నాలుగు దశాబ్దాల క్రితం 1984 డిసెంబరు 3న డిసెంబరు 2 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశ చరిత్రలో అత్యంత విషాదకర దుర్ఘటన గా పేర్కొంటారు. భోపాల్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ సంస్థ ఆవరణలో దాదాపు 40 ఏళ్లుగా పడివున్న 377 టన్నుల విషపదార్థాల తరలింపు కార్యక్రమం మొదలైంది. జీపీఎస్ అమర్చిన పలు ట్రక్కులు, అత్యంత పటిష్టంగా తయారుచేసిన కంటైనర్లతో అక్కడి నుండి తరలిస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, డాక్టర్లు, నిపుణులు అక్కడికి చేరుకొన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో పోలీసు బలగాలను మోహరించారు. వీటిని ఇండోర్ సమీపంలోని పీతంపుర్ ప్రాంతానికి తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ వ్యర్థాల తరలింపులో ఆలస్యంపై రాష్ట్ర అధికారులకు కోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో అధికార వర్గాల్లో కదలిక వచ్చింది. వీటిని తరలించడానికి నాలుగువారాల డెడ్లైనన్ విధించింది. ఈ…
Author: admin
నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పవన్ స్పందన తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.మనతో ప్రయాణం చేసి శ్రమించిన వారని తాను గుర్తించాలని అన్నారు.తనతోపాటు సమానంగా నాగబాబు పనిచేశారని…వైసీపీ వాళ్లు ఎన్నోసార్లు అవమానించినా ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు.కులం, బంధుప్రీతి ఇక్కడ ప్రమాణీకం కాదని..పనిమంతుడా కాదా అనే విషయాన్నే తాను చూస్తానని స్పష్టత నిచ్చారు.ఎంపీగా ప్రకటించి.. ఆయన్ని తప్పించామన్నారు.ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చామన్నారు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తామని తెలిపారు.
హెచ్1 బీ వీసాల విస్తరణపై అవసరమైతే యుద్ధానికైనా వెనుకాడనని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా అమెరికా కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. తాను ఇంతటివాడిని కావడానికి హెచ్-1బీ వీసానే కారణమని మస్క్ పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన ట్రంప్.. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా కార్యక్రమానికి (హెచ్-1బీ) తానెప్పుడూ అనుకూలమే అని అన్నారు.‘నాకు హెచ్-1బీ వీసాలపై నమ్మకం ఉంది.నేను వీటిని చాలాసార్లు ఉపయోగించాను.ఇది గొప్ప కార్యక్రమం.అందుకే దేశంలో ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన,సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు.మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారుఈ ఘటనలో అల్లు అర్జున్‌ను దోషిగా చేయడం సరికాదన్నారు.‘‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు.అభిమాని మృతి చెందిన వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. అల్లు అర్జున్ కాకపోయినా ఆయన టీమ్ అయినా స్పందించాల్సింది.సంతాపం తెలపాల్సింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఆయన్ని అరెస్ట్ చేశారనడం సరికాదురేవంత్ గొప్ప నాయకుడు.కిందిస్థాయి నుంచి ఎదిగారు.బన్నీ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు. వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదు.బెనిఫిట్ షో టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చారు.అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు.తెర ముందు,వెనుక ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియదు.ఇలాంటి ఘటనల్లో నేను…
కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి వర్తించదా? అని నిలదీసింది.బీదర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ సచిన్ పంచాల్ ఆత్మహత్యకు ఖర్గే కుమారుడు, రాష్ట్ర మంత్రి అయిన ప్రియాంక ఖర్గేయే కారణమని బీజేపీ నేత ఆర్ అశోక విమర్శించారు.అందరికీ హితబోధనలు చేసే ప్రియాంక్ ఖర్గే పదవికి రాజీనామా చేసి తన నైతికత చూపాలని ఆయన డిమాండ్ చేశారు.కాంట్రాక్టర్ పంచాల్ మృతితో ప్రియాంక్ సన్నిహితులకు సంబంధం ఉందని అశోక్ ఆరోపించారు.తనపై వచ్చిన ఆరోపణలను ప్రియాంక్ ఖండిస్తూ…మృతుడు రాసిన సూసైడ్ నోట్‌లో తన పేరు లేదని అన్నారు.
రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు సంఘాలు ఈరోజు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చాయి.పాలు,పండ్లు,కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు రోడ్డు,రైలు మార్గాలను పూర్తిగా దిగ్బంధించి పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించడానికి రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ బంద్‌కు పలు వాణిజ్య,వ్యాపార,విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి.అంబులెన్స్,వివాహ వాహనాలు తప్ప మిగతావేవీ రోడ్లపై అనుమతించమని బంద్‌కు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు వెల్లడించాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే (నాలుగో) టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది.ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 155 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్ లో 234 పురుషులకే కట్టడి చేసిన భారత్ బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలమైంది. యశస్వీ జైశ్వాల్ 84 (208; 8×4 ) ఒక్కడే చెప్పుకోదగిన ప్రదర్శన కనబరిచాడు. రిషబ్ పంత్ 30 (104;2×6) పర్వాలేదనపించాడు. ఒకానొక దశలో గెలవకపోయినా డ్రా చేసుకునే స్థితి లో నిలిచిన భారత్ పంత్ వికెట్ కోల్పోయిన అనంతరం మిగిలిన బ్యాటర్లు కూడా పెవిలియన్ కు క్యూ కట్టారు. కనీసం మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. రోహిత్ శర్మ (9), కే.ఎల్. రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5), జడేజా…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను ఆయన కలిశారు. రామ్‌చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని పవన్‌ను కోరారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 4 లేదా 5వ తేదీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని ఇటీవల దిల్‌రాజు తెలిపారు.
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్- అలియాభట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్‌కు వెళ్లారు.కుమార్తె రాహతో కలిసి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు.ఈక్రమంలోనే రాహ తన క్యూట్‌నెస్‌తో అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లనే కాకుండా నెటిజన్ల మది కూడా గెలుచుకుంది. ఫొటోగ్రాఫర్లకు బై చెబుతూ నవ్వులు పూయించింది. ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. కుమార్తెను చూసి అలియా నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
కేరళలోని ప్రఖ్యాత క్షేత్రం శబరిమల ఆలయం రానున్న మకరజ్యోతి పండుగను పురస్కరించుకొని ఈరోజు నుండి తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవరు నేతృత్వంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్ అరుణ్‌కుమార్ ఆలయాన్ని తెరుస్తారని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది జనవరి 14న సంక్రాంతి నాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. భారీ సంఖ్యలో స్వాములు, భక్తులు జ్యోతి దర్శనంలో పాల్గొంటారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
