Author: admin

ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకం అని షర్మిల పేర్కొన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే ఇదంతా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని ఆక్షేపించారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉందని వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు…

Read More

హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికించాయి.ఈరోజు ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.అనంతరం స్వల్ప తీవ్రతతో మరో రెండుసార్లు ప్రకంపణలు వచ్చాయి.కాగా టిబెట్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి,ప్రాణ నష్టం సంభవించింది.నేపాల్‌తోపాటు చైనా,భారత్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.ఈ భూకంపం ధాటికి కనీసం 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నుండి వచ్చిన సమాచారంతో ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదించింది.అదే సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపింది. చైనాకు చెందిన మానిట‌రింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రత‌ను 6.8గా పేర్కొన్నది.టిబెల్ రాజ‌ధాని లాసాకు సుమారు 380 కిలోమీట‌ర్ల దూరంలో భూమి కంపించిన‌ట్లు సమాచారం.టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.కాగా షిజాంగ్‌ ప్రాంతంలోనే మరో రెండుసార్లు భూమి కంపించిందని,వాటి తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.7, 4.9గా నమోదయిందని పేర్కొంది.

Read More

కెనడా ప్రధాన మంత్రి పదవికి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లిబరల్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి కూడా తప్పుకోనున్నట్లు తెలిపారు. తన తదుపరి ప్రధానిని పార్టీ ఎంపికచేసే వరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. గత కొంత కాలంగా తమ పార్టీ నేతల నుండే ట్రూడో వైదొలగాలని డిమాండ్ లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్న విషయాన్ని పార్టీకి, గవర్నర్ కు తెలిపాను. కొత్త నాయకత్వం ఎన్నుకోబడిన అనంతరం రాజీనామా చేస్తా. ఈ ప్రక్రియ కొనసాగించేందుకు మార్చి 24వరకు పార్లమెంటును ప్రొరోగ్ చేస్తున్నానని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కెనడా లా ప్రకారం అధికార పార్టీ నేత రాజీనామా చేస్తే 90 రోజుల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలి.

Read More

ఇటీవల చెత్త ప్రదర్శనతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి దిగజారింది.భారత్ ఆడిన చివరి 8 టెస్టు మ్యాచ్‌ల్లో ఏకంగా 6 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో దీనికి ప్రధాన కారణమైంది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా భారత్ ఘోర ఓటమిని చవిచూసింది.దాదాపు 12 ఏళ్ల అనంతరం మొదటిసారి స్వదేశంలో ఒక టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ కు గురైంది.3-0 తేడాతో సిరీస్‌లో గ్రాండ్ విక్టరీ సాధించింది.ఈ పరాజయాలు భారత ర్యాంకింగ్ దిగజారడానికి కారణాలయ్యాయి.అయితే దక్షిణాఫ్రికా జట్టు వరుసగా 7 టెస్టు మ్యాచ్ విజయాలు సాధించడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగుపడింది.112 రేటింగ్ పాయింట్లతో సఫారీ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.భారత్ 109 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి దిగజారింది.126 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. తన స్థానాన్ని మరింత…

Read More

ఈనెల 10 నుండి ఐర్లాండ్ తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్ కు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ స్మృతి మంథాన వ్యవహారించనుంది. కెప్టెన్ గా హార్మన్ ప్రీత్ కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు స్మృతి మంథానకు అవకాశం ఇచ్చారు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో హార్మన్ కాలికి గాయమైంది. అయితే వన్డే సిరీస్ లో మాత్రం ఆమె ఆడింది. కానీ ముందు జాగ్రత్తగా ఆమెకు విశ్రాంతినిచ్చారు. రాజ్ కోట్ వేదికగా జనవరి 10, 12, 15వ తేదీలలో మూడు వన్డేల సిరీస్ జరుగనుంది.

Read More

చైనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రజలంతా శుభ్రత పాటించాలని…ఏపి సీఎం చంద్రబాబు సూచించారు.ఎప్పటికప్పుడు 20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు.రాష్ట్రంలో ICMR అధీకృత వైరాలజీ ల్యాబ్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.3వేల హెచ్ఎంపీవీ టెస్టింగ్ కిట్లను, ఔషధాలను రెడీగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా,లిక్విడ్ ఆక్సిజన్ పైపులైన్లపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతుండటంతో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు, రోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లూయంజా కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించాలని, వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు.

Read More

తెలుగు అగ్ర కథానాయకుడు వెంకటేష్, ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”.ఈరోజు నిజామాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల ఈవెంట్ నిర్వహించారు.ఈ సినిమా తారాగణం అంతా హాజరైన ఈ వేడుకలో ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ చూస్తే.. అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ ఎక్కడా మిస్ కాకుండా…వెంకటేష్ మంచి కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు.ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సినిమా జనవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. https://youtu.be/yCkl2Z3PBs0?si=WpV-1VL1u2x3uBdh

Read More

దేశంలో మూడు హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై మాట్లాడారు. ఈ వైరస్ కొత్తదేం కాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణ స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వైరస్ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టంచేశారు. ఈ వైరస్ ను 2001లోనే గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారినీ ఇది ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం చైనాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యమంత్రిత్వశాఖ,…

Read More

దేశంలో HMPA వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపైనా పడింది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1258 పాయింట్ల నష్టంతో 77,964 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 388 పాయింట్లు నష్టంతో 23,616 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.61గా కొనసాగుతోంది. సెన్సెక్స్ లో టైటాన్, సన్ ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు నేడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లో పర్యటించారు. ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన సభలో కుప్పం విజన్-2029 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నెను ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యేని, మీ మనిషిని అని వ్యాఖ్యానించారు. రాజకీయాల ద్వారా మంచి పబ్లిక్ పాలసీ తీసుకుని వస్తే, ప్రజల జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు. ఏవ్యక్తి అయిన దూరదృష్టితో, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తేనే విజయం వస్తుందన్నారు. 1995లో ఎవరూ ఊహించని విధంగా విజన్ 2020 గురించి మాట్లాడాను. అది ఇప్పుడు రియాలిటీ అని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ స్వరాంధ్రవిజన్ 2047తో ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ గారి దూరదృష్టికి నిదర్శనం, కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ అని గుర్తు చేశారు. ఏపీని అభివృద్ధి, సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నాం. కుప్పంకు పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పిస్తాం. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. నీటి భద్రతకు అధిక…

Read More