బాలీవుడ్ నటి కంగన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. జనవరి 17 న ఇది విడుదలైంది. దీనిపై పంజాబ్ లో బ్యాన్ విధించడం గురించి కంగన తాజాగా స్పందించారు.మా చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.మా చిత్రంపై మీరు ఎంతో ప్రేమను కనబరుస్తున్నారు.మీ ఆదరణ చూసి మాకు మాటలు రావడం లేదు.అయితే, పంజాబ్లో మా సినిమాపై నిషేధం విధించడం నన్ను ఒకింత బాధకు గురి చేసింది.ఒకానొక సమయంలో నా చిత్రాలు ఆ రాష్ట్రంలో బాగా ఆడేవి.కానీ ఇప్పుడు నా సినిమా అక్కడ విడుదల కూడా కాలేదు.కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ రకమైన విద్వేషాలు ఏర్పడుతున్నాయి.నాలోని దేశభక్తికి నిదర్శనంగా దీనిని రూపొందించా.ఇది మనల్ని ఏకం చేస్తుందా? లేదా? అనే విషయాన్ని సినిమా చూసి మీరే తెలుసుకోండి” అని కంగన చెప్పారు.
Author: admin
బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న యాక్షన్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టీజర్ విడుదల చేసింది.’రాత్రి నాకో కల వచ్చింది’ అంటూ జయసుధ చెప్పే డైలాగ్తో ప్రారంభమైన టీజర్ ఆసక్తిగా సాగింది.’ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించేందుకు ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఈ శ్రీనుగాడు ఉన్నాడు’ అంటూ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ గా కనిపించారు.ముగ్గురు సోదరుల అనుబంధం ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది.ఈ చిత్రంలో అదితి శంకర్, దివ్యా పిళ్లె, ఆనంది హీరోయిన్లుగా సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. https://youtu.be/cQGjh-kJTyc?si=yPKWLdI6sFZmLgOw
2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపులో పకడ్బందీగా ముందుకు వెళ్లినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. 29,39,432 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలిగినట్లు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రైతుల నుండి సేకరించిన 24 గం.లోపే రూ.5,878.49 కోట్లు చెల్లింపులు చేయడంతో 5,99,952 మంది రైతుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. గత ప్రభుత్వం వరి రైతులను ఎంతగా ఇబ్బందుల పాల్జేసిందో, ధాన్యం సేకరించినా డబ్బులు చెల్లించకుండా బకాయిలుపెట్టిందో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఆ రూ.1674 కోట్లు బకాయిలు చెల్లించిందని పేర్కొన్నారు. ఈమేరకు గణాంకాలతో కూడిన గ్రాఫ్ ను పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సౌభాగ్యం కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని స్పష్టం చేశారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపులో పకడ్బందీగా ముందుకు వెళ్లాము.…
రిషబ్ షెట్టి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార’ చిత్రం చిక్కుల్లో చిక్కుకుంది.ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు.అయితే అడవిలో షూటింగ్ చేయడం వలన అటవీ ప్రాంతం నాశనం అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ షూటింగ్‌కి గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో ప్రభుత్వం అనుమతినివ్వగా..చిత్రబృందం మాత్రం అక్రమంగా అడవిలోకి వెళ్లి షూట్ చేస్తుందని తెలిపారు.అంతేగాకుండా.. ఈ సినిమా షూటింగ్ కోసం పేలుడు పదార్థాలు ఉపయోగిస్తున్నారని దీనివలన అడవిలో ఉన్న పక్షులతో పాటు మూగజీవాలు భయాందోళనకి గురవతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.అలాగే ఈ షూటింగ్ వలన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.అయితే ఈ విషయంలోనే గ్రామస్థులకు చిత్రబృందంకి గొడవ జరుగుగా..గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్ర బృందం దాడి చేసిందని తెలిపారు.దీంతో…
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయింది. ముందుగా జ్యూరిచ్ హిల్టన్ హోటల్ లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనుకూలంగా ఉందని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘జాబ్స్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ, యూరప్ లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ఈసందర్భంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో ఉన్న విస్తృత అవకాశాలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు.
