Author: admin

ప్రపంచ సంపన్నుడు, స్పేస్ ఎక్స్, టెస్లా వంటి మేటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తాజాగా తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తన ఎకౌంటు పేరును ‘కేకియస్ మాక్సిమస్’గా మార్చారు, ఈ కొత్తపదం ఏంటా అని నెటిజన్లు వెతికేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి మస్క్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. కాగా, కేకియస్ ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్ పలు బ్లాక్ చెయిన్ ప్లాట్ ఫామ్ లలో ఇది లభ్యమవుతోంది. ఈ క్రిప్టోకు ఇటీవల కాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. మార్కెట్లో దీని గురించి బాగా వినిపిస్తోంది. అలాగే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మస్క్ ఆ కరెన్సీ పేరును తన బయోలో చేర్చినట్లు తెలుస్తోంది. 2023లో కూడా ఎలాన్ మస్క్ ఆయన ఖాతాను ‘మిస్టర్ ట్వీట్’గా మార్చుకున్న సంగతి తెలిసిందే.

Read More

ఏడాది చివరి రోజును దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగించాయి. నష్టాలతో నేడు ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు ఆద్యంతం నష్టాలలోనే పయనించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 109 పాయింట్ల నష్టంతో 78,139 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించింది. 0.10 పాయింట్లు నష్టపోయి 23,644 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.65గా కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్ లో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐటీసీ, అల్ట్రా టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సిద్ధమయ్యాయి.అయితే అన్ని దేశాలకు అంటే ముందుగా,పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి.భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలకు కిరిబాటి ప్రజలు 2025లోకి అడుగుపెట్టారు. కిరిబాటి దీవులు కిరిబాటి దీవులు భూమి గ్రీన్విచ్ టైమ్‌లైన్‌కు అత్యంత దగ్గరగా ఉన్నాయి.ఈ దీవుల్లోని కార్బెలిన్ ప్రాంతం కొత్త సంవత్సరానికి ప్రపంచంలో మొదట స్వాగతం పలికే ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది.కిరిబాటి తర్వాత గంట వ్యవధిలోనే దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లోని టోంగా మరియు సమోవా దీవులు కొత్త సంవత్సర వేడుకలను జరుపుకొనున్నాయి. అనంతరం న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,జపాన్,దక్షిణ కొరియాలు ప్రపంచంతో పాటు వేడుకలను జరుపుకోనున్నాయి.న్యూజిలాండ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30కి 2025కి స్వాగతం పలకనుంది.ఆస్ట్రేలియా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటల సమయంలో న్యూ ఇయర్ కు స్వాగతం పలకనుంది.జపాన్ మరియు ఉభయ కొరియాలు వేడుకలతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా…

Read More

నేడు 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ సంవత్సరం భారత్ సాధించిన విజయాలను గురించి వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘సమష్టిగా ప్రయత్నించి.. 2024లో అనేక విజయాలు అందుకున్నాం. 2025లో మరింత కష్టపడి పనిచేసి ‘వికసిత్ భారత్’ స్వప్నం సాకారం చేసుకుందామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ వీడియో ఒక ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధి, ఐక్యత, వికసిత్ భారత్ వైపు వేసిన అడుగులను గుర్తుచేస్తుందని వివరించారు. Collective efforts and transformative outcomes!2024 has been marked by many feats, which have been wonderfully summed up in this video. We are determined to work even harder in 2025 and realise our dream of a Viksit Bharat.…

Read More

ఆదాయపు పన్ను శాఖతో పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంలో పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024లో ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రకటించింది.తక్కువ స్థాయి పన్ను వివాదాల పరిష్కారం కోసం పన్ను వివాదాలను సులభంగా పరిష్కరించుకునేందుకు దోహదం చేసే ఈ పథకం గడువును ఆదాయ పన్ను విభాగం పొడిగించింది. 2024 డిసెంబర్ 31 ఈ పథకం డెడ్లైన్ ముగియాల్సి ఉండగా మరో 15 రోజులపాటు చెల్లింపుదార్లకు అవకాశం కల్పించింది. 2025 జనవరి 15 వరకు గడువును పెంచుతున్నట్టు తాజాగా నేడు ప్రకటించింది. వివాదాస్పద పన్నులో 10 శాతం చెల్లించి సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కల్పించింది. గడువు దాటిన తర్వాత, జనవరి 31 వరకు వివాదాస్పద పన్నులో 100 శాతం, లేదా, 25 శాతం ఆలస్య జరిమానా/వడ్డీ చెల్లించి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 నుండి పన్నులో 110 శాతం లేదా వడ్డీలో 30 శాతం…

