దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఇజ్రాయెల్ -ఇరాన్ లో మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ ప్రభావం మన మార్కెట్ల పై కూడా పడింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.07గా కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30లో టీ.సీ.ఎస్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, సన్ ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి.
Author: admin
మురుగ భక్తర్గళ్ మానాడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనిటాల్ పవన్ కళ్యాణ్ ను ఈరోజు కలిసి ఆహ్వానించారు. హిందూ మున్నాని సంస్థ ఈ నెల 22వ తేదీన మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గళ్ మానాడు (సమ్మేళనం)కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని నైనార్ నాగేంద్రన్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. నాగేంద్రన్ తోపాటు బీజేపీ నాయకులతో కూడిన బృందం పవన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా మధురైలో నిర్వహించే మురుగన్ భక్తుల సమ్మేళనానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలియచేశారు. తమిళనాడులో ఆరు ముఖ్య షణ్ముఖ క్షేత్రాలు కొలువైన క్రమంలో అక్కడ చేపడుతున్న ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా, సనాతన ధర్మ పరిరక్షణపరంగా ఎంతో ప్రత్యేకమైనదని, ఈ కార్యక్రమంలో ముఖ్యోపన్యాసం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో…
ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడులతో పశ్చిమాసియా ప్రాంతం మరింత ఉద్రిక్తతకు లోనైంది. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లో నివాసముంటున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడి భారత రాయబార కార్యాలయాలు అలెర్ట్ గా ఉండాలనే సూచనలతో కూడిన అడ్వైజరీలు విడుదల చేశాయి. భారతీయులు అనవసర ప్రయాణాలు చేయవద్దని, పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా.. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా ఎకౌంట్లు అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండాలని అడ్వైజరీలో పేర్కొంది.
మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఈరోజు తెల్లవారుజామున వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. ఈ పరిణామం ప్రాంతీయంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక కేంద్రాలు, సైనిక కమాండ్ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాదాపు 15 అణు వార్‌హెడ్ లకు సరిపడా క్లీన్ చేసిన యురేనియం స్టోర్ చేసిందని, ప్రయోగించగల అణ్వాయుధాన్ని తయారు చేయడానికి కేవలం కొన్ని నెలల దూరంలో ఉందని తెలుస్తోంది . ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. ఇది తమ ఆత్మరక్షణ కోసం తీసుకున్న చర్యగా ఇజ్రాయెల్ భావిస్తోంది.…
‘ఘాజీ’, ”అంతరిక్షం’ , ‘ఐ.బీ.71’, వంటి విభిన్న కథాంశాలున్న సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్ తో ఒక హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. భారతదేశ చరిత్రలో మరిచిపోయిన చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన కథతో రానున్నట్లు సమాచారం. తాజాగా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. కొత్త గెటప్ లో గోపీ చంద్ కనిపించారు. ఇది ఆయనకు 33వ సినిమా. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలుపనున్నారు.
కేవలం స్టార్ హీరోలతో హీరోయిన్ గా మాత్రమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ దూసుకుపోతున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రివాల్వర్ రీటా’ సినిమా చేస్తోంది. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా శరత్ కుమార్, అజయ్ ఘోశ్, సురేశ్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుపుతూ.. సామాజా మాధ్యమాల వేదికగా ఓ వీడియోను పంచుకుంది మూవీ టీమ్. ఇందులో రీటా పాత్రలో కీర్తి సురేష్ గన్ పట్టుకొని సరికొత్తగా కనిపిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో గన్ చేతపట్టాల్సి వచ్చిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సుధాన్ సుందరం, జగదీశ్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Rita cominggg to you…
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఘటనాస్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేడు పరిశీలించారు. అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నిన్న మధ్యాహ్నం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మినహా 241 మంది మరణించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించిన వారిలో ఉన్నారు. మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలడంతో అందులో ఉన్న 24 మంది మరణించారు. దీంతో మొత్తం ఈ దుర్ఘటనలో 265 మంది మరణించారు. ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ నేడు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆయనతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇతర అధికారులు ఉన్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కు…
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ రెండో రోజు ఆట లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. సౌతాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే కట్టడి చేసి ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రోజు 43-4 ఓవర్ నైట్ స్కోరు తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి 138 పరుగులకే పరిమితమయింది. పాట్ కమ్మిన్స్ 6 వికెట్లతో రాణించాడు. డేవిడ్ బెడింగ్ హామ్ (45), తెంబ బావుమా (36) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా కూడా సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కీలక వికెట్లు కోల్పోయింది. అలెక్స్ కేరీ (43), లబుషేన్ (22) పరుగులు చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 148 పరుగుల వద్ద నిలిచింది. స్టార్క్ (16 నాటౌట్),…
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. లండన్‌లోని గాట్విక్ నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతని సీటు నెంబర్ 11Aగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఆ 40 ఏళ్ల వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. అహ్మదాబాద్‌లోని అసర్వాలో గల సివిల్ ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, 230 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 242 మందితో గురువారం…
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మృతిని అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ఆయనతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. ఈ ప్రమాదం ఈరోజు మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రిమ్‌లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే మేఘని నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఇది ఒక నివాస ప్రాంతం కాగా, అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై నేరుగా విమానం పడినట్లు అధికారులు తెలిపారు. విజయ్ రుపానీ గుజరాత్ కి 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956 ఆగస్ట్ 2న విజయ్ రుపానీ జన్మించారు. బీజేపీలో సీనియర్ నేత. రెండుసార్లు సీఎంగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకు సుమారు ఐదేళ్ల పాటు…
