బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై తెలంగాణ డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క స్పందించారు.భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతలు ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు.ఆవేశంలో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు.దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ వార్నింగ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు.బీజేపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సినవేనని,అయితే పార్టీ కార్యాలయంపై దాడి సరికాదన్నారు.మరోవైపు బీజేపీ నేతలు ఇలా దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.శాంతిభద్రతల సమస్యలు రాకుండా బీజేపీ సహకరించాలని కోరారు.
Author: admin
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి జరిగిన నేపథ్యంలో సీఏం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని…కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.మేము తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద కూడా తిరగలేరని హెచ్చరించారు.పోలీసులను వెంట తీసుకొచ్చి మరీ బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారని,పోలీసుల తీరు ఇలా ఉంటే ఎలా? అని నిలదీశారు.ఇలాంటి దుర్మార్గాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ మారిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో హింస, భౌతిక దాడులకు తావులేదన్నారు. మేము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ను తగలబెడతాం:- ఎమ్మెల్యే రాజా సింగ్ నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. అటాక్ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ను తగలబెడతామని…
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ ‘జన నాయకుడు’ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్‌లో నమోదు చేసే విధంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ప్రజల ఫిర్యాదులను తీసుకుని, ఏ విధంగా ఆన్‌లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజల నుండి అర్జీలు అందుకుని సమస్యల పరిష్కారం చేసే విధంగా తక్షణం అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
భారీ నష్టాల నుండి కోలుకుని దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ లో లాభాలతో ముగిశాయి. వైరస్ నేపథ్యంలో డీలా పడిన సూచీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రం ప్రకటనతో ఈరోజు ట్రేడింగ్ లో దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 78,199 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 23,707 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.73గా కొనసాగుతోంది. రిలయన్స్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనించాయి.
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతి పండుగ కోసం పల్లెలు సరికొత్త వెలుగులతో తమ వారికి ఆహ్వానం పలుకేందుకు సమాయత్తం అవుతున్నాయి. బతుకు తెరువు కోసం సొంత ఊరిని వదిలి దూరంగా బతుకుతున్న వారు తిరిగి తమవారిని కలుసుకునేందుకు ఆరాటపడుతూ పల్లెబాట పడుతున్నారు. ఇక ఈ పండుగ రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు పెంచింది. 7,200 బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రత్యక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ముందుగా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది.
97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ మరో 2 నెలల్లో జరగనుంది.కాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది.వీటిలో 207 చిత్రాలు ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయని తెలుస్తుంది.ఈ పోటీలో నిలిచిన వాటిలో 6 భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి.వాటిలో కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (హిందీ), సంతోష్ (హిందీ),స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ (మలయాళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ-ఇంగ్లిష్) చిత్రాలు భారత్ నుండి ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచాయి. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన కంగువా ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు సినీ విమర్శకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ల కోసం ఓటింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది.అయితే జనవరి 12న ఈ నామినేషన్…
1998లో విడుదలై భారతీయ గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో మాస్టర్ పీస్ గా నిలిచింది రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ చిత్రం. సత్యగా జేడీ చక్రవర్తి, బికూ మాత్రేగా మనోజ్ బాజ్ పాయ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఊర్మిళ, పరేష్ రావల్, సౌరభ్ శుక్లా, షెఫాలీ షా, ఆదిత్య శ్రీ వాత్సవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ముంబై అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈచిత్రం సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపించింది. ఇక 27 సంవత్సరాల తరువాత ఈచిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈనెల 17న ప్రేక్షకులను మరోసారి అలరించనుంది. ఈమేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు అంగీకారం (ఎంఓయు) కుదుర్చుకున్నాయి. రానున్న 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసనింగ్ వంటి కీలక రంగాల్లో 12వేలమందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశమని మంత్రి లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
మాజీ ఎంపీ,వైసీపీ నాయకుడు నందిగం సురేష్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఈరోజు తీర్పు చెప్పింది.ఏపీలో సంచలనం సృష్టించిన మరియమ్మ హత్య కేసులో పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.బెయిల్ కోసం నందిగం సురేశ్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా…ఆయన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.ఈ మేరకు సురేష్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.మాజీ ఎంపీ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తీర్పు చెబుతూ…తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచారనే కారణంతో ట్రయల్ కోర్టు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని గుర్తుచేసింది.కాగా ట్రయల్ కోర్టు ఆదేశాలలో తాము కల్పించుకోబోమని పేర్కొంటూ..మాజీ ఎంపీ బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరాస్తి రంగం మరింత అభివృద్ధి చెందే విధంగా రెరా నిబంధనలు మరింత సులభతరం చేసేందుకు త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఏపీరెరా (APRERA) పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నేరుగా బిల్డర్లు, డెవలపర్లు, మరియు ప్రజల నుండి మంత్రి వినతులు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, రెరా అధికారులతో కలిసి పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి పలు సూచనలు ఇచ్చారు.
