Author: admin

దేశరాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ‘పూజారీ గ్రంథీ సమ్మాన్‌ యోజన’ కింద ప్రతి అర్చకుడికి, గురుద్వారాల్లోని గ్రంథీలకు నెలకు రూ.18వేలు గౌరవ వేతనంగా అందజేస్తామని ప్ర‌క‌టించారు.ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు.తానే ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తానని తెలిపారు.మహిళా సమ్మాన్‌ యోజనను ఎలా అయితే బీజేపీ ఆపాలని చూస్తుందో అలా ఈ పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే వారికి మహా పాపం తగులుతుందన్నారు.

Read More

హనుమాన్ జ‌యంతి సందర్భంగా తమిళనాడులోని నామక్కల్‌ ఆంజనేయస్వామి ఆలయంలో మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని ప‌లు రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు.సోమవారం వేకువజామున 18 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని 1,00,008 వడల మాలలతో అలంకరించారు.మధ్యాహ్నం కొబ్బరి నూనె, శెనగపిండి, పాలు, పెరుగు, పంచామృతం, చందనంతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు.భారీగా తరలివచ్చిన భక్తులకు వడలను ప్రసాదంగా అందించారు.

Read More

శీతాకాల స‌మావేశాల్లో భాగంగా పార్లమెంటు ఆవరణలో డిసెంబర్ 19న ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి,ముకేశ్‌ రాజ్‌పూత్‌ గాయపడిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒకరైన ప్రతాప్‌చంద్ర సారంగి కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు.పార్లమెంట్‌ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రాహుల్‌ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్‌సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారని అలాంటి పదవిలో కొనసాగుతున్న రాహుల్ ఈవిధంగా ప్రవర్తించడం సరైనది కాదని అన్నారు.దాదాపు 10 రోజులు తాను ఆస్ప‌త్రిలో ఉండాల్సి వ‌చ్చింద‌న్నారు. తోపులాట కార‌ణంగా తలపై కుట్లు ప‌డ్డాయని అవి ఇంకా మాన‌లేద‌ని తెలిపారు.

Read More

రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్రం సీక్వెల్‌ త్వరలో పట్టాలు ఎక్కనుంది అని సమాచారం.దీపికా పదుకొణె షూట్‌లో పాల్గొననున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై దీపిక తాజాగా స్పందించారు. ఆయా కథనాల్లో నిజం లేదని పరోక్షంగా తెలిపారు. ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత కుమార్తె దువా అన్నారు పాప సంరక్షణను పక్కన పెట్టేసి వెంటనే వర్క్ లైఫ్‌లో బిజీ కావాలనుకోవడం లేదన్నారు.‘‘నా కుమార్తెను నేనే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను అని చెప్పారు.మా అమ్మ నన్ను ఎలా అయితే చూసుకున్నారో అదే విధంగా నా పాపను నేను చూసుకోవాలనుకుంటున్నాను….తన ప్రతిక్షణాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నా’’ అని ఆమె తెలిపారు.

Read More

దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీదరూ. 36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.931 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా దేశంలోని సీఎంల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఆయనకు రూ. 10 కోట్ల అప్పు ఉంది. ఇక ఈ జాబితాలో కేవలం రూ.15 లక్షల ఆస్తితో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆఖరి స్థానంలో నిలిచారు. దేశంలోని 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ. 1,630 కోట్లుగా ఉంది. టాప్-5 ధనిక సీఎంలు: నారా చంద్రబాబు నాయుడు – ఆంధ్రప్రదేశ్ (రూ.931.83 కోట్లు) పెమా ఖండు…

Read More

కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ భక్తులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్తని అందించారు. త్వరలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారుసు లేఖలకు టీటీడీ అనుమతి లభించనుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కలిశారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు విఐపి బ్రేక్ దర్శనానికి వారానికి రెండు (12 టికెట్లు) సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అంగీకారం తెలిపినట్లు టీటీడీ చైర్మన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. వారానికి రెండు సిఫారుసు లేఖల చొప్పున మూడు వందల రూపాయల దర్శనానికి ఏపీ సీఎం అనుమతిచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఇంతకుముందు ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయగా.. ఏపీ సీఎం చంద్రబాబు దానికి బదులిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలనే మీ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం. తెలుగు…

Read More

భారత పేస్ బౌలింగ్ విభాగానికి వెన్నుముకగా నిలుస్తూ అద్భుతమైన ప్రదర్శనతో మేటి బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (2024) అవార్డు రేసులో నిలిచాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ , ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ రేసులో ఉన్నారు. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా, రూట్, బ్రూక్, శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ నామినేట్ అయ్యారు. 2024లో 13 టెస్టులాడిన బుమ్రా 14.92 యావరేజ్, 30.16 స్ట్రైక్తేటుతో 71 వికెట్లు తీశాడు. ప్రస్తుత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా అత్యధికంగా 30 వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం ఎమెలియా కెర్ (న్యూజిలాండ్), చమరి ఆటపట్టు (శ్రీలంక), లారా వోల్వార్డ్…

Read More

పీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం విజయవంతమైంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేపట్టిన ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి కొద్దిసేపటి క్రితం రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నిప్పులు చిమ్ముతూ మొదటి ప్రయోగవేదిక నుండి ఈ ప్రయోగ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట రెండు ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లో అనుసంధానం చేసే ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్షంలోనే స్పేస్ షిప్ లను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న స్పేస్ షిప్ లను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం అవడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తూ…

Read More

వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ను రానున్న 2025 సంవత్సరం ఫిబ్రవరి 5-9 వరకు మొదటిసారిగా నిర్వహించనున్నారు. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్ లో ప్రకటించారు. భారతదేశ సృజనాత్మక ప్రతిభకు ఈ వేవ్స్ సమ్మిట్ ప్రపంచ వేదికగా నిలవనుంది. మన దేశం సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అలాగే వీడియో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ ను హబ్ గా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించనుంది. ఈ సదస్సు మొత్తం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలు అతిపెద్ద అనుసంధాన కార్యక్రమం అవుతుంది.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఎస్.ఐ.పీ.బీ సమావేశం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి.‌ వాటిపై ఎస్.ఐ.పీ.బీ సమావేశంలో చర్చించారు. ఇక దరఖాస్తు చేసుకున్న 9 సంస్థలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. బీపీసీఎల్, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ వంటి తదితర ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. రానున్న ప్రాజెక్టుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఈసందర్భంగా అధికారులను ఆదేశించారు.

Read More