Author: admin

తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ కథానాయకుడిగా మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విదా ముయార్చి”.ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది.అయితే అనివార్య కారణాల వలన విడుదల వాయిదా వేస్తున్నామని చిత్రబృందం తాజాగా ప్రకటించింది.కొత్త విడుదల తేది గురించి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది.అజిత్ అభిమానులు ఇంకొంత కాలం వేచి ఉండాలని కోరింది.దీనిపై అజిత్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.లైకా ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఇందులో అర్జున్,రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read More

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు శంక‌ర్ దర్శకత్వంలో తెర‌కెక్కించిన చిత్రం గేమ్ ఛేంజ‌ర్‌.ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అన్‌స్టాప‌బుల్ సెట్‌లో రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేశారు.ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ…‘డాకు మహారాజ్‌’, ‘గేమ్‌ ఛేంజర్‌’ రెండు సినిమాలు విజయం సాధించాలని కోరుకున్నారు.‘గేమ్‌ ఛేంజర్‌’ లో కియారా అడ్వాణీ కథానాయికగా నటించింది.ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ఇది సిద్ధ‌మైంది.ఇందులో అంజ‌లి,శ్రీ‌కాంత్,సునీల్‌, ఎస్.జె.సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందస్తున్నాడు. https://youtube.com/shorts/jVaA7XYg_Io?si=PEm1iA0MntrVGes3

Read More

స‌మంత‌కు న‌టి కీర్తి సురేశ్ థాంక్స్. సామ్ వ‌ల్లే త‌న‌కు బేబీ జాన్‌లో యాక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని అన్నారు.‘‘తెరీ’ సినిమా హిందీలో రీమేక్‌ చేయాలని చిత్రబృందం భావించగా కథానాయికగా నేను అయితే న్యాయం చేయ‌గ‌ల‌న‌ని సమంత భావించారు.చిత్ర‌బృందానికి నా పేరు సూచించారు.తమిళంలో ఆమె పోషించిన పాత్రను హిందీలో నేను చేయడం ఆనందంగా ఉంది.ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు. ‘తెరీ’లో సమంత నటన నాకెంతో ఇష్టం.రీమేక్ విష‌యంలో ఆమె నాకెంతో స‌పోర్ట్ ఇచ్చారు.చిత్రబృందం నా పేరు వెల్లడించగానే ‘నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరు’ అని తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు.ఆ సందేశం నాలో నమ్మకాన్ని పెంచింది.ఉత్సాహంగా దీని షూటింగ్‌లో పాల్గొన్నా. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా అని కీర్తి వివరించారు.

Read More

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యవర్గంలో చోటు ద‌క్కించుకున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్.ఈనేప‌థ్యంలోనే నూతన సంవత్సరంలో ట్రంప్ నాయకత్వంలో అమెరికా వెలిగిపోతుందంటూ…మస్క్‌ ఎక్స్ వేదికగా ఆశాభావం వ్య‌క్తం చేశారు.దీనితోతోపాటు తన కుమారుడు ఎక్స్‌కు సంబంధించిన వీడియోను సైతం ఆయన పంచుకున్నారు.‘నేను ఏమి చేయాలి..?’ అని మస్క్‌ తన కుమారుడు ఎక్స్‌ను ప్రశ్నించారు. దీనికి ‘అమెరికాను కాపాడు…ట్రంప్‌నకు సాయం చెయ్యి’ అని బదులిచ్చాడు.ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read More

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు”.ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమాను దర్శకుడు పీరియాడిక్ కథతో రూపొందిస్తున్నారు.అయితే గతకొన్ని రోజులు నుండి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు చిత్రబృందం దీనిపై స్పందించింది.పవన్ ఆలపించిన ఈ పాటని ఈ జనవరి 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.ఈ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను కుషి అవుతున్నారు.ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2025 just got POWER-packed! ⚔️ 🔥Let's Celebrate this New Year with the first single from #HariHaraVeeraMallu ~ Full song out on Jan 6th at 9:06AM💥#MaataVinaali In #Telugu…

Read More

రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. మరో సంవత్సరం పాటు భారతీయులకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతోందని చైనా ఎంబసీ తెలిపింది. 2025 డిసెంబర్ 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతోందని పేర్కొంది. గత సంవత్సరం నుండి వీసా ధరలు తగ్గించారు. సింగిల్ ఎంట్రీ వీసాకు రూ.2900 డబుల్ ఎంట్రీ వీసాలకు రూ.4,400 వసూలు చేస్తున్నారు. ఆరు నెలల గడువు ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు రూ.5900, అంతకంటే ఎక్కువ గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసాలకు రూ.8800 చెల్లింపు ఉంటుంది. ఇక ఇటీవలే చైనా- భారత్ లు వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు కీలకమైన గస్తీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read More

క్రికెట్ ఆస్ట్రేలియా ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేసింది. భారత్ నుండి యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, స్టార్ పేసర్ బుమ్రాకు స్థానం లభించింది. అంతేకాకుండా బుమ్రాను ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంచుకుంది. 2024లో బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో అతను 4 టెస్టులలో 30 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇక జైశ్వాల్ 2024 లో 15 టెస్టు మ్యాచ్ లలో 1478 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా నుండి హేజల్ వుడ్, అలెక్స్ క్యారీ, ఇంగ్లాండ్ జట్టు నుండి జో రూట్, బెన్ డకెట్, బ్రూక్ సౌతాఫ్రికా నుండి కేశవ్ మహారాజ్, న్యూజిలాండ్ నుండి రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, శ్రీలంక నుండి కమిందు మెండీస్ లకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ‘బెస్ట్ టీమ్ ఆఫ్…

Read More

ఏపీ మంత్రి నారా లోకేష్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్టు లోకేష్ ట్వీట్ చేశారు. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని పేర్కొన్నారు . సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలని లోకేష్ అన్నారు.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో అందరికీ ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోందని స్పష్టం చేశారు. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను ఆవిష్కృతం చేశాం. నిరుపేద భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ప్రతి ఇంటా కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపాం. మీ ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్రంలో రహదారులన్నీ గుంతలు లేకుండా చేస్తున్నాం. కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికాం. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని పేర్కొన్నారు . ‘స్వర్ణాంధ్ర-2047’…

Read More

వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ను రానున్న 2025 సంవత్సరం ఫిబ్రవరి 5-9 వరకు మొదటిసారిగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్ లో ప్రకటించారు. దీనిపై ప్రముఖ నటుడు రామ్ చరణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ, భారత ప్రభుత్వం మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం పట్ల హార్షం వ్యక్తం చేశారు.ఫిల్మ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ సమ్మిట్, వేవ్స్ 2025, పరిశ్రమ సహకారానికి నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు. ఇక భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అలాగే వీడియో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ ను హబ్ గా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించనుంది. ఈ సదస్సు మొత్తం…

Read More