Author: admin

బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో యువతి గ్రీష్మ (24) కు ఉరిశిక్షను ఖరారు చేసింది.కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపింది.ఆమెకు సహకరించిన బంధువుకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.2022లో ఈ ఘటన చోటుచేసుకోగా.. గ్రీష్మను దోషిగా తేల్చిన కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేసింది.

Read More

ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ అదరగొట్టింది. మూవింగ్ మోటార్ బైక్ పై హ్యూమన్ పిరమిడ్ తో ప్రపంచ రికార్డు సృష్టించింది . దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో డేర్ డెవిల్స్ ఈ ఫీట్ సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు.7 మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్యపథ్ లోని విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు. . తాజా ఫీట్తో డేర్హెవిల్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో సహా పలు ప్రపంచ రికార్డులు సాధించింది. 1935 లో ప్రారంభమైన డేర్ డెవిల్స్ అప్పటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1600 సార్లు మోటార్ బైక్స్ పై ప్రదర్శనలు ఇచ్చింది. రిపబ్లిక్ డే పరేడ్, ఆర్మీ పరేడ్ ఇలా…

Read More

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీకర్ హాస్పిటల్ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు కోల్ కతా లోని సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. అతడికి జీవితఖైదును విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని పేర్కొంది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించాడు. గతఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్ కతా పోలీసుల నుండి సీబీఐ తీసుకుని విచారించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కోర్టుకు…

Read More

లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై పరువునష్టం కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్ పై క్రిమినల్ విచారణను నిలిపివేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. బీజేపీ కార్యకర్త నవీన్ ఝా రాహుల్ పై వేసిన పరువునష్టం కేసును కొట్టివేసింది. రాహుల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

Read More

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు, జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహాన్ నాయుడు మంత్రులు మరియు అధికారుల బృందానికి జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ పర్యటన కోసం జ్యూరిచ్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఏపీ సిఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇక ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.

Read More

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలపూజ,మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. Lదీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు.ఈ సీజన్‌లో 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రెండు నెలల పాటు జరిగే మండల-మకర విళక్కు వార్షిక పూజల కోసం నవంబర్‌ 15న అయ్యప్ప ఆలయాన్ని పూజారులు తెరిచారు. మండల పూజ అనంతరం డిసెంబర్‌ 26న గుడిని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. నాలుగు రోజుల విరామం తర్వాత డిసెంబర్‌ 30న సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు.ఈ సీజన్‌లో అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు.రోజుకు లక్షలాది మంది భక్తులు…

Read More

సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూశారు.చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన విజయ్‌ రంగరాజును చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు నేడు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 1994లో భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌ రంగరాజు తెలుగు, తమిళ సినిమాల్లో విలన్‌, సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్‌ రంగరాజు అసలు పేరు ఉదయ రాజ్‌కుమార్‌. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ‘వియత్నాం కాలనీ’ అనే మలయాళ సినిమాతో సినీరంగంలోకి అరంగేట్రం చేశారు.ఆ చిత్రం విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు అందుకున్నారు. ఆ సమయంలోనే తెలుగులో ‘భైరవద్వీపం’లో విలన్‌గా నటించే అవకాశం వచ్చింది.ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఇండస్ట్రీలో అప్పటికే ఉదయ రంగరాజు అనే నటుడు ఉండడంతో తన పేరును విజయ రంగరాజుగా మార్చుకున్నారు.

Read More

సుప్రీంకోర్టు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. గతంలో విచారించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం నుంచి… జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనానికి రిజిస్ట్రీ మార్చింది. మరోవైపు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం ముందు రఘురామ, జగన్‌, సీబీఐ తరఫున వాదనలు జరిగాయి. గత 12 ఏళ్లుగా ట్రయల్‌ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌ కూడా డిస్పోజ్‌ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో సీబీఐ, నిందితులు కుమ్మక్కయారని పేర్కొన్నారు. డిశ్ఛార్జ్‌ పిటిషన్లపై వాదనలు విని.. వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే…

Read More

ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీగా ప్రేక్షకాదరణ ఉన్న ఈ షో వివిధ రాష్ట్రాల్లో పలు భాషల్లో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ఆయా భాషలలో చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు దీనిని హోస్ట్ గా చేస్తున్నారు. ‘బిగ్ బాస్ కన్నడ’కు కన్నడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ గా ఉన్నొరు. దాదాపు 11 సీజన్ల నుండి హోస్ట్ గా అలరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేయనని మరోసారి తెలిపారు. రానున్న గ్రాండ్ ఫినాలే తర్వాత తాను ఈ కార్యక్రమంలో హోస్ట్ గా కనిపించనని పేర్కొంటూ తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాదాపు 11 సీజన్ల నుండి ఎంతగానో ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్ బాస్. హోస్ట్ గా…

Read More

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈచిత్రం నుండి తాజాగా అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆయన ఈచిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. మహా శివుని పాత్రలో అక్షయ్ ఉన్న పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఇటీవలే కాజల్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆమె పార్వతి దేవి పాత్రలో కనిపించనున్నారు. ఇక పలు భాషల్లో రూపొందుతున్న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More