫలప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. Congratulations my dear friend President @realDonaldTrump on your historic inauguration as the 47th President of the United States! I look forward to working closely together once again, to benefit both our countries, and to shape a better future for the world. Best wishes for a…— Narendra Modi (@narendramodi) January 20, 2025
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ ప్రత్యేకమైన బటన్‌ను ఏర్పాటుచేసుకున్నారు.అదే డైట్ కోక్ బటన్.ట్రంప్ శీతలపానీయం కోకాకోలా ప్రియుడు.ఆయన రోజుకు 12 డైట్ కోక్‌లను అలవోకగా తాగడం అలవాటు అని ఈ విషయాన్ని గతంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.అయితే 2016లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో ఈ బటన్‌ను ఏర్పాటుచేశారు.ఆయనకు అవసరమైనప్పుడు దానిని నొక్కితే…డైట్ కోక్ తెచ్చి ఇచ్చేవారు.అయితే 2021 ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ బటన్‌ను అక్కడినుంచి తొలగించారు. ఈనేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్..తన కోక్ బటన్‌ను తిరిగి ఏర్పాటుచేయించుకున్నారు.నేను దానిని నొక్కిన ప్రతిసారీ అందరూ కొంచెం భయపడతారు’ అని ట్రంప్ గతంలో జోక్ చేశారు.వాస్తవానికి ట్రంప్ మంచినీళ్లు తాగడం ఎప్పుడూ చూడలేదని యూఎఫ్‌సీ సీఈవో డానా వైట్ ఓ సందర్భంలో…
ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ (ఎస్‌ఈఏ)’ కోటా కింద జేఈఈలో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఐదుగురు విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన లాన్ టెన్నిస్ క్రీడాకారుడు వంగల వేదవచన్‌రెడ్డి బీటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్)లో సీటు పొందారు. మిగిలిన నలుగురు విద్యార్థుల్లో మహారాష్ట్ర నుంచి కుమారి అరోహి భావే (వాలీబాల్ క్రీడాకారిణి), పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్యమన్ మండల్ (వాటర్ పోలో, స్విమ్మింగ్), దిల్లీకి చెందిన నందినీ జైన్ (స్క్వాష్ క్రీడాకారిణి), ప్రభవ్ గుప్తా (టేబుల్ టెన్నిస్) ఉన్నారు.ప్రవేశం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్‌ఎల్) లేదా జేఈఈ (అడ్వాన్స్‌డ్)లో కేటగిరీ వారీగా ర్యాంకుల జాబితాలో స్థానం పొందాలి. అదేవిధంగా గత నాలుగేళ్లలో ఏదైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కనీసం ఒక పతకమైనా సాధించి ఉండాలి.
‘బ్లాక్ ఇంక్’ (నలుపు రంగు సిరా) తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావనే పుకార్లపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కొత్త సంవత్సరం కొత్త నిబంధనలు ఆర్బీఐ తీసుకొచ్చిందని అంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట పడింది. ఈ వార్తను ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించినట్లు సర్క్యులేట్ చేయడంతో సామాన్యులు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో దీనిపై పీఐబీ ప్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఆర్బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం అంతా సరైనది కాదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా తెలిపింది. It is being claimed in social media posts that @RBI has issued new rules prohibiting the use of black ink on…
ఎంపీ ప్రియ సరోజ్ భారత క్రికెటర్ రింకు సింగ్ పెళ్లికి సంబంధించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల నుండి స్పష్టత వచ్చేసింది. వారిరువురూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రియ తండ్రి ఎమ్మెల్యే తుఫాని సరోజ్ స్పష్టం చేశారు. ప్రియతో రింకు నిశ్చితార్థం జరిగిందని ఇటీవల వచ్చిన వార్తలను ఖండించిన ఆయన.. రింకూ కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతున్నాయని మాత్రమే అప్పుడు తెలిపారు. అయితే తాజాగా ఈ ఇద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. రింకూ, ప్రియకు ఏడాది ముందు నుంచే పరిచయం ఉంది. వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని కానీ పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూశారు. వీళ్ల వివాహానికి రెండు కుటుంబాలు ఒప్పుకొన్నాయని తెలిపారు.
దావోస్ లోని బెల్వేడార్ లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సమావేశమయ్యారు. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్, భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటుచేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీమిట్టల్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై లక్ష్మీ మిట్టల్ సానుకూలంగా స్పందించారని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ఈ భేటీలో ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఏపీ ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ సారధిగా రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ మెగా వేలంలో రూ.27 కోట్లతో పంత్ ను లక్నో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు అంతకుముందు పంత్ ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్ గా ఆటగాడిగా ఆకట్టుకున్నాడు. 2024 సీజన్లో లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడు రాబోయే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ కు ఆడనున్నాడు. “లక్నోకు తొలి టైటిల్ అందించేందుకు 200 శాతం కృషి చేస్తా. కొత్త ఉత్తేజంతో తరపున ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ లో ఆడి తద్వారా మునుపటి ఫాం లోకి రావడానికి సమాయత్తం అవుతున్నారు. ఫిట్ నెస్ సమస్యలు ఉంటే తప్ప కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశవాళీలో ఆడాలని బీసీసీఐ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఇక దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీకి విరాట్ ముంబయికి రోహిత్ ప్రాతినిధ్యం వహించనున్నారు. దశాబ్దానికి పైగా సమయం తర్వాత విరాట్ ఈ టోర్నీలో ఆడబోతున్నాడు. తాను సెలక్షన్ కు అందుబాటులో ఉంటున్నట్లు అతడు దిల్లీ క్రికెట్ సంఘానికి తాజాగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే మెడనొప్పి కారణంగా ఈనెల 23న సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడే మ్యాచ్ కు కోహ్లి ఆడట్లేదు. జనవరి 30న రైల్వేస్తో పోరులో అతడు బరిలో దిగే అవకాశాలున్నాయి. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ కూడా ఆడుతున్నాడు. మరోవైపు ఈనెల…