Read More

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న జ‌ర్మ‌నీ ఎన్నికల్లో అక్క‌డి ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని పిలుపునిచ్చారు జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని వ్యాఖ్యలు చేశారు.అతివాద పార్టీ ఆల్టర్‌నేటివ్ ఫర్ డౌచ్‌లాండ్‌కు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఒలాఫ్ ఈ విధంగా స్పందించారు.జ‌ర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ పార్లమెంటులో విశ్వాసం కోల్పోయారు.733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్‌ జరగ్గా 207 ఓట్లే ఆయ‌న‌కు అనుకూలంగా వ‌చ్చాయి.వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు.మెజారిటీకి 367 ఓట్లు అవసరం.దాంతో అక్కడ ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.ఫిబ్రవరి 23న ఈ పోలింగ్ జరగనుంది.ఛాన్స్‌లర్‌గా ఒలాఫ్ షోల్జ్‌ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read More

శివ కార్తికేయ‌న్,సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అమరన్‌’.దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా విజయాన్ని సాధించింది.తాజాగా నటి జాన్వీకపూర్‌ ఈ చిత్రం వీక్షించారు.త‌న దృష్టిలో ఈ ఏడాది ‘అమరన్‌’ బెస్ట్‌ చిత్రమని అభిప్రాయం తెలిపారు.‘‘ఈ సినిమా చూడటం కొంచెం ఆలస్యమైంది. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం భావోద్వేగంతో నిండిఉంది. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించాను. ‘అమరన్‌’ నా హృదయాన్ని కదిలించింది.ఇందులోని ఎమోషన్స్‌ నా హృదయాన్ని బరువెక్కించాయి’’ అని పేర్కొన్నారు.2014లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్‌ జీవిత కథతో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ఎంతోమంది స్టార్స్‌ ప్రశంసలు కురిపించారు.

Read More

రాష్ట్రంలో ఉదయం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. 63,77,943 మందికి పెన్షన్లు పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే నేడు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో లబ్దిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. శారమ్మ అనే లబ్దిదారికి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ నగదు అందజేసి, ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. మరో లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం. దీపం పథకం గురించి ఆరా తీసి, ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి, కుటుంబ సభ్యులకు అందించారు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని,…

Read More

డిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ద‌గ్గ‌ర‌వుతోంది.ఈ నేపథ్యంలోనే ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.ఢిల్లీలోని జంగ్‌పుర అసెంబ్లీ స్థానం నుండి పోటీకి దిగిన సిసోదియా.ప్రజల మద్దతు కోరారు.ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు.దీని ద్వారా తనకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం నేను ఎన్నికల బరిలోకి దిగాను.మీ మద్దతుతో ఇన్నాళ్లూ విజయం సాధించా.ఈసారి కూడా మీ సహకారం కావాలి.నాకు ఆర్థిక సాయం చేయండి.మీరు అందించే విరాళం దిల్లీలో ఉద్యోగ,విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని సిసోదియా పేర్కొన్నారు.

Read More

కాల ప్రవాహంలో ప్రపంచం వేగంగా పరుగులు తీస్తుంది. తరాలు మారుతున్నాయి. కొత్త తరాలు దూసుకొస్తున్నాయి. గడిచిన శతాబ్దాన్ని ఒకసారి తిరిగి చూసుకుంటే 1928-45 మధ్య పుట్టిన వాళ్లని సైలెంట్ జెనరేషన్ అని 1946-64 బేబీ బూమర్స్, 1965-80 జెనరేషన్ X, 1981-96 మిలీనియల్స్ (జెనరేషన్ Y), 1997-2010 (జెనరేషన్ Z), 2011-2024 జెనరేషన్ ఆల్ఫా గా పిలుస్తున్నారు. ఇక రేపటి నుండి 2024-2039 వరకు జెనరేషన్ బీటాగా పరిగణించనున్నారు. ఆయా తరాలు ఎన్నో భౌగౌళిక, రాజకీయ, సామాజిక, వాతావరణ, సాంకేతిక మార్పులకు సాక్షిభూతాలుగా నిలిచాయి. సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఇక ఇప్పుడు మిగిలి ఉన్న తరాలు రేపటి రానున్న తరానికి స్వాగతం పలుకుతున్నాయి.

Read More