Author: admin

అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు.అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ. కార్టర్ 3 తెలిపారు.జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం ప్రకటించారు.వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, మానవ హక్కుల అభివృద్ధి,స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారని బైడెన్ పేర్కొన్నారు.జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కూడా సంతాపం తెలిపారు.అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.

Read More

భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకమని కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.భారత భద్రతా వ్యవస్థపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రత విషయంలో మనం అంత అదృష్టవంతులం కాదని బయట మరియు అంతర్గతంగా శత్రువుల కదలికలపై దృష్టి ఉంచాలని సైన్యానికి సూచించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు తీసుకుంటున్న కఠినమైన శిక్షణతో పాటు మీ అంకితభావాన్ని ఇక్కడికి వచ్చినప్పుడల్లా తాను చూస్తున్నానని దేశం పట్ల బాధ్యతాయుతమైన మీ తీరు మాలో స్ఫూర్తి నింపుతోందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత గురించి తీసుకుంటే మనం అంత అదృష్టవంతులం కాదు. ఎందుకంటే ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. మరోవైపు అంతర్గతంగానూ భద్రతా పరమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. శత్రువులు కార్యకలాపాలపై మరింత నిఘా…

Read More

నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి భారత అంతరిక్షపరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నేడు రాత్రి 9.58 గంటలకు నింగిలోకి పీ.ఎస్.ఎల్.వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. గత రాత్రి 8:58 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సుమారు 25 గంటలపాటు ప్రక్రియ కొనసాగనుంది. స్పాడెక్స్ అనే ఉపగ్రహం ద్వారా చేజర్, టార్గెట్ అనే రెండు ఉపాగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో పేర్కొంది.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీ.ఎస్)గా కె.విజయానంద్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్ ను ఎంపిక చేసింది. త్వరలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విజయానంద్ ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Read More

కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఏరియాలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుండి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై డిప్యూటీ సీఎం మరియు పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ శ్రీ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శ్రీ శంకరరావుతో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి సరకులు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయని తేలింది. దీనిపై మరింత లోతుగా తనిఖీలు…

Read More

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహా కుంభ్‌నగర్‌లో త్వరలో జరగనున్న కుంభమేళాకు ఏర్పాట్లు భారీ స్థాయిలో చేస్తున్నారు. గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమ స్థలిలో 2,000 డ్రోన్లతో ఆకాశంలో అద్భుత ప్రదర్శన నిర్వహించనున్నారు.జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళా ఆరంభ, ముగింపు దినాల్లో డ్రోన్ల ప్రదర్శన ఉంటుందని జిల్లా పర్యాటక అధికారి వెల్లడించారు.ఈ డ్రోన్ల తో ప్రయాగ మహత్యం, మహా కుంభ్‌ కథలను ప్రదర్శించనున్నారు.క్షీర సాగర మథనం, అమృత కలశ ఆవిర్భావాలనూ చూపించానున్నారు.పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను ప్రపంచస్థాయి ఉత్సవంగా నిర్వహించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ భావిస్తున్నారు.అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More

తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సత్తా చాటింది. కోనేరు హంపి న్యూ యార్క్ లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించి విజయం సాధించింది. 2019లో కూడా ఆమె ఛాంపియన్ గా నిలిచింది. చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా హంపి ఘనత సాధించింది. మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో ఉన్నా తరువాత వెనుకబడిపోయాడు. పురుషుల ర్యాపిడ్ ఈవెంట్లో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలాదర్ ముర్జిన్ 10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. అర్జున్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమని ఏపీ…

Read More

పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులను ఉద్దేశించి తాజాగా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పోస్ట్‌ పెట్టింది. ‘ఆయన్ని ఇబ్బంది పెట్టకండి’ అని విన్నపం చేసింది. ‘‘ఓజీ’పై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు నిరంతరం పనిచేస్తున్నాం. కానీ, పవన్‌కల్యాణ్‌ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, ఆయన్ని ఇబ్బందిపెట్టడం సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యత. కాబట్టి కొన్ని రోజులు ఓపికగా ఎదురుచూద్దాం’’ అని పేర్కొంది. జవహర్‌ బాబును పరామర్శించేందుకు నిన్న కడప రిమ్స్‌కు వెళ్లిన పవన్‌ ఫ్యాన్స్‌ ప్రవర్తనతో ఇబ్బందిపడ్డారు.…

Read More

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు మొదటి సారి సౌతాఫ్రికా అర్హత సాధించింది. పాకిస్థాన్ తో తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్ లో గెలిచి డబ్ల్యూటీసీ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ టెస్టులో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 27/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా మార్‌క్రమ్ (37), తెంబా బావుమా (40) రాణించడంతో సునాయసంగా లక్ష్యం వైపు దూసుకెళ్లేలా కనిపించింది. ఒక దశలో 93/4 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న ఆ జట్టు అనంతరం 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టెయిలెండర్ కగిసో రబాడ (31) మంచి పోరాటం కనబరిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మార్కో యాన్సెన్ (16) రబడాకు మంచి సహాకారం అందించాడు. రెండో ఇన్నింగ్స్ లో పాక్…

Read More

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన వారి పేర్లను ప్రకటించింది. ఈ సంవత్సరం అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారికి ఈ అవార్డును ఇస్తారు. నలుగురు ఆటగాళ్లు షార్ట్ లిస్ట్ కాగా ఇందులో భారత్ నుండి బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం లభించింది. పాకిస్థాన్ నుండి బాబర్ అజామ్, జింబాబ్వే నుండి సికందర్ రాజా, ఆస్ట్రేలియా నుండి ట్రావిస్ హెడ్ నామినేట్ అయ్యారు. ఇక మహిళల విభాగంలో శ్రీలంక కు చెందిన చమరి ఆటపట్టు, న్యూజిలాండ్ కు చెందిన మెలీకెర్, ఐర్లాండ్ క్రికెటర్ ఓర్లా ప్రెండర్ గాస్ట్, సౌతాఫ్రికా క్రికెటర్ లారా ఓల్వార్ట్ నామినేట్ అయ్యారు.

Read More