మెగాస్టార్ చిరంజీవి..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది.తన నటనతో అంచలంచలుగా ఎదిగి తెలుగులో నెం1 హీరో అయ్యాడు.అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓటమి పాలయ్యాడు.రాజకీయ జీవితం నుండి బయటకు వచ్చిన చిరు సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఖైదీ 150 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు.అనంతరం ‘సైరా నరసింహరెడ్డి’, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళ శంకర్ సినిమాలతో అలరించాడు.అయితే ఈ సినిమాలలో కొన్ని విజయం అందుకున్న కూడా మెగా ఫ్యాన్స్ అనుకున్నంతా రేంజ్‌లో హిట్టు అవ్వకపోవడం..చిరంజీవికి సరైన మూవీ పడకపోవడం అభిమానులకు తీవ్రంగా నిరాశ పరిచింది.అయితే చిరుకి ఒక సాలిడ్ ఎప్పుడు పడుతుందా…మా ఆకలి ఎప్పుడు తీరుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా కుర్ర దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నా బాస్…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది.సీఎం మమతా బెనర్జీ దీనిపై స్పందించారు.సంజయ్ రాయ్‌కు కోర్టు విధించిన శిక్ష పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు.నేను సంతృప్తి చెందలేదు.మనమంతా మరణశిక్షను డిమాండ్ చేశాం.కానీ కోర్టు మరణించే వరకు జీవిత ఖైదు విధించింది అని అన్నారు. కాగా గత ఏడాది ఆగస్ట్ 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా తీసుకున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.ఒకవేళ కోల్‌కతా పోలీసులు ఈ కేసు దర్యాప్తును కొనసాగించి ఉంటే నిందితుడికి మరణశిక్ష నిర్దారించేవారని అన్నారు.మరోవైపు సీబీఐ దర్యాప్తును మమతా బెనర్జీ ప్రశ్నించారు.వారు (సీబీఐ) దర్యాప్తు ఎలా నిర్వహించారో మాకు తెలియదు.రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసిన ఇలాంటి అనేక కేసుల్లో మరణశిక్ష విధించారు.ఈ శిక్ష…
ఇండోనేసియా ప్రజలను మౌంట్ ఇబు అగ్నిపర్వతం వణికిస్తోంది.ఒక్క జనవరి నెలలోనే వెయ్యి సార్లు విస్ఫోటం చెందిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.నార్త్ మలుకు ప్రావిన్స్‌లోని హల్మహేరా ద్వీపంలోని మౌంట్ ఇబు జనవరి నుంచి విస్ఫోటం చెందుతూనే ఉంది.ఇప్పటివరకు దానినుంచి గాలిలోకి 0.3 కి.మీ. నుండి 4 కి.మీ. వరకు బూడిద ఎగసిపడింది.తాజాగా ఆదివారం 1.5 కి.మీ. మేర పైవరకు బూడిద కనిపించింది.మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు శబ్దం వినిపించిందని ఇండోనేసియా జియోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక ఒక్క ఆదివారమే 17సార్లు అగ్నిపర్వతం బద్ధలైందని తెలిపింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఆరు గ్రామాల్లోని మూడు వేల మంది గ్రామస్థులు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే పలువురు గ్రామస్థులు అధికారుల హెచ్చరికలను పాటించేందుకు నిరాకరిస్తున్నారు.తమ పంటలను…
చైనాలో ఇటీవల ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి 35 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడికి మరణశిక్ష పడగా.. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడికి శిక్ష అమలు చేశారు. మరో కేసులో ఓ యువకుడికీ ఇదే విధంగా మరణశిక్ష అమలు చేసినట్లు చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది.చైనాకు చెందిన ఫాన్ వీకియూ (62) అనే వ్యక్తి గతేడాది నవంబర్ 11న ఝుహాయ్ నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయట నిర్లక్ష్యంగా కారు నడిపారు. అక్కడ వ్యాయామం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన ఘటనలో 35 మంది మరణించగా..మరో 43 మంది గాయపడ్డారు. అనంతరం కారులో తనను తాను కత్తితో పొడుచుకుని ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు.కోమాలోకి వెళ్లిన అతడిని ఆసుపత్రిలో చేర్చారు.ఇటీవలే విడాకులు తీసుకున్నాడని, భార్యతో జరిగిన ఆస్తి పంపకంలో అసంతృప్తికి గురవడంతోనే అతడు ఈ ఘోరానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 454 పాయింట్లు లాభపడి 77,073 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 23,344 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.54గా కొనసాగుతోంది. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాలతో ముగిశాయి.
