మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “మార్కో”. మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇటీవల తెలుగు లో విడుదల అయింది. సినిమా చాలా హింసాత్మకంగా ఉందంటూ వస్తున్న వార్తలపై హీరో స్పందించారు.అందరూ చదువుకున్న వారే…అందరికీ తెలుసు…ఇది కేవలం సినిమా మాత్రమే.ప్రేక్షకులకు వినోదం అందించడానికి దీనిని తెరకెక్కించాం.ఎదుటి వాళ్ళని హత్య చేయమని మా సినిమా ఏమాత్రం ప్రేరేపించదు అని ఆయన అన్నారు.మలయాళం లోనే ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకుల అంచనా.
Author: admin
పని లేకుండా ఉన్న వారికి ఉచితాల పేరుతో పంచడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులుంటాయిగానీ…జిల్లా న్యాయ వ్యవస్థల్లోని జడ్జీలకు జీతాలు,పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డువస్తాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఎన్నికలు రాగానే పథకాలను ప్రకటించి కచ్చితమైన సొమ్మును పంచుతారు.ఢిల్లీ ఇప్పుడు ఒక పార్టీ రూ.2,500 ఇస్తామంటే మరోపార్టీ ఇంకా ఎక్కువ ఇస్తామంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్లితో కూడిన ధర్మాసనం l వ్యాఖ్యానించింది.పదవీ విరమణ చేసిన జడ్జీలకు పెన్షన్లపై 2015లో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.న్యాయాధికారుల జీతాలు,పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోరుకు తెలిపారు.దీనితో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వాల తీరును తప్పు పట్టింది.
భారత బ్యాడ్మింటన్ జోడీ గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీ మొదటి రౌండ్ లో గెలిచి శుభారంభం చేశారు. థాయ్ లాండ్ కు చెందిన అర్న్ నిచా-సుకిత జోడీ పై 21-10, 21-10తో విజయం సాధించి ప్రీ క్వార్టర్ చేరారు. మరోవైపు పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ చైనీస్-తైపీకి చెందిన 14-21, 7-21తో పరాజయం చెంది ఇంటిముఖం పట్టాడు. ఇక మరో ఆటగాడు ప్రణయ్ కు వింత అనుభవం ఎదురైంది. అతని మ్యాచ్ పైకప్పు లీకేజీ కారణంగా వాయిదా పడింది.
విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన పాలిటెక్ ఫెస్ట్ కు ముఖ్యఅతిధిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణల గురించి ఈసందర్భంగా అడిగి తెలుసుకున్నారు. జీవన ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి, ఎదురుదెబ్బలు తగలొచ్చు. కిందపడ్డాక ఎంత త్వరగా లేస్తామనేది ముఖ్యమని విద్యార్థులలో స్పూర్తి నింపారు. అనుకున్నది సాధించేవరకు పట్టువదలొద్దని విద్యార్థులకు పేర్కొన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్ లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారుచేసి, మార్కెట్ లింకేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఆవిష్కరణలు చేసిన వారికి అవార్డులు అందించారు. సీఎం చంద్రబాబు డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు ఎచీవ్ అని చెబుతుంటారు. ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దేరామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం “ఎమర్జెన్సీ”.ఇందులో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది.ఇప్పటికే విడుదల చేసిన ఎమర్జెన్సీ ట్రైలర్‌కు మంచి స్పందన రావడమే కాదు.ఇందిరాగాంధీ పాత్రలో కంగనాకు సినీ అభిమానుల నుండి మంచి మార్కులు పడ్డాయి.ఈ మేరకు కంగనా రనౌత్ ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రెండీ అవతార్‌లో ప్రత్యక్షమైంది. ఎమర్జెన్సీ ప్రమోషన్స్‌లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయింది.బాలీవుడ్ దర్శకనిర్మాత,నటుడు అనుపమ్ ఖేర్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంది.ఈ చిత్రంలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శక-నిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా..శ్రేయాస్ తల్పడే,భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్…
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటనపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు.అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం కెనడాలో చాలా మంది ప్రజలకు ఇష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు.కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి తమ దేశం ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం లేదన్నారు.ఈ విషయం కెనడా ప్రధాని ట్రూడోకు తెలుసు కాబట్టే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు.అమెరికాలో విలీనమైతే దిగుమతి సుంకాలు ఉండవని, పన్నులు తగ్గుతాయన్నారు.అంతేకాకుండా రష్యా,చైనాలకు చెందిన నౌకల నుండి ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ…ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు ఖండించారు.ఈవీఎంలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని,ఈవీఎంల రిగ్గింగ్ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన తెలిపారు.ఈవీఎంల రిగ్గింగ్ సాధ్యం కాదని చెప్పారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఇదే తనకు చివరి ప్రెస్ మీట్ అని సీఈసీ చెప్పారు.ఓటింగ్ శాతంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై కూడా సీఈసీ స్పందించారు.పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు.
కుప్పం ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పం మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయటానికి, రూ.92 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మదర్ డెయిరీ ఫ్రూట్ విజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.105.10 కోట్ల వ్యయంతో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 4800 మందికి ఉపాధి దిశగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబి గానిపల్లి, తంబి గానిపల్లి గ్రామం వద్ద 40 ఎకరాలలో ఏసీఐఐసీ ద్వారా శ్రీజ ప్రొడ్యూసర్ కంపెనీ దాదాపు రూ.233 కోట్లతో 4000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా 8 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సాగు బాగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.…
రేపు,ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు.ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల భాషల్లో ట్వీట్ చేశారు.’విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటానని తెలిపారు.అయితే విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ,కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతం శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటానని పేర్కొన్నారు. రేపు,ఎల్లుండి రెండురోజులు నేను ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాలలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతోపాటు భువనేశ్వర్ లో జరిగే ప్రవాసి భారతీయ దివస్ వేడుకలలో పాల్గొంటాను. https://t.co/nLbE4ZuPE1— Narendra Modi (@narendramodi) January 7, 2025
ఢిల్లీ మొత్తం ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు.జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ..ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో తో పాటుగా తమిళనాడు & యూపి ఉప ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి,తమిళనాడులో ఖాళీగా ఉన్న ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి కూడా ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుందని భారత ప్రధాన…